NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam సెప్టెంబర్ 28: అమరేంద్ర తో సరదాగా అరుంధతి…ఇంట్లో అరుంధతిని చూసేసిన భాగమతి…అతి చేస్తున్న పిల్లలు!

Nindu Noorella Saavasam Today Episode September 28 2023 Episode 40 Highlights

Nindu Noorella Saavasam September 28 ఎపిసోడ్ 40: ఒరేయ్ పిల్లలు మీ పగ ఆ అమ్మాయి మీద తీర్చుకుంటున్నట్టు లేదురా నామీద తీర్చుకుంటున్నట్టు ఉంది ఒరేయ్ నేనంటే మికు ఇష్టం కదా నా మీద దయవుంచి ఏదో ఒకటి తేల్చండి రా అని రాథోడ్ అంటాడు. నువ్వంటే ఇష్టమని మేము నీకు చెప్పామా అని అంజు అంటుంది. ఆ మాటకి భాగమతి నవ్వి చాలా బాగా చెప్పావు అని అంటుంది. థాంక్యూ అని అంజు అంటుంది.జరిగిందేదో జరిగింది ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం ఏమంటారు అని భాగమతి అంటుంది. వావ్ ఎంత బాగా చెప్పారు వెళ్లి స్టేటస్ లో పెట్టుకో వెళ్ళు అన్ని అంజు అమృత అంటుంది.థాంక్యూ అని భాగమతి అంటుంది.రేపు మా అమ్మ కార్యక్రమం ఉంది కాబట్టి నిన్ను ఏమీ అనను అని అమృత అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode September 28 2023 Episode 40 Highlights
Nindu Noorella Saavasam Today Episode September 28 2023 Episode 40 Highlights

భాగమతికి వార్నింగ్ ఇస్తూ అతి చేస్తున్న పిల్లలు

కానీ ఎల్లుండి నుంచి చూపిస్తాం మేము అంటే ఏంటో నీకు భయాన్ని పరిచయం చేస్తాము అని ఆకాష్ అంటాడు. పోనీలే పిల్లలు అని కాంప్రమైజ్ అవుదామని అనుకుంటే పగ కావాలి మెడలో నగ కావాలి అని అంటారా అని భాగమతి అంటుంది. రాథోడ్ గారు ఇక మీరు దయచేసి మేము తలుపు వేసుకుంటాము అని అమృత అంటుంది. అమ్మ అది కాదమ్మా అర్థం చేసుకోండి అని రాథోడ్ అంటాడు. ఇక మీరు చెప్పేది ఏమీ లేదు మేము వినేది లేదు వెళ్ళండి మేము పడుకోవాలి అని అంజు అంటుంది. అది కాదమ్మా అని రాథోడ్ అంటాడు.మీరు ముందు వెళ్తారా మమ్మల్ని గెంటే ఏమంటారు అని ఆకాష్ అంటాడు. పదమ్మ పద అని రాథోడ్ భాగమతిని తీసుకొని బయటికి వెళ్తాడు.

Nindu Noorella Saavasam Today Episode September 28 2023 Episode 40 Highlights
Nindu Noorella Saavasam Today Episode September 28 2023 Episode 40 Highlights

చూడండి రాథోడ్ గారు పిల్లలు కదా పోనీలే అనుకుంటే చాలా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళ సంగతి చెప్తాను ఉండండి అని భాగమతి పరిగెడుతుంది. చూడమ్మా సార్ వచ్చే టైం అయింది నువ్వు ఇలా అల్లరి చేస్తే సార్ నేను వెళ్లగొడతాడు ఏదైనా ఉంటే పొద్దున మాట్లాడుకుందాం నువ్వు వెళ్ళమ్మా అని రాథోడ్ అంటాడు. రాథోడ్ గారు నేను సార్ ని ఒక్కసారి కలిసి మాట్లాడతాను అని భాగమతి అంటుంది. వద్దమ్మా పొద్దుపోయింది ఆయన ఈ టైంలో ఎలా ఉంటాడో ఏమో అని రాథోడ్ అంటాడు. నేనేమైనా ఆయనని సంతకం పెట్టమని అడుగుతున్నానా చూసి హాయ్ చెప్పి వెళ్ళిపోతాను అంతే అని భాగమతి అంటుంది. సరే ఆయన ఏ మూడులో ఉన్నాడు నేను చూసి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని రాథోడ్ లోపలికి వెళ్లి సార్ కేర్ టేకర్ మిస్సమ్మ మిమ్మల్ని కలవాలి అనుకుంటుంది ఏమంటారు సార్ అని రాథోడ్ అంటాడు. సరే తీసుకురా నేను ఈలోపు ఫ్రెష్ అప్ అయి వస్తాను అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode September 28 2023 Episode 40 Highlights
Nindu Noorella Saavasam Today Episode September 28 2023 Episode 40 Highlights

Nindu Noorella Saavasam Today September 28 ఎపిసోడ్ 40: అమరేంద్రతో సరదాగా సమయం గడుపుతున్న అరుంధతి ఆత్మ

అమరేంద్ర కూర్చొని ఉంటే తన తొడ మీద తల పెట్టుకొని పడుకొని అరుంధతి అమ్మో ఆ అమ్మాయి వస్తే నన్ను చూసి గుర్తు పడుతుంది ఇప్పుడు ఎలా అని గదంతా పరిగెడుతుంది. ఇంతలో రాథోడ్ భాగమతిని తీసుకొని లోపలికి వస్తాడు. భాగమతి గదిని అంత తీరిపారి చూస్తూ ఉండగా అరుంధతి కనిపిస్తుంది హాయ్ అని చెబుతుంది. ఇదేమిటి ఈవిడ ఇక్కడికి వచ్చింది అని భాగమతి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విన్న అమరేంద్ర మొహం కడుక్కుంటూ బయటికి వస్తాడు ఏమైందిరా రాథోడ్ ఆరుపులేంటి అని అంటాడు. ఏమీ లేదు సార్ మీరు ఫ్రెష్ అప్ అయ్యి రా అని రాథోడ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode September 28 2023 Episode 40 Highlights
Nindu Noorella Saavasam Today Episode September 28 2023 Episode 40 Highlights

భాగమతికి దొరికిపోయిన అరుంధతి

ఏంటమ్మా అలా అరిచావు అని రాథోడ్ భాగమతిని అడుగుతడు. పొద్దున నాకు హెల్ప్ చేసిందని చెప్పాను కదా ఆ అమ్మాయి సార్ గదిలో ఉంది అని భాగమతి అంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది ఆ గదిలో అమ్మాయి ఉండడమేంటి అయినా ఇంత రాత్రివేళ ఆ అమ్మాయి ఇక్కడికి ఎలా వస్తుంది ఇక సారు ఇప్పుడు కలవరు రేపొద్దున కలుద్దాం పద అని రాథోడ్ అంటాడు. చ అనవసరంగా అరిచాను అనుకుంటూ భాగమతి వెళ్ళిపోతుంది. రేపు కార్యక్రమానికి ఆ అమ్మాయిని పిలుద్దామని అనుకుంటే కలవలేకపోయాను ఫోన్ చేద్దామా వద్దులే ఎందుకంటే ఈ టైం దాకా మేలకువతో ఉందో లేదో రేపు కలిసి చెబుతాను అని అమరేంద్ర అనుకుంటాడు.కట్ చేస్తే ఇంతలో తెల్లవారింది అయ్యో లేట్ అయిపోయింది అని భాగమతి చకచక తల స్నానం చేసి బయటికి వచ్చి తల తుడుచుకుంటూ ఉంటుంది.

Nindu Noorella Saavasam Today September 28 2023 Episode 40 Highlights
Nindu Noorella Saavasam Today September 28 2023 Episode 40 Highlights

ఇంతలో అటుగా వెళుతున్న మనోహరీ తనని చూసి ఈ అమ్మాయి ఏంటి రెడీ అవుతుంది అక్కడికి ఈ అమ్మాయి కూడా వస్తే అమరేంద్ర చూసి అరుంధతికి నచ్చిన అమ్మాయిని గుర్తుపడతాడేమో తనని ఎలాగైనా రాకుండా చేయాలి అని భాగమతి దగ్గరికి వెళుతుంది. ఏ అమ్మాయి ఏం చేస్తున్నావ్ అని మనోహరీ అంటుంది. అదేంటండీ ఈరోజు పెద్దకర్మ ఉంది కదా మీరు రావట్లేదా అని భాగమతి అంటుంది. మేమందరం వెళ్తాము కానీ నువ్వు ఎందుకు అక్కడికి నువ్వే రానక్కర్లేదు అని మనోహరి అంటుంది. మీరు రాకపోయినా బాగుంటుందేమో కానీ కేర్ టేకర్ ని నేను రాకపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని భాగమతి అంటుంది. నేను చెప్పినట్టు వింటావా లేదా అని మనోహరి అంటుంది.

Nindu Noorella Savasam September 27 ఎపిసోడ్ 39: భార్య భర్తల మధ్య గుండె పిండేసే సీన్…అమరేంద్ర కళ్ళ ముందే విలవిలలాడిన అరుంధతి!

Nindu Noorella Saavasam Today September 28 2023 Episode 40 Highlights Written Update
Nindu Noorella Saavasam Today September 28 2023 Episode 40 Highlights Written Update

పిల్లల విషయంలో మనోహరితో భాగమతి చెర్చ

ఇదే క్లారిటీగా తెలుసుకోవాలండి అని భాగమతి అంటుంది. ఏంటది అని మనోహరి అంటుంది. అదేనండి పిల్లల్ని మీరు చెప్పినట్టు చూసుకోవాలా వాళ్ళ డాడీ చెప్పినట్టు చూసుకోవాలి లేదంటే వాళ్ళ తాత నాయనమ్మ చెప్పినట్టు చూసుకోవాలా ఇది క్లారిటీగా లేకపోతే రేపు పొద్దున ఏమైనా జరిగితే నేను ప్రాబ్లం లో ఇరుక్కుంటాను అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today September 28 2023 Episode 40 Highlights Written Update
Nindu Noorella Saavasam Today September 28 2023 Episode 40 Highlights Written Update

ఇప్పుడు కాదే నీ సంగతి తర్వాత చెప్తా అనుకుంటూ మనోహరి వెళ్ళిపోతుంది.అసలు ఎందుకు వచ్చినట్టు ఏం మాట్లాడాలి అనుకుంది ఎందుకు వెళ్లిపోయింది అమ్మో ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో లాగా ఉన్నారు నాన్న కోసం ఒక సంతకం పెట్టిస్తే మిగతాది మెల్లగా మేనేజ్ చేయొచ్చు అని భాగమతి అనుకుంటుంది. కట్ చేస్తే ఎంతసేపయిందే నువ్వు వచ్చి అని మనోహరి వాళ్ళ పని మనిషిని అడుగుతుంది. ఇప్పుడే వచ్చాను అమ్మగారు అని పనిమనిషి అంటుంది. అదే ఇప్పుడే అంటే ఎప్పుడు అని మనోహరి అంటుంది. అదే అమ్మగారు మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి స్పీడ్ చూస్తుంటే మిమ్మల్ని పక్కన పెట్టేసి తను ముందుకు దూసుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది అని పనిమనిషి అంటుంది.అది ఎంత స్పీడ్ గా వెళ్లినా మనోహరి అనే బ్రేక్ దగ్గర ఆగి పోవాల్సిందే అని మనోహరి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N