NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి రియాక్షన్ ఇది .. కాకినాడలో పోటీ చేయాలంటూ సవాల్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నిన్న రాత్రి కాకినాడ సభలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ద్వారంపూడి తీవ్రంగా స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను గెలవనివ్వను అన్న పవన్ కళ్యాణ్ దమ్ముంటే కాకినాడలో తనపై పోటీ చేసి నెగ్గాలని సవాల్ విసిరారు. తాను ఓటమి పాలైతే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని తెలిపారు. పవన్ కూడా ఈ సవాల్ స్వీకరించాలన్నారు.

YCP MLA Dwarampudi Chandra Shekar Reddy Slams pawan Kalyan

 

పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. పవన్ పార్టీ ప్రారంభించిన సమయంలో ఆయన వెంట ఉన్నవాళ్లు ఎవరైనా ఇప్పుడు ఉన్నారా అని ప్రశ్నించారు. తాను 30 సంవత్సరాలుగా ఉన్నాననీ, అప్పటి నుండి ఇప్పటి వరకూ తన వాళ్లు తనతోనే ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ తనపై చేసిన అసత్య ఆరోపణలు నిరూపించాలన్నారు. తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు గెలిచాననన్నారు. తాను రౌడీని, గుండాను అయితే ప్రజలు ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు ద్వారంపూడి. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయాడనీ, ఆయనకు తనను విమర్శించే స్థాయి లేదని ద్వారంపూడి అన్నారు. జనసేనను ఎవరిని ఉద్దరించడానికి పెట్టాడని ప్రశ్నించారు.

చంద్రబాబుతో బేరం కుదరకనే వారాహితో రోడ్డుపైకి వచ్చాడని ద్వారంపూడి అన్నారు. రాజకీయాల్లో పవన్ సీఎం కావడం సాధ్యం కాదని, కావాలంటే సినిమాల్లోనే సాధ్యమవుతుందని ఎద్దేవా చేశారు. తాను తల్చుకుంటే కాకినాడలో పవన్ బ్యానెర్ లే ఉండేవి కావన్నారు. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని ద్వారంపూడి హెచ్చరించారు.  ఎవడో చెప్పిన మాటలు విని కోతిలా గంతులు వేయకు అంటూ హితవు పలికారు. కాకినాడలో అన్ని సామాజికవర్గాలు కలిసి తనను ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు.  పవన్ కళ్యాణ్, చంద్రబాబు లు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారనీ, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ ను తరిమేస్తే అసలు కులాల గొడవే ఉండదని అన్నారు.

2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు కానున్నాయని తెలిపారు. పవన్ మాటల్లో చూపిస్తే తాను చేతల్లో చూపించగలను అని అన్నారు. సీఎం కాలేనని మూడు నెలల కిందట పవన్ అన్నాడనీ, ఇప్పుడు సీఎం చేయండని అని అడుగుతున్నాడని వీటిని బట్టే ఆయనలో నిలకడ లేమి అర్ధం అవుతోందన్నారు. కాకినాడ పోర్టులో తక్కువ చార్జీలు ఉండటం వల్లనే బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయనీ, వాస్తవాలు తెలుసుకుని పవన్ విమర్శలు చేయాలని ద్వారంపూడి హితవు పలికారు.

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N