NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపీ సర్కార్ కు సుప్రీం కోర్టులో బిగ్ షాక్ .. మార్గదర్శి కేసులో ఏపీ పిటిషన్ డిస్మిస్

మార్గదర్శి కేసులో ఏపీ సర్కార్ కు మరో సారి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు నుండి ఏపీకి కేసులు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీలను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ కేసు బదిలీపై ఏపి ప్రభుత్వం పిటిషన్లపై విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. విచారణ నిర్ణయం ఇప్పటికే జరిగినందున మళ్లీ విచారణ అవసరం లేదని చెప్పింది. మార్గదర్శి కేసులను విచారించే న్యాయపరిది తెలంగాణ హైకోర్టుకు లేదంటూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

Margadarsi case supreme Court

 

న్యాయపరిధి విషయాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటిషన్లు కాలం చెల్లినవని సుప్రీం కోర్టు చెప్పింది.  మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. మెరిట్స్ ఆధారంగా ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ కేవి విశ్వనాథన్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం సూచించింది.

మెరిట్స్ ఆధారంగా కేసును విచారించి తీర్పును వెలువరించే స్వేచ్చ ను తెలంగాణ హైకోర్టుకే సుప్రీం కోర్టు వదిలేసింది. చెప్పాలనుకున్న విషయాలన్నీ తెలంగాణ హైకోర్టుకే చెప్పాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులకు సుప్రీం కోర్టు సూచించింది. హైకోర్టు తుది ఆదేశాలు వెలువడిన తర్వాత సుప్రీం కోర్టుకు రావొచ్చని తెలిపింది. కాగా.. మార్గదర్శి చిట్స్ ను స్తంభింపజేయడంపై గతంలో హైకోర్టు స్టే ఇవ్వగా, దానిపైనా ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును అశ్రయించింది. అప్పుడు కూడా హైకోర్టు స్టే పై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నో చెప్పింది.

క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్ .. ఔషదాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju