WhatsApp Channel V/S Telegram Channel: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్‌తో తన కమ్యూనికేషన్ సేవలను మరింత మెరుగుపర్చుకునేందుకు వాట్సాప్ కృషి చేస్తోంది. ఇప్పటికే కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చి యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇటీవలే వీడియో కాలింగ్ ఫీచర్‌ను వాట్సాప్ అప్‌డేట్ చేసిన విషయం తెలిసిందే. మొదట్లో 15 మందితో కలిసి వాట్సాప్ కాలింగ్ చేసుకునే ఫెసిలిటీని కలిగి ఉంది. ఇప్పుడు ఆ సంఖ్యను 30కు చేర్చింది. ఒకేసారి 30 మందితో కలిసి వీడియో కాలింగ్ చేయవచ్చు.

తాజాగా భారత్‌తో సహా ఇతర దేశాల్లో వాట్సాప్ ఛానెల్ ఫీచర్‌ను లాంఛ్ చేసింది. ఇందులో ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, బిజినెస్ మెన్‌లు, టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లతో పాటు సామాన్యులు సైతం వాట్సాప్ ఛానెల్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. ఛానెల్ క్రియేట్ చేసిన వ్యక్తిని వాట్సాఫ్ ఛానెల్‌లోనూ ఫాలొ అవ్వొచ్చు. అయితే ఛానెల్ క్రియేట్ చేసిన వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను వాట్సాప్ గోప్యంగా ఉంచింది. వాట్సాప్ ఛానెల్ అనేది వన్ వే బ్రాడ్‌కాస్ట్ కమ్యూనికేషన్. కాబట్టి ఇందులో వాట్సాప్ ఛానెల్ క్రియేట్ చేసిన వ్యక్తులే మెసేజ్‌లు పంపగలరు. అంటే వాట్సాప్ ఛానెళ్లు గ్రూప్ చాట్ లాగానే ఉంటాయి. కానీ గ్రూప్ యజమాని మాత్రమే మెసేజ్ పంపగలరు.

వాట్సాప్ ఛానెల్ ఇలా క్రియేట్ చేయండి..
వాట్సాప్ ఛానెల్ క్రియేట్ చేయాలంటే ముందుగా.. వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. వాట్సాప్ అప్‌డేట్ అయ్యాక.. స్టేటస్ సెక్షన్ కింద ఛానెల్స్ (Channels) ఆప్షన్ కనిపిస్తుంది. దాని పక్కనే ఉన్న ప్లస్ (+) బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు క్రియేట్ ఛానెల్ (Create Channel) ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు ఛానెల్ పేరు, డిస్క్రిప్షన్ ఎంటర్ చేయాలి. అలాగే ఛానెల్ ప్రొఫైల్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. పూర్తి వివరాలు పొందుపర్చిన తర్వాత సేవ్ చేసుకుంటే మీ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. ఈ ఛానెల్‌లో జాయిన్ అయ్యే వారు ప్రొఫెల్ దగ్గర ప్లస్ ఆప్షన్‌తో జాయిన్ అవ్వవచ్చు.

వాట్సాప్, టెలిగ్రామ్ ఛానెల్‌కు మధ్య తేడా?
వాట్సాప్ ఛానెల్, టెలిగ్రామ్ ఛానెల్ మధ్య చాలా తేడా ఉంటుంది. ప్రొఫైల్ క్రియేట్ ఆప్షన్ వరకు రెండింటిల్లోనూ సేమ్‌గా ఉంటుంది. వాట్సాప్‌లో స్టేటర్ దగ్గర ఉన్న ప్లస్ ఆప్షన్‌లో రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి క్రియేట్ ఛానెల్ (Create Channel), ఫైండ్ ఛానెల్ (Find Channel) ఆప్షన్ ఉంటుంది. మనకు కావాల్సిన వ్యక్తి ఛానెల్‌ను ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ వ్యక్తికి సంబంధించిన ఛానెల్ కనిపిస్తుంది. టెలిగ్రామ్‌లో కూడా సెర్చ్ ఆప్షన్ దగ్గర ఛానెల్‌ను సెర్చ్ చేయవచ్చు. అయితే వాట్సాప్ అనేది వన్ వే బ్రాడ్ కాస్ట్ కమ్యూనికేషన్. ఛానెల్ క్రియేట్ చేసిన వ్యక్తి మాత్రమే ఇందులో మెసేజ్, పోస్టులు పెట్టవచ్చు. టెలిగ్రామ్‌లో ఈ ఆప్షన్‌తో పాటు ఆడ్మిన్ మరికొందరికీ గ్రూప్ ఆడ్మిన్ ఆప్షన్ ఇవ్వవచ్చు. ఛానెల్ కలిగిన వ్యక్తి మరికొందరిని కూడా గ్రూప్ ఆడ్మిన్ చేయవచ్చు. వాళ్లు కూడా గ్రూపులో మెసేజ్ చేయవచ్చు.

అలాగే వాట్సాప్‌లో కేవలం ఒకే వ్యక్తి మెసేజ్‌లు, పోస్టులు షేర్ చేయగలడు. కానీ టెలిగ్రామ్‌లో ఆడ్మిన్‌గా ప్రతి ఒక్కరూ మెసేజ్, పోస్టులు పెట్టవచ్చు. యూజర్లు మెసేజ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. కాదనుకుంటే దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో ప్రొఫైల్ షేరింగ్ ఆప్షన్ లేదు. కానీ టెలిగ్రామ్‌లో ఫ్రొఫైల్ షేరింగ్ ఆప్షన్ ఉంది. ఓ లింక్ సాయంతో డైరెక్ట్‌గా టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వవచ్చు. రెండింటిలోనూ ఫోటోలు, వీడియోలు, వెబ్‌సైట్ లింక్‌లు చేయవచ్చు. అలాగే వాట్సాప్ ఛానెల్‌లో ప్రొఫైల్‌ను సీక్రెట్‌గా ఉంచుతుంది. వాట్సాప్ కాంటాక్ట్స్, డిస్క్రిషన్ కనిపించదు. అదే టెలిగ్రామ్‌లో కాంటాక్ట్ వివరాలను హైడ్ చేసుకోవచ్చు.