NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: బీజేపీలో చేరికకు మూహూర్తం ఖరారు .. ఢిల్లీలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

BJP: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరేందుకే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇవేళ కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారని సమాచారంయ. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రెండు రాష్ట్రాల్లో పార్టీకి ఉపయోగపడతారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే నల్లారి కిరణ్ కుమార్ సేవలను ఏపికి పరిమితం చేస్తారా.. తెలంగాణలోనూ ఎన్నికల సమయంలో వినియోగించుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

Nallari Kiran Kumar Reddy likely to join bjp today

 

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికపై ఏపి బీజేపీ నాయకులు ఎవరూ ఇంత వరకూ స్పందించలేదు.  నేరుగా ఆయన పార్టీ కేంద్ర పెద్దల వద్ద పార్టీలో చేరుతున్నారు. ఆయనకు సముచిత గౌరవంతో పార్టీలో కీలక పదవి అప్పగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినబడుతున్నాయి. తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతున్న రీతిలో ఏపిలో మాత్రం అడుగులు పడటం లేదు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీలో చేరికలు జరిగాయి. ఆ తర్వాత సోము వీర్రాజు పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆయన పార్టీలో జోష్ నింపలేకపోయారు. టీడీపీ, వైసీపీ నుండి భారీగా చేరికలు ఉంటాయంటూ గతంలో సోము వీర్రాజు ప్రకటనలు చేశారు. కానీ ఆ దిశగా చేరికలు మాత్రం జరగలేదు. దానికి తోడు పార్టీ గ్రూపు విభేదాలు తలెత్తాయి. సోము వీర్రాజు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పార్టీలోని కొందరు నేతలు కేంద్ర కమిటీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి కి పార్టీ అధిష్టానం ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తుంది అనేది వేచి చూడాలి.

Breaking: బీజేపీ నేత బండి సంజయ్ కు ఊరట .. షరతులతో బెయిల్ మంజూరు

Related posts

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N