NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: చంద్రబాబు పై మరో కేసు నమోదు

Share

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదు అయ్యింది. తాజాగా ఏపీ సీఐడీ ఆయన పై కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఏసీబీ కోర్టుకు ఎఫ్ఐఆర్ కాపీని సీఐడీ అందజేసింది. మద్యం కంపెనీ లకు అక్రమంగా అనుమతులు మంజూరు చేశారన్న అభియోగంపై పీసీ యాక్ట్ కింద సీఐడీ కేసు నమోదు చేసింది. వరుసగా చంద్రబాబుపై కేసులు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Chandrababu

ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు. దాదాపు 50 రోజులకుపైగా చంద్రబాబు కారాగార వాసం చేస్తున్నారు. స్కిల్ కేసుతో పాటు చంద్రబాబు పై ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అంగళ్లు ఘటన కేసులు ఉన్నాయి. అంగళ్ల కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింద. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉంది.  ఈ కేసులో నవంబర్ 9వ తేదీ వరకూ అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు నవంబర్ 8వ తేదీన తీర్పు వెల్లడించనుంది.

మరో పక్క స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన మద్యంతర బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పు రిజర్వ్ చేసింది. వరుసగా చంద్రబాబుకు కేసులు వెంటాడుతుండటంతో ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి ఉండదా అని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

Chandrababu Arrest: చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వ్


Share

Related posts

RRR: కౌంట్‌డౌన్ స్టార్ట్..’రామ్ – భీమ్’ల కొత్త పోస్టర్ వదిలిన జక్కన్న టీమ్..

GRK

YSRCP: ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే కన్ఫర్మ్డ్ ..! ఎవరంటే..?

somaraju sharma

‘స్పీకర్ కుర్చీలో మజ్లిస్ ఎమ్మెల్యేనా!?’

Siva Prasad