Rashmika Mandanna Vijay Deverakonda: హీరోయిన్ రష్మిక మందన పుష్పతో నేషనల్ క్రష్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. అతి తక్కువ కాలంలోనే ఊహించని రేంజ్ లోకి పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి ఈ కన్నడ ముద్దుగుమ్మ చేరుకుంది. కెరియర్ కన్నడలో స్టార్ట్ చేసిన గాని తెలుగు చలనచిత్ర పరిశ్రమ రష్మికకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. “చలో” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంది. విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు చేయడం జరిగింది.
దీంతో అప్పటి నుండి వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు వార్తలు స్టార్ట్ అయ్యాయి. చాలా సందర్భాలలో ప్రమాణాశ్రయాలలో ఒకేసారి బయలుదేరడంతో పాటు పలు వెకేషన్లలో విజయ్ దేవరకొండ ధరించిన దుస్తులు ఇంకా కళ్ళజోడు ఫోటోలతో రష్మిక కనిపించడం ఇంకా లైవ్ మాట్లాడుతున్న టైంలో బ్యాక్ గ్రౌండ్లో విజయ్ వాయిస్ వినిపించడంతో ఇద్దరు లవ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటువంటి క్రమంలో ఓ పెద్ద మీడియా సంస్థ.. విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరూ ఒకే రూమ్ లో ఉంటున్నారని తెలిపింది.
ఏప్రిల్ ఐదో తారీకు బర్త్ డే సమయంలో విజయ్ దేవరకొండ కి ఉండే రింగ్ రష్మికాకి తోడిగారని… త్వరలో ఒక శుభవార్త వినబోతున్నట్లు.. ఆ మీడియా సంస్థ రాసుకొచ్చింది. దీంతో ఈ వార్తలపై రష్మిక మందన రియాక్ట్ అయ్యి..”అయ్యో దయచేసి ఓవర్గా ఊహించుకోకండి బాబు అంటూ సటారికల్ గా రిప్లై ఇవ్వడం జరిగింది”. దీంతో రష్మిక మందన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ప్రస్తుతం రష్మిక మందన పుష్ప 2 సినిమాతోపాటు వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్ హీరోగా కొత్త సినిమా చేస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!