Kumkuma Puvvu October 30 Episode: అంజలి ఆశాని తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చో పెట్టినట్లు అలాగే బంటి కి ఫోన్లో తను ఆశ గురించి సేకరించిన ఆధారాల వీడియో ని అందరికీ చూయించినట్లు కలగంటుంది. అది చూసి బంటి, బంటి తల్లి కావేరి,అందరూ ఆశని బయటికి వెళ్ళగొట్టి నట్లు అంజలిని దగ్గరికి తీసుకున్నట్లు కలగంటుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడి ముహూర్త టైం ముంచు కొస్తుంది,అంజలి ఫోన్ లో ఉన్న ఆశ క్రిమినల్ వీడియో ని చూస్తూ ఎస్ ఇది అందరికీ చూపించాలి నిజంగానే అని అనుకుంటూ ఉండగా ఆశ తన వెనుక నుంచి ఆ వీడియో ని మొత్తం చూసేస్తుంది. షాక్ అవుతుంది ఆశ.ఓహో ఇది నా గురించి ఆధారం సేకరించింది అనుకుంటూ,అంజలి అందుకే నువ్వు ఇంత ధీమాగా ఉన్నావా, అయినా నువ్వు నన్నేం చేయ లేవు.ఇప్పుడు శ్వేత నా దగ్గర ఉంది అంటుంది ఆశ.

అందుకు అంజలి అబద్ధం అంటుంది. ఆశ అయ్యో అంజలి నిన్ను ఎంతో ప్రేమగా లక్కీ అంటూ పిలిచే నీ శ్వేత ఇప్పుడు నిజంగానే నా దగ్గర ఉంది కావాలంటే,ఒక్క సారి ఫోన్లో మాట్లాడు అప్పుడు తెలుస్తుంది అని రౌడీలకు ఫోన్ చేసి ఒరేయ్ అక్కడ మీ దగ్గర ఉన్న పాప తో ఒక్క సారి ఫోన్ మాట్లాడించు అంటుంది. రౌడీలు ఓకే మేడం అంటూ, పాప దగ్గరకు వెళ్లి ఫోన్ ఇస్తారు నిజంగా నే ఫోన్లు శ్వేత ఫోటో చూసి అంజలి టెన్షన్ తో చిట్టి తల్లి ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది.అందుకు శ్వేత ఏమో లక్కీ తెలీదు ఎవరో అంకుల్స్ నా ఎగ్జామ్ అయి పోగానే వచ్చి నేను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను రా అంటే నేను ఓకే అని వచ్చేసాను నువ్వు పెళ్లి లో బిజీగా ఉంటావు కదా నేనే ఈ అంకుల్స్ తో కలిసి వద్దామని అనుకుని వచ్చాను,కానీ మధ్యలో కారు ఆగిపోయింది అని చెబుతుంది శ్వేత.

వాళ్ళు ఏమన్నా అంటున్నారా, శ్వేత లేదు లక్కీ కారు ఆగి పోతే నాకు ఈ అంకుల్స్ చాక్లెట్లు బిస్కెట్లు చాలా తెచ్చి ఇచ్చారు చూడు అంటూ ఫోన్లో అంజలికి చూపిస్తుంది. అంజలి చిట్టి తల్లి నువ్వేం భయ పడకు నేను ఉన్నాను అంటుంది అంజలి. అందుకు శ్వేత నాకేం భయం లక్కీ నువ్వు ఉన్నావు కదా అంటుంది శ్వేత. ఇక వెంటనే ఆశ అంజలి దగ్గర నుంచి ఫోన్ తీసుకుని చూశావుగా నువ్వు నన్ను ఏ విధంగా ఢీకొట్ట లేవు, ఇప్పుడు నీ చిన్నారి చిట్టి తల్లి శ్వేత ఇప్పుడు నాకు గుప్పిట్లో ఉంది ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు, అంజలి అని అంటుంది ఏ అంజలి ఇక నన్ను నా బంటిని ఎవ్వరూ విడదీయ లేరు, నువ్వు ఆ వీడియోని చూపించిన బంటి నమ్ముతాడు అనుకుంటున్నావా అని అంటుంది శ్వేత.

కాబట్టి నువ్వు ఆ ఫోన్లో ఉన్న ఆ సాక్షదారాల వీడియో ని డిలీట్ చెయ్ అంటుంది ఆశ. అందుకు అంజలి ఏం మాట్లాడాలో తెలియక ఫోన్ లో ఉన్న వీడియోని డిలీట్ చేయాలో లేదో తెలియక అలాగే నిలబడి టెన్షన్ తో అటు ఇటు నడుస్తూ ఆలోచిస్తూ ఉండగా ఏ అంజలి నీవు ఆలోచించు కోవడానికి ఎక్కువ టైం లేదు త్వరగా ఆ వీడియోని డిలీట్ చెయ్ అంటుంది ఆశ. అందుకు అంజలి ఆశ శ్వేత.ని ఏమి చేయొద్దు అంటూ ఓకే నేను ఈ వీడియో ని డిలీట్ చేస్తాను అంటూ వీడియో ను డిలీట్ చేసి ఆశ కు చూపిస్తుంది.

అందుకు ఆశ అది నమ్మకుండా, ఫోను నాకు ఇవ్వు గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్ని, నా చేత్తో నేను డిలీట్ చేస్తే తప్ప నేను నమ్మను అంటుంది ఆశ. ఆశ అంజలి చేతిలో ఉన్న ఫోన్ ని లాగడం మొదలు పెడుతుంది. అటు అంజలి ఇటు ఆశ ఫోన్ ని లాగడం మొదలు పెట్టారు. అంతలో ఫోను జారీ పూల బుట్ట లో పడిపోయింది. ఫోన్ కోసం అంజలి కిందికి వచ్చి అటు ఇటు అంతా వెతుకుతూ ఉంటుంది. ఆశ కూడా వెతుకుతూ ఆ ఫోన్లో ఉన్న వీడియో ని ఎలాగైనా డిలీట్ చేయాలి అలాగే ఎట్టి పరిస్థితి లో స్వేత ఎక్కడ ఉందో అడ్రస్సు అంజలికి తెలియకుండా చూడాలి అని అనుకుంటుంది ఆశ. ఇంతలో అంజలి తల్లిదండ్రులు అమృత, అమృత భర్త కలిసి అంజలి ఎక్కడికి వెళ్ళింది. కనిపించడం లేదు, చాలా సేపటి నుంచి అంజలి కోసం చూస్తూ ఉంటారు.ఇంతలో అంజలి ఫంక్షన్ హాల్ లో ఫోన్ కోసం వెతుకుతూ ఉండడం చూస్తారు కానీ,ఫోను పూల బుట్ట లో పడి ఉండడం ఎవరూ గమనించ లేదు ఇంతలో, పంతులు గారు అయ్యా ఆ పూల బుట్ట ఇటు తీసుకు రండి అంటాడు, అక్కడ ఉన్నా ఒక అతను పూల బుట్ట ను పంతులు గారికి ఇస్తాడు.ఫంక్షన్ హాల్ లో అంజలి ని చూసిన అంజలి తల్లి దండ్రులు అంజలి ఏంటమ్మా ఇక్కడ ఏం చేస్తున్నావ్ ఇలా రా అని పక్కకు తీసుకొని వెళతారు. అమృతం ఏంటి అంజలి ఎటు వెళ్లిపోయావు కనిపించడం లేదు అని అడుగుతుంది. అందుకు అంజలి అమ్మ ఏమీ లేదు ఆశ నా ఫోన్లో ఉన్న వీడియో ని చూసే సింది అంటుంది అంజలి.

అందుకు అంజలి తల్లి తండ్రి, అయితే ఆశ నీకు భయపడింద ఈ వీడియో ఎవరికీ చూపించొద్దు నన్ను క్షమించు అంటూ ని కాళ్ళ బేరానికి వచ్చిందా అని అడుగుతారు అంజలిని. అందుకు అంజలి లేదమ్మా ఆశ ఏమి భయ పడడం లేదు అది కాక ఇంకా శ్వేతను రౌడీలతో కిడ్నాప్ చేయించింది. అని చెబుతుంది అంజలి. అప్పుడు అంజలి తల్లిదండ్రులు అయ్యో దేవుడా ఈ ఆశ వల్లనే,శ్వేత తల్లి అయిన లక్ష్మి చని పోయింది ఇప్పుడు శ్వేత చిక్కుల్లో పడిందా అని అనుకుంటూ ఉంటారు.

అంజలి అవును అమ్మ ఆశ నాకు ఫోన్ లో శ్వేత తో మాట్లా డించింది.కానీ శ్వేత కి మాత్రం తను కిడ్నాప్ అయ్యాను అని వాళ్ళు రౌడీలు అని తెలీదు. అంజలి పాపం శ్వేత ఆ అంకుల్స్ మా అమ్మ దగ్గరికి తీసుకు వెళ్తారని ఇంకా నమ్ముతుంది శ్వేత. అని చెబుతుంది అంజలి. అప్పుడు అమృత అయితే ఇప్పుడు ఏం చేద్దాం, అని అనుకుంటూ ఉంటారు. అంజలి. అదే అమ్మ ఇప్పుడు ఆలోచించాలి అని అంటుంది అంజలి. అంజలి తండ్రి ఆశ కి ఎందుకమ్మా భయ పడేది ఆ ఫోన్ ఇలా ఇవ్వు ఇప్పుడు ఆ వీడియో ని అందరికీ చూపించేస్తా నేను అంటాడు. అప్పుడు అంజలి అయ్యో నాన్న నాకు ఆశకు జరిగిన తోపులాటలో మధ్యలో ఫోను ఎక్క డో పడిపోయింది నేను దాని కోసమే వెతుకుతూ ఉంటే .మీరు వచ్చారు అంటుంది అంజలి. అయితే దానికి వెతకడం ఎందుకమ్మా నీ నెంబర్కు ఫోన్ చేస్తే సరి పోతుంది కదా అంటాడు అంజలి తండ్రి.అమృత అయ్యో ఇప్పుడు ఎలా ముహూర్త టైం ముంచుకొస్తుంది. అందుకు అంజలి. తండ్రి తో నాన్న నేను ఇన్నాళ్లు ఆ ఇంట్లో లక్ష్మీగా ఆ పసిదాని కోసమే ఉన్నాను అని ఏడుస్తూ తండ్రి తో చెబుతుంది అంజలి.