NewsOrbit
జాతీయం న్యూస్

G 20 Summit: జీ 20 సదస్సులకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన దేశ రాజధాని ఢిల్లీ .. బ్రిటన్ ప్రధానిగా, భారత దేశ అల్లుడు రిషి సునాక్ సతీసమేతంగా..

G 20 Summit: జీ 20 శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రేపు ఎల్లుండి జరిగే శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అంతర్జాతీయ ఆర్ధిక అంశాలతో పాటు ప్రపంచీకరణ బలోపేతంలో జీ 20 దేశాల కూటమి కీలక పాత్ర పోషిస్తొంది. ప్రపంచ ఆర్ధిక సహకారానికి కీలక వేదికగా నిలిచే జీ 20 దేశాల ప్రతిష్టాత్మక సదస్సుకు తొలి సారిగా భారత్ అతిధ్యమిస్తొంది. ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లు హజరు కావడం లేదు. సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాధినేతలు తరలివస్తున్నారు.

 

ఇప్పటికే జపాన్ ప్రధాని కిషిందా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అంటోనియో గుటేరన్, అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో, ఐఎంఎఫ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టోలినా జార్జివా తదితరులు ఢిల్లీకి చేరుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షితా మూర్తితో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. అతిధులకు భారత్ ఘన స్వాగతం పలుకుతోంది. అతిధులను ఆహ్వానించేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేక సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ మీడియాతో మాట్లాడుతూ ఈ పర్యటన తనకెంతో ప్రత్యేకం అని పేర్కొన్నారు. ‘భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధాన మంత్రి హోదాలో..అది కూడా ఇక్కడి అమ్మాయిని వివాహం చేసుకుని భారత దేశపు అల్లుడిగా ఇక్కడకు రావడం నాకెంతో అనందంగా ఉంది’ అంటూ చమత్కరించారు.

 

జీ 20 సమావేశాల సందర్భంగా ఢిల్లీని శత్రుదుర్భేద్యంగా మార్చేశారు. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు ప్రత్యేకంగా ప్లాగ్ మార్చ్ చేపట్టారు. అలాగే టూవీలర్స్ పెట్రోలింగ్ చేశారు. డ్రోన్లతో నిరంతరం నిఘాను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ మొత్తం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ రాత్రి ఏడు గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు రోజులు బిజీ బిజీ గా గడుపనున్నారు. 15 ద్వైపాక్షిక సమావేశాల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు.

ఈరోజు అమెరికా, మారిషన్, బంగ్లాదేశ్ అధినేతలతో భేటీ కానున్నారు. రేపు జీ – 20 సదస్సుతో పాటు యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో విడివిడిగా సమావేశం కానున్నారు. ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడితో మోడీ లంచ్ మీటింగ్ లో పాల్గొననున్నారు. అనంతరం విడిగా కెనడా దేశాధినేతతో భేటీ అవుతారు. అదే విధంగా కొమొరోస్, టర్కీ, యూఏఈ, దక్షిణ కొరియా, బ్రెజిల్, నైజీరియా, యూరోపియన్ యూనియన్ అధినేతలతో ప్రధాని సమావేశాలు జరుపుతారు.

AP CID: ఆ టీడీపీ ఎమ్మెల్యే కుటుంబానికి ఏపీ సర్కార్ బిగ్ షాక్ .. రూ.9 కోట్ల విలువైన ఆస్తులు జప్తు

Related posts

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?