NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. చ‌ప్ప‌గా చేస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు.. లోతుపాతులు గుర్తిం చి ఇవ‌త‌ల ప‌క్షం అడుగులు వేయాల్సి ఉంటుంది. అలా కాక‌పోతే.. మ‌రోసారి చేతులు కాల్చుకున్న‌ట్టే అవుతుంది. ఈ ప‌రిస్థితి ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. చిత్తూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రి నుంచి ఈ సారైనా విజ‌యం ద‌క్కించుకోవాల‌ని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు కుమారుడు.. భాను ప్ర‌కాష్ నాయుడు ప్ర‌య‌త్నిస్తున్నారు.

భాను 2014లో ఓడిపోయారు.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అంటే వ‌రుస ప‌రాజ‌యాలు వ‌చ్చాయి. మ‌రి ఇప్పు డైనా గెలుపు గుర్రం ఎక్కి తీరాల‌నే క‌సి అయితే.. భాను ప్ర‌కాష్ లో క‌నిపిస్తోంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ గెల‌వాల‌ని ఉంది. కానీ, ఆ మేర‌కు ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాల‌నే వాద‌న టీడీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తోంది. ఎందుకంటే.. ప్ర‌త్య‌ర్తిగా ఉన్న వ్య‌క్తి.. మంత్రి, పైగా ఫైర్ బ్రాండ్ రోజా. వైసీపీ కేడ‌ర్ అండ‌గా ఉంది. కొంత మేర‌కు విభేదాలు ఉన్నా.. ఆమె బ‌లంగా బ‌రిలో ఉన్నారు.

రోజాకు క‌లిసి వ‌స్తున్న అంశం.. కుటుంబ రాజ‌కీయం. భ‌ర్త నుంచి అన్న‌ల వ‌ర‌కు అంద‌రూ ఆమె గెలుపు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక‌, త‌న‌తో విభేదిస్తున్న వారితోనూ రోజా ఇటీవ‌ల షెడ్యూల్ వ‌చ్చిన త‌ర్వాత‌.. క‌లుపుకొని పోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. డ‌బ్బుల‌కు కొద‌వ లేకుండా ఖ‌ర్చు పెడుతున్నారు. ఇక‌, వైసీపీలో ఉన్న విభేదాల‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మొత్తంగా రోజా దూకుడుగా ఉన్నారు. పైగా నియోజ‌క‌వ‌ర్గంలో 24 వేల ఓట్లు ఉన్న మొద‌లియార్ సామాజిక వ‌ర్గంతో పాటు ( ఆమె భ‌ర్త సెల్వ‌మ‌ణిది ఇదే సామాజిక వ‌ర్గం) ఎస్సీ ఓట‌ర్లు 50 వేలు ఉండ‌డం.. వారిలో మెజార్టీ ఓట‌ర్లు రోజాకే వేసే ఛాన్స్ ఉండ‌డం కూడా ఆమెను త‌క్కువ అంచ‌నా వేసేందుకు ఛాన్స్ లేదు.

ఈ దూకుడును త‌ట్టుకుని నెగ్గేందుకు గాలి భాను ప్ర‌కాష్ కూడా అంత‌కు మించిన రేంజ్‌లో క‌ష్ట‌ప‌డాలి. ప్ర‌స్తుతం బాగానే తిరుగుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌ను మ‌రింత క‌లుపుకొని వెళ్లాలి. అవ‌స‌రానికి త‌గిన విధంగా నిధులు ఖ‌ర్చు చేయాలి. తండ్రి వార‌స‌త్వాన్ని అందుకునేలా నాటి నేత‌ల‌ను కూడా క‌లుపుకొని పోవాలి. ముఖ్యంగా పోల్ మేనేజ్‌మెంట్ వ్య‌వ‌హారంలో వెనుక‌బ‌డి ఉన్నార‌న్న విమ‌ర్శ‌ల‌ను త‌గ్గించుకునేందుకు ఆదిశ‌గా కూడా అడుగులు వేయాలి. అప్పుడే రోజా వంటి నాయ‌కురాలిపై విజ‌యంద‌క్కించుకోవ‌డం సులువ‌వుతుందని ప‌రిశీల‌కుల అంచ‌నా.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?