NewsOrbit
న్యూస్ సినిమా

Venkatesh – Rana: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వెంకీ – రానా కాంబో ఇప్పటికి సెట్ అయింది..దీని వెనకుంది ఆయనేనా..?

Venkatesh – Rana: ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్‌లో నిర్మించే ప్రతీ సినిమాను లెజండరీ నిర్మాత దివంతగ డా.డి రామానాయుడు తనయుడు డి సురేశ్ బాబు ఫైనల్ చేస్తారు. అంతేకాదు అయన సోదురుడు వెంకటేశ్, కొడుకు రానా నటించే సినిమాల కథలు కూడా దాదాపు ఆయనే ఫైనల్ చేస్తారని చెప్పుకుంటుంటారు. కథ వింటే ఆ కథ ఎవరికీ సూటవుతుందో చెప్పగల టాలెంట్ ఉన్న నిర్మాత సురేశ్ బాబు. అలాగే సీన్‌ను బట్టి లొకేషన్‌ను క్యారెక్టర్‌ను బట్టి ఆర్టిస్టును ఫైనల్ చేయగల కెపాసిటీ ఉన్న అగ్ర నిర్మాత సురేశ్ బాబు. అంతేకాదు ఇతర భాషలో సూపర్ హిట్ అయిన సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రైట్స్ కొని దాన్ని ఇక్కడ ఏ హీరోతో చేస్తే హిట్ సాధిస్తుందో కూడా చెప్పగలరు.

venkatesh-rana-combo project is fixed
venkatesh-rana-combo project is fixed

అందుకే, సురేశ్ ప్రొడక్షన్స్‌లో రీమేక్ అయిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌ను సాధించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సోదరుడు వెంకటేశ్, కొడుకు రానా హీరోలుగా మలయాళ బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. వెంకటేశ్‌కు రీమేక్ సినిమాలు బాగా కలిసి వస్తాయి. అందుకే సురేశ్ బాబు ఆయన కోసం మంచి కథలను వెతికి మరీ పట్టుకుంటుంటారు. ఇటీవల వెంకీ నటించిన దృశ్యం సీక్వెల్స్ ఎంత పెద్ద హిట్టయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే, ఎప్పటి నుంచో వెంకీ – రానాలిద్దరికీ సూటయ్యే రీమేక్ కథను వెతుకుతున్నారట సురేష్ బాబు.

Venkatesh – Rana: త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌..!

ఆ కథ ఇప్పుడు దొరికిందని సమాచారం ఆ సినిమానే మలయాళ బ్లాక్ బస్టర్ బ్రో డాడీ. మోహన్ లాల్ -పృథ్వీరాజ్ ఈ సినిమాలో తండ్రి – కొడుకులుగా నటించారు. ఇది రెండు కుటుంబాల మద్య సాగే కథ. మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ మలయాళంలో భారీ వసూళ్ళను రాబట్టింది. మోహన్ లాల్ – పృథ్వీరాజ్ పాత్రలలలో వెంకీ – రానా సరిగ్గా సరిపోతారని సురేశ్ బాబు చాలా నమ్మకంతో ఈ మూవీ తెలుగు రీ మేక్ రైట్స్ దక్కించుకున్నారట. ఇందులో వెంకీ – రానా తండ్రీ – కొడుకులుగా నటిస్తారని సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయని తెలుస్తోంది.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N