NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ .. సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు పచ్చజెండా

Unexpected scene in ACB court while Chandrababu was in court cage

Chandrababu Arrest: స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు తరపున దాఖలైన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు వెలువడిన కొద్ది సేపటి వ్యవధిలోనే చంద్రబాబు సీఐడీ కస్టడీకి సంబందించి ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబును విచారించేందుకు అయిదు రోజులు కస్టడీకి అనుమతి ఇవ్వాలని సీఐడీ కోరగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి .. రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Unexpected scene in ACB court while Chandrababu was in court cage
Chandrababu

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నిధులు ఎటు మళ్లించారనే దానిపై విచారించాల్సి ఉందని సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. చంద్రబాబును విచారిస్తే ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది వెలుగులోకి వస్తాయని ఏసీబీ కోర్టుకు సీఐడీ తరపున న్యాయవాదులు విన్నవించారు. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి చంద్రబాబును రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది.

ACB remand Chandrababu naidu,

చంద్రబాబు ను ఎక్కడ విచారిస్తారని సీఐడీని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రశ్నించగా, రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారిస్తామని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబును ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విచారించాలని న్యాయమూర్తి  ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆయన తరపు ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. విచారణ అధికారుల పేర్లు కోర్టుకు ఇవ్వాలని ఆదేశించింది. మీడియాకు విచారణకు సంబంధించి వివరాలు వెల్లడించవద్దని , వీడియో, ఫోటోలు విడుదల చేయరాదని కోర్టు షరతులు విధించింది.

chandrababu reaction about CID comments
chandrababu

చంద్రబాబు ఆరోగ్యం, వయసు రీత్యా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించింది. ఆదివారం సాయంత్రం కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హజరుపర్చాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను కోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జ్యూడిషియల్ కస్టడీ నేటితో ముగిస్తున్న నేపథ్యంలో ఇవేళ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు చంద్రబాబును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హజరుపర్చగా రిమాండ్ ను మరో రెండు రోజులు పొడిగించిన సంగతి తెలిసిందే. కస్టడీకి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపు, ఎల్లుండి చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు.

Chandrababu Arrest: హైకోర్టులో చంద్రబాబుకు లభించని ఊరట .. క్వాష్ పిటిషన్ డిస్మిస్

Related posts

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N