NewsOrbit
రాజ‌కీయాలు

డిజి ఠాకూర్‌పై మళ్లీ ఫిర్యాదు

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టిడిపి కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతుందని వైసిపి ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గురువారం వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు వైవి సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ తదితరులు కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్‌ కమిషన్‌తో సమావేశమయ్యారు. టిడిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఫిర్యాదు చేశారు.

అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను భేఖాతరు చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొందని అన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం ఐటి, సిబిఐని రాష్ట్రంలోకి అనుమతించమని చెప్పిందనీ, ఇప్పుడు స్వతంత్ర రాజ్యంగ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చంద్రబాబు ఖాతరు చేయటం లేదనీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. దీనికి మూల కారకులు డిజిపి ఆర్‌పి ఠాకూర్ అని ఆయన ఆరోపించారు.

ఠాకూర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనీ, టిడిపికి అనుకూలంగా పనిచేసేలా పోలీసు యంత్రాగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఠాకూర్‌‌ను తక్షణం బదిలీ చేయాలనీ, లేని పక్షంలో రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా జరగవనీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని విజయసాయి రెడ్డి చెప్పారు.

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అదే విధంగా కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ప్రభుత్వం పసుపు-కుంకుమ పథకం కింద నేరుగా మహిళ ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్న వైనంపై కూడా ఫిర్యాదు చేశామన్నారు.

అలాగే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై కూడా విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. కేఏ పాల్ చంద్రబాబుతో లాలూచి పడ్డారనీ, డబ్బులకోసం చంద్రబాబుకు అమ్ముడు పోయారనీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. అందుకే వైసిపి అభ్యర్థులకు ఉన్న పేర్లతోనే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేశారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు.

Related posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

Leave a Comment