NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ మీడియా

MS Dhoni: డోనాల్డ్ ట్రంప్ తో ధోని గోల్ఫ్…

when MS Dhoni played golf with US President Donald Trump

MS Dhoni: డోనాల్డ్ ట్రంప్ తో ధోని గోల్ఫ్… మిస్టర్ కూల్ గ పేరున్న మహేంద్ర సింగ్ ధోనీ , తన స్వభావానికి పూర్తిగా విరుద్ధమైన స్వభావం కలిగిన ఒక వ్యక్తిని కలిసాడు. అది కూడా అమెరికా లో. మరి ఇది వార్తాహరులకి పెద్ద విశేషమే కదా. అసలేమైందంటే…

when MS Dhoni played golf with US President Donald Trump
when MS Dhoni played golf with US President Donald Trump

మేలో ముగిసిన ఐపీఎల్-16 తర్వాత మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నభారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అమెరికాలో విహార యాత్ర లో ఉన్నారు. క్రికెట్‌కి రిటైర్మెంట్‌ ఇచ్చిన తర్వాత మహేంద్రుడు చాలా సమయాన్ని తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడానికే వెచ్చిస్తున్నాడు. ఇటీవల యు ఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీలను తిలకించడానికి ధోని వెళ్లారు. కార్లోస్ అల్కరాజ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగిన యూఎస్ ఓపెన్ 2023 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కి ధోనీ హాజరైన మరుసటి రోజే ఒక ఫోటో బయటకు వచ్చింది. విరామ సమయంలో అల్కరాజ్ ఫ్లూయిడ్స్ తాగుతూ పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న సమయంలో ధోని స్టాండ్స్ లో ఉండగా కెమెరాకు చిక్కింది ఆ ఫోటో. ఆ మ్యాచ్ బ్రాడ్కాస్టర్లు కూడా ధోనీపై దృష్టి సారించారు, అతను ఇద్దరు స్నేహితులతో చాట్ చేస్తూ, నవ్వుతూ కనిపించాడు.మిస్టర్ కూల్, మహేంద్ర సింగ్ ధోనీకి.. క్రికెట్‌తోపాటూ.. మిగతా గేమ్స్ కూడా ఇష్టమే. ముఖ్యంగా టెన్నిస్‌ని ఆయన రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారు.

when MS Dhoni played golf with US President Donald Trump
when MS Dhoni played golf with US President Donald Trump

అందుకే US ఓపెన్ టెన్నిస్ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లిన సందర్భంలో అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూసి.. గోల్ఫ్ ఆడేందుకు ఆహ్వానించారు. ఆయన పెద్దవాడు పిలిచాడు కదా అని మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్‌ ఆడాడు ధోనీ. తన స్నేహితులతో కలిసి గోల్ఫ్ కోర్ట్ కి వెళ్ళాడు ధోనీ. ట్రంప్ తో కలిసి ధోనీ గోల్ఫ్ ఆడటాన్ని వీడియో తీయగా ఆ వీడియో ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు హితేశ్‌ సంఘ్వీ అనే బిజినెస్‌మ్యాన్‌. ‘ధోనీ, డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంకా రాజీవ్‌ శర్మతో గోల్ఫ్‌ ఆడుతున్నా.. మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు థ్యాంక్యూ మిస్టర్‌ ప్రెసిడెంట్‌..’ అంటూ సోషల్‌ మీడియాలో ఫోటోలు పోస్ట్‌ చేశాడు హితేశ్‌ సంఘ్వీ.

ధోనీని ఆప్యాయంగా పలకరించిన ట్రంప్.. కాసేపు మాట్లాడారు. క్రికెట్ సంగతులు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా గోల్ఫ్ ఆడారు.

when MS Dhoni played gold with US President Donald Trump 3
when MS Dhoni played gold with US President Donald Trump 3

అలా ట్రంప్‌తో ధోనీ ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ధోనీ గోల్ఫ్ స్టిక్‌తో కనిపిస్తున్నాడు. పక్కనే ట్రంప్ నవ్వుతూ థంబ్సప్ సింబల్ ఇచ్చారు. ఈ ఫొటో వైరల్ అయ్యింది.
ధోనీ బెడ్‌మినిస్టర్‌లో ఉన్న ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో మాజీ యూఎస్ ప్రెసిడెంట్‌ను కలిశాడు. ట్రంప్ ఆహ్వానం మేరకే ధోని ఇక్కడికి వెళ్లినట్టు సమాచారం. ధోని – ట్రంప్ కలిసి గోల్ఫ్ ఆడుతున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తమిళ, తెలుగు భాషల్లో రూపొందించిన ‘ఎల్‌జీఎం’ (లెట్స్ గెట్ మ్యారీడ్) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో కనిపించిన ధోని ఆ తర్వాత తాజాగా మీడియాలో కనిపించడం ఇదే తొలిసారి. ధోనితో పాటు అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మిత్రుడు సంగ్వీ తన ఇన్‌స్టా ఖాతాలో ధోని – ట్రంప్‌‌లు గోల్ఫ్ ఆడిన ఫోటోలు, వీడియోలను షేర్ చేశాడు. ధోని యూఎస్ ఓపెన్ మ్యాచ్‌ను కూడా సంగ్వీతో కలిసి చూశాడు. ఈ ఏడాది ఏప్రిల్ – మే లో జరిగిన ఐపీఎల్ – 16లో ధోని కాలికి గాయమైనా సీజన్ మొత్తం గాయంతోనే బరిలోకి దిగాడు. మే 29న మొదలై వర్షం కారణంగా మూడు రోజుల పాటు సాగిన ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన ధోని సేన.. చెన్నైకి ఐదో ఐపీఎల్ ట్రోఫీని అందించింది. ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే ధోని.. మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఐపీఎల్ – 2024లో కూడా ఆడేందుకు ధోని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

 

Related posts

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N