NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: కొత్త ప్రాజెక్ట్‌కు అన్నీ సెట్..ఆ ఒక్కటీ తప్ప..!

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ నెల 11వ తేదీన రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మూడేళ్లుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి పలు వాయిదాల తర్వాత ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఆనందానికి అవధులు లేవు. ఇక ఇప్పుడు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే రాజా డీలక్స్ సినిమా గురించి. గతకొన్ని రోజులుగా ఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు మారుతికి ప్రభాస్ ఎలా ఓకే చెప్పారు అని. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు.

everything is set for prabhas and maruthi raja delux except that one
everything is set for prabhas and maruthi raja delux except that one

ప్రస్తుతం దీనికి సంబంధించిన సెట్ వర్క్ జరుగుతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుకున్న సమాచారం. దానయ్య నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించనున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఇతర నటీనటులు సినిమాకు పనిచేసే సాంకేతిక నిపుణులు కూడా ఫైనల్ అయినట్టు సమాచారం. మొత్తంగా మిగిలింది అఫీషియల్‌గా ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయడమే బ్యాలెన్స్ ఉంది. ఆ ఒక్కటీ అయిపోతే ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ గురించి అప్‌డేట్ రావాల్సి ఉంది. ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు. రాధేశ్యామ్ రిలీజ్ వరకు ఆ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండే ప్రభాస్ ఆ తర్వాత ప్రాజెక్ట్ కె, సలార్ చిత్రాల షూటింగ్‌ను పూర్తి చేయాల్సి ఉంది.

Prabhas: మారుతి – ప్రభాస్‌ల రాజా డీలక్స్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు..!

అయితే, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేసే సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కె చాలా సమయం పడుతుంది కాబట్టి మారుతి సినిమాకు అవకాశం దొరుకుందని ఎదురుచూస్తున్నారట. మారుతి సినిమాను త్వరగానే పూర్తి చేసేస్తాడు. అందుకే పక్కా ప్లాన్‌తో ఉన్నాడట. ప్రభాస్ కూడా ఈ మూవీ కోసం చాలా తక్కువ రోజులే డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు గనక పూర్తైతే మారుతి – ప్రభాస్‌ల రాజా డీలక్స్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేయాల్సిన స్పిరిట్ కూడా ఈ ఏడాది సెట్స్ మీదకు రావాల్సి ఉంది. ఇవి కాకుండా బాలీవుడ్ మేకర్స్ కూడా ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

Related posts

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju