Samantha: సమంత అక్కినేని కాస్త సమంత రూత్ ప్రభు అని మారడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ‘ఏ మాయ చేసావే’తో యావత్ తెలుగు యువతనే మాయ చేసిన సామ్, అందులో హీరోగా నటించిన నాగ చైతన్యని కూడా పడేసింది. ఇంకేముంది.. కట్ చేస్తే ప్రేమ, పెళ్లి రెండు కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే జరిగిపోయాయి. వీరి పెళ్లి ఎంతో అట్టహాసంగా రెండు సార్లు జరిగింది. ఓ సారి హిందూ సంప్రదాయంలో, రెండో సారి క్రిస్టియన్ సంప్రదాయంలో. ఓ క్రమంలో వీరిది అన్యోన్య దాంపత్యమంటూ కొనియాడారు. మరి దిష్టి తగిలినదేమో గాని వీరు తాజాగా విడిపోయారు.
Tingling sensation: కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయా..!? నీళ్లలో ఇది వేసుకుని తాగండి..
Samantha: ‘సమంత’ ప్రేమ కావ్యం విశేషాలు..
గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పేరు శాకుంతలం. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ పోషించిందన్న సంగతి అందరికీ విదితమే. కాగా ఈ క్యారెక్టర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇకపోతే అసలు విషయానికొస్తే, మన హిందూ పురాణాలకు చెందిన శాకుంతల-దుష్యంతుడి ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Trivikram Mahesh: త్రివిక్రమ్.. మహేష్ హ్యాట్రిక్ సినిమా పూజ ఫోటోలు..!!
వేరే లెవల్లో సినిమా ఉండబోతుందని టాక్.!
అవును.. ఈ సినిమా వేరే లెవల్లో ఉండబోతుందని మేకర్స్ ధీమాగా వున్నారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఇందులో ఆమె లుక్ నేషనల్ లెవెల్లో పాపులర్ అవ్వడం ఖాయం అని అంటున్నారు మేకర్స్. కాగా గుణశేఖర్, దిల్ రాజు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ పాత్రలో తొలిసారిగా నటించింది. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో సమంత క్రేజ్ సంపాదించడం ఖాయమని అంతా అనుకుంటున్నారు.