Salaar: డిసెంబర్ 22వ తారీకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన “సలార్” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. “బాహుబలి” సినిమా తర్వాత ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దాదాపు 5 సంవత్సరాల నుండి ప్రభాస్ విజయాన్ని చూడలేదు. దీంతో హిట్టు విషయంలో మంచి ఆకలి మీద ఉన్న ప్రభాస్ కి “KGF” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” సినిమా రూపంలో హిట్ దక్కింది. యాక్షన్ డ్రామాతో తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథలో రకరకాల ట్విస్టులతో.. ఎలివేషన్లతో సినిమాని ఓ రేంజ్ లో చిత్రీకరించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో యాక్షన్ సన్నివేశాలలో ప్రభాస్ అరాచకం సృష్టించాడని చెప్పవచ్చు.
ఈ సినిమా మొదటి షో పడిన వెంటనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ రీతిగానే ఫస్ట్ రోజు కలెక్షన్స్ రికార్డు స్థాయిలో వచ్చాయి. చాలాకాలం తర్వాత హిట్టు పడటంతో ప్రభాస్ ఫ్యాన్స్.. “సలార్” విజయం సాధించడం పట్ల ఫుల్ సంతోషంగా ఉన్నారు. ఇదిలావంటే “సలార్” విజయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మై డియర్ దేవా (ప్రభాస్) కి హృదయపూర్వక అభినందనలు. సలార్ సీజ్ ఫైర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఫుల్ ఫైర్ అని ప్రశంసించారు. అదేవిధంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నీ అభినందించారు. ఇంతటి గొప్ప విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ కి అభినందనలు.
ఒక ప్రపంచాన్ని సృష్టించాలంటే మీరు దిట్ట. వరదరాజ మన్నార్(పృధ్వీరాజ్), ఆద్య(శృతిహాసన్), కర్త(జగపతిబాబు).. అద్భుతంగా నటించారు వారికి నా అభినందనలు. ఇంతటి గొప్ప విజయంలో భాగమైన టెక్నికల్ బృందం భవన గౌడ్ (సినిమాటోగ్రాఫర్), రవి బస్రుర్(సంగీత దర్శకుడు), చలపతి (ఆర్ట్ డైరెక్టర్), అన్బిరివ్(యాక్షన్ డైరెక్టర్), నిర్మాత విజయ్ కిరాగందూర్.. మిగిలిన సలార్ సినిమా యూనిట్ మొత్తానికి అభినందనలు అనీ చిరంజీవి.. తన పోస్ట్ లో తెలియజేయడం జరిగింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేయడంతో రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు మరింతగా సంతోష పడుతున్నారు.