NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TTDP: చంద్రబాబుకు బైబై చెప్పిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని

TTDP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయిన చంద్రబాబు గత 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎన్నికలపై చర్చించేందుకు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రెండు రోజుల క్రితం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించడం కష్టమని పేర్కొన్న చంద్రబాబు ..ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మాటలతో కాసాని ఖంగుతిన్నారు.

ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించి, నేతల నుండి అర్జీలు కూడా స్వీకరించిన తర్వాత చివరి నిమిషంలో ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటే పార్టీ క్యాడర్ నిరుత్సాహానికి గురవుతుందని కాసాని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని నేతలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. పోటీకి దూరంగా ఉండాలని పార్టీ అధినేత నిర్ణయం తీసుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైయారు కాసాని. పార్టీ నేతలతో సమావేశం నిర్వహించగా, అధినేత నిర్ణయాన్ని తప్పుబట్టారు నేతలు. ఈ నేపథ్యంలో కాసాని టీటీడీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Chandrababu

టిడిపి తరపున నామినేషన్లు వేయడానికి దాదాపు 40మంది అభ్యర్థులు కూడా సిద్ధమయిన తరుణంలో  ఎన్నికల్లో పోటీ చేయకూడదని చంద్రబాబు, లోకేష్ నిర్ణయించడం ఆశ్చర్యకరంగా ఉందన అన్నారు కాసాని. ఈ విషయమై నారా లోకేష్ కి 20 సార్లు ఫోన్ చేసినా స్పందించలేదనీ, ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు తనను తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టి నారా చంద్రబాబు నాయుడి సామాజిక వర్గం లోపాయకారీగా కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇస్తున్నట్లు స్పష్టమవుతోందని అంటున్నారు.

ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదో చంద్రబాబు, లోకేష్ తెలంగాణ ప్రజలకు తప్పనిసరిగా చెప్పాలంటునారు. ఎన్నికల్లో పోటీ చేయని పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగలేక తెలుగుదేశం పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు కాసాని. అనుచరులతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తానని కాసాని పేర్కొన్నారు. రావుల చంద్రశేఖరరెడ్డి బాటలోనే కాసాని కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినబడుతున్నాయి. రావుల ఇటీవలే టీటీడీపీ రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

Chandrababu: చంద్రబాబు పై మరో కేసు నమోదు

 

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju