NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayasai Reddy: ఎవరి కోసం మోత కార్యక్రమం అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి టీడీపీకి సూటి ప్రశ్నలు

Vijayasai Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆ పార్టీ నేతలు మోత మోగిద్దాం నిరసన కార్యక్రమం నిర్వహించడంపై వైసీపీ ఎంపీ, ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. తిరుపతిలో ఇవేళ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ వారు కంచాల మోత ఎందుకు మోగించారని ప్రశ్నించారు. లంచాలు తీసుకుని కంచాలు కొడతారా?,  బకాసురుడి బావమరిదిలు శ్రీకృష్ణుడి వేషం వేస్తారా? అవినీతికి పాల్పడి సిగ్గు పడాల్సిన వారంతా సింగారం చేసుకుని బయటకు వచ్చి కంచాలు మోగిస్తారా? అని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. ఇది టీడీపీ నాయకత్వం, కార్యకర్తలు తెలుసుకోవాలన్నారు.

2014 నుంచి 2019 వరకు, 5 ఏళ్ల పాటు మోగించిన అవినీతి ఏదైతే ఉందో.. ఆ అవినీతి మోత వల్లనే చంద్రబాబు ఇంట్లో ఈగల మోత.. జైల్లో దోమల మోత అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అందుకే ఆయన ఈరోజు ఈ పరిస్థితికి దిగజారాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అరెస్టు చేసింది సీఐడీ అని ఇది నిర్వివాదాంశం అని అన్నారు. ఆ కేసును, అరెస్టును, రిమాండ్‌ను క్వాష్‌ చేయడానికి సీఐడీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, వారికి రిలీఫ్‌ దొరకలేదన్నారు. అన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టే, చంద్రబాబు ఈరోజు రిమాండ్‌ ఖైదీగా ఉన్నారని, ఇది ఆయన తెలుసుకోవాలని అన్నారు విజయసాయి రెడ్డి. కంచాలు ఎవరి కోసం మోగించారు ? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమా? రాష్ట్రం కోసమా? దేశం కోసమా? అని ప్రశ్నించారు

జగన్‌ గారి ప్రభుత్వం ఈ నాలుగేళ్ల పాలనలో నిరుపేదలకు దాదాపు రూ.2.35 లక్షల కోట్లు వివిధ సంక్షేమ పథకాల కింద అందిస్తే.. చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో నిరుపేదలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా.. కేంద్రం నిధులు కానీ, రాష్ట్ర నిధులు కానీ ఉఫ్‌మని ఊదేసినందుకు గుర్తుగా.. ఈ కార్యక్రమం చేశారా? అని ప్రశ్నించారు. అవినీతి చేసి బస్సులో పడుకున్నాను అని డ్రామాలు అడినందుకు గుర్తుగా కంచాలు మోగించారా? అని అడిగారు. నిజంగా మీకు చట్టం అంటే గౌరవం ఉందా? అని ప్రశ్నించారు. రాజ్యాంగం మీద కానీ, చట్టం మీద కానీ నమ్మకం లేనటువంటి సంఘవిద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారంటే.. వారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రమేనని అన్నారు. చంద్రబాబు అవినీతికి, ఆయన చేసిన స్కిల్‌ స్కామ్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా కేసును నిర్థారించి నలుగురిని అరెస్టు చేసిన విషయం మర్చిపోవదన్నారు.

రెండు వారాలుగా లోకేశ్‌ బాబు ఢిల్లీలో దాక్కున్నాడన్నారని విమర్శించారు విజయసాయి రెడ్డి. ఒకవేళ చంద్రబాబు అరెస్టు అక్రమమని భావిస్తే.. ఈడీ చేసిన నాలుగు అరెస్టులు అక్రమమని భావిస్తే.. ఈడీ ఆఫీస్‌ ఎదుట నిలబడి కంచాలు కొడితే బాగుండేదన్నారు. ఇక్కడ రాష్ట్రంలో అందరినీ కంచాలు కొట్టమనడంలో అర్థం ఏముంది? అని ప్రశ్నించారు. నలుగురిని అరెస్టు చేసింది కేంద్ర సంస్థలు మాత్రమేనన్నారు. అలాంటప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర, ప్రధానిగారి దగ్గర, హోం మంత్రిగారి దగ్గర, వారి కార్యాలయాల ముందు నిలబడి.. తమకున్న నలుగురు ఎంపీలు, ఇంకా ఈ రోజు టీడీపీకి తొత్తులుగా పని చేస్తున్న వారందరినీ.. పురంధేశ్వరి కానీ,  సీపీఐ నారాయణ కానీ,  రామకృష్ణకానీ,  రేవంత్‌రెడ్డి కానీ, సుజనాచౌదరి కానీ,  సీఎం రమేశ్‌ కానీ,  సత్యకుమార్‌ కానీ,  జయప్రకాశ్‌నారాయణ కానీ.. వారందరినీ పక్కన నిలబెట్టుకుని, ఢిల్లీలో కంచాలు కొట్టిస్తే బాగుండేదని అన్నారు విజయసాయిరెడ్డి.

మీరు అవినీతిపరులు కాదని చెప్పుకోదల్చుకుంటే మీరు దర్యాప్తు సంస్థల ముందు నిలబడాలని అన్నారు. స్టేలు కోరకుండా విచారణకు రెడీ కావాలని సూచించారు. విచారణ పూర్తి అయితే నీతిమంతులా? అవినీతిమంతులా అన్నది తేలిపోతుందన్నారు. తండ్రి అరెస్టు కాగానే ప్రవాసంలోకి వెళ్లిన కొడుకుని ఎవరైనా ధైర్యవంతుడు అంటారా? లేక ఉత్తర కుమారుడు అంటారా? రాష్ట్ర ప్రజలు ఆలోచించాలన్నారు. పార్టీనీ క్షేత్రస్థాయిలో పటిష్టం చేసి 2024లో పార్టీని విజయపథంలో నడిపించాలన్న పార్టీ అధ్యక్షుడు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించామన్నారు. సత్యవేడు, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు వాడివేడిగా జరిగాయనీ, అయినా కార్యకర్తల్లో అసంతృప్తి లేదనీ,  వారిలో నిరుత్సాహం లేదన్నారు. వారు చాలా మంచి సలహాలు, సూచనలు ఇచ్చారన్నారు. ఎల్లో మీడియా ఇది గుర్తించాలన్నారు. రాంగ్‌ రిపోర్టింగ్‌ సరికాదని అన్నారు. ఉన్నది ఉన్నట్లు రిపోర్ట్‌ చేయాలనీ, అదే జర్నలిజమ్‌ అంటే అని హితవు పలికారు.

సీఎం జగన్ నియోజకవర్గాల స్థాయిలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలనుకున్న మాట వాస్తవమని, కానీ దానికి ఇది సమయం, సందర్భం కాదన్నారు. ఇంకా దానికి సమయం ఉందన్నారు. ఇప్పుడు జరిగే సమీక్షలు, సమావేశాలు పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి.. ఎవరిపట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఉందో.. ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయో.. వాటిని ప్రజా ప్రతినిధులు ఏమేర తీర్చారో తెలుసుకోవడం కోసమే ఈ సమీక్షా సమావేశాలని చెప్పారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. మళ్లీ తమ పార్టీదే ఘన విజయం అని దీమా వ్యక్తం చేసారు విజయసాయి రెడ్డి.

Nara Lokesh: ఢిల్లీలో నారా లోకేష్ కు నోటీసులు అందజేసిన ఏపీ సీఐడీ అధికారులు

Related posts

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N