NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri December 23 2023 Episode 108: కౌశికి ని ఇంట్లో నుంచి తరిమేస్తానంటున్న నిషిక. తాను మహా వృక్షం అంటున్న వాళ్ళమ్మ..

Jagadhatri Today Episode December 23 2023 Episode 108 Highlights

Jagadhatri December 23 2023 Episode 108: నిషి కౌశికి మర్యాదగా క్షమాపణ చెప్తావా లేదా అని వాళ్ళ అమ్మ అంటుంది. బాగా ఆలోచించి నిషి నన్ను క్షమించండి వదిన అని అంటుంది. చూడు నిషి నీ క్షమాపణలు కాదు నాకు కావాల్సింది నువ్వు మంచిగా మరి అందరితో ప్రేమగా ఉండడం నేర్చుకో అని కౌశికి అంటుంది. నువ్వు రా నిషి అని వాళ్ళ అమ్మ తీసుకువెళ్తుంది. వదిన అదేదో తెలియక గారాభం ఎక్కువై చేసింది అని ధాత్రి చెప్తుంది. గారాబం వల్ల పెంకితనం చేస్తే అందరికి సంతోషమే కానీ అదే తల పొగుడుతూ చేస్తే అందరినీ బాధపెట్టి తను బాధపడుతుంది అంటూ వెళ్ళిపోతుంది కౌశికి. జగదాత్రి అది పింకిదమ్మ అలాగే చేస్తుంది నువ్వు దాని గురించి పట్టించుకోకు అని సుభద్ర అంటుంది. బామ్మ తన జీవితం ఎక్కడ పాడు చేసుకుంటుదొనని  భయంగా ఉంది అని ధాత్రి అంటుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 23 2023 Episode 108 Highlights
Jagadhatri Today Episode December 23 2023 Episode 108 Highlights

ఏం చేస్తున్నావ్ ప్రతి దానికి గొడవ పడి నువ్వు అందరి ముందు నవ్వుల పాలవుతున్నావేంటి ధాత్రిని చూసి నేర్చుకో అది చూడు కౌశికి ని మంచిగా చేసుకుని తన వైపు తిప్పుకొని దాన్ని ఇంట్లో ఉండమని కౌశికి చెప్తుంది కోడలు అయిన నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మంటుంది అంటే అక్కడే నువ్వు అర్థం చేసుకోవాలి కదా నిషి అని వాళ్ళ అమ్మ అంటుంది. నిషి నువ్వు ఇప్పుడే కొత్తగా పెళ్లయిన అమ్మాయి కాబట్టి ఇలా ప్రవర్తించడం తప్పులేదు కానీ నువ్వు అందరితో మంచిగా ఉండమ్మా అన్నిటికీ గొడవలు తెచ్చుకోకు ధాత్రిని చూసి నేర్చుకునే అది చూడు నీ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేకపోయినా అందరితో ఎలా ఉండాలి కౌశికి ని ఎలా బుట్టలో వేసుకోవాలని ఆలోచించి అందరినీ తన వెంట తిప్పుకొని మాయమాటలు చెబుతుంది ముందు దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నించు  అని వాళ్ళ అత్తయ్య అంటుంది. అందరూ నన్నే అనండి ధాత్రిని కాదు వెళ్ళగొట్టేది ముందు కౌశికి ని ఇంట్లో నుంచి తరిమేస్తాను అప్పుడు కానీ నాకు ఇంటి  మీద పెత్తనం రాదు  అని నిషిక అంటుంది. నిషి నువ్వు కౌశికి ని ఎదిరించాలని చూస్తున్నావు కానీ కౌశికి మామూలు మనిషి కాదు మహావృక్షం తనని కదిలించాలి అంటే కొమ్మని కాదే కొట్టేది కింద నుంచి కుక్కుట వేళ్ళతో పెగిలించాలి కానీ నీకు ఇప్పుడు అంతా అనుభవం లేదు అలా చేయాలి అంటే నువ్వు ముందు యుద్ధానికి సిద్ధం కావాలి వాళ్లతో మంచిగా మసులుతూ వాళ్ళ గుడ్డునంత చేపట్టాలి ఆ తరువాత కౌశికి ని ఆ కుర్చీలో నుంచి దింపడానికి యుద్ధం చేయాలి అని వాళ్ళ అమ్మ అంటుంది. అర్థమైందా అమ్మ ఈకానుంచి నా ప్రవర్తన మార్చుకుంటాను అందరితో మంచిగా ఉండి కౌశికి వదిన చేతనే ధాత్రిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిస్తాను అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 23 2023 Episode 108 Highlights
Jagadhatri Today Episode December 23 2023 Episode 108 Highlights

ధాత్రి నీ పెళ్లి మేము కళ్ళారా చూడలేకపోయినా నీకు మంచి భర్తని ఇచ్చాడమ్మా భగవంతుడు డబ్బు ఆస్తి లేకపోయినా పర్వాలేదు కేదార్ చాలా మంచివాడు నీ కళ్ళల్లో నుంచి కన్నీరు రానివ్వకుండా నిన్ను ప్రేమగా చూసుకుంటాడు నీ మీద అంత ప్రేమ ఉందమ్మా కేదారికి అని సుభద్ర అంటుంది. అవును బామ్మ అని ధాత్రి అంటుంది. ఇంతలో కేదర్ అట్నుంచి నడుచుకుంటూ వస్తాడు. కేదార్ ఇలా రా నాన్న అని సుభద్ర పిలుస్తుంది. ఏంటి బామ్మ అంటూ కేదార్ వచ్చి ఆమె పక్కన కూర్చుంటాడు. మీరిద్దరూ చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నారు నేను కాశీ నుంచి విశాలాక్షి అమ్మవారి కుంకుమ తెప్పించాను ఈ కుంకుమ ధాత్రి నుదుటిన పెట్టు నాయనా మీది జన్మజన్మల బంధం గా నిలిచిపోతుంది బ్రతికున్నంత కాలం ధాత్రి సుమంగళిగా ఉంటుంది అని సుభద్ర అంటుంది. బామ్మ నేను స్నానం చేయలేదు ఇది పవిత్రమైన బొట్టు అంటున్నావ్ స్నానం చేశాక పెడతానని కేదార్ అంటాడు. ఇదేంటి కేదార్ ఇందాకే స్నానం చేశాడు కదా మరి ఎందుకు అబద్ధం చెప్తున్నాడు వీళ్ళిద్దరి మీద నాకెందుకు డౌట్ గా ఉంది అని కౌశికి అనుకుంటుంది. అవును బామ్మ కేదార్ స్నానం చేయలేదు తర్వాత పెడతాడు అని ధాత్రి అంటుంది.

Jagadhatri Today Episode December 23 2023 Episode 108 Highlights
Jagadhatri Today Episode December 23 2023 Episode 108 Highlights

సరే కేదార్ స్నానం చేసిన తర్వాత మర్చిపోకుండా ధాత్రి కి పెట్టు అని సుభద్ర అంటుంది. ఇంతలో ఒక్క నిమిషం బామ్మ గారు అని కౌశికి అక్కడికి వస్తుంది. కేదార్ ఇందాకే నువ్వు స్నానం చేసావ్ దాత్రి కూడా టవల్ ఇచ్చింది ఏంటి స్నానం చేయలేదని అబద్ధం చెబుతున్నారు బామ్మ బొట్టు పెట్టమంటే ఎందుకు కంగారు పడుతున్నారు మీరిద్దరూ భార్యాభర్తలే కదా బొట్టు పెట్టు కేదార్ అని కౌశికి అంటుంది. ఓ అవును బామ్మ మర్చిపోయాము అని ధాత్రి అంటుంది. ఏంటర పిల్లలు కొత్తగా పెళ్లయినంత మాత్రాన ప్రేమలో పడి కొన్ని విషయాలు మర్చిపోతే ఎలాగ రా కేదార్ నువ్వు అమ్మాయికి బొట్టు పెట్టు అని సుభద్ర అంటుంది. ఇప్పుడు తెలిసిపోతుంది వీళ్ళిద్దరూ భార్యాభర్తల లేకపోతే నటిస్తున్నారా అని కౌశికి అనుకుంటుంది. బామ్మ పెళ్లి కాని వాళ్ళు ఈ బొట్టు పెడితే ఏమవుతుంది అని కౌశికి అడుగుతుంది. చాలా పెద్ద అరిష్టం జరుగుతుందమ్మా కష్టాలు కోరి తెచ్చుకుంటారు అని సుభద్ర చెప్తుంది. దేవుడా తప్పని తెలిసినా బొట్టు పెట్టక తప్పడం లేదు ఏమైనా కష్టాలు వస్తే అవి నాకే వచ్చేలా చేయి ధాత్రిని మాత్రం కష్టపెట్టకు అని కేదార్ అనుకుంటాడు. భగవంతుడా కేదార్నే వాళ్ళ కుటుంబానికి కలిపి సంతోషపెడతానని చెప్పాను ఈ బొట్టు పెట్టి ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు నా మీద వేసి కష్టాన్ని నాకివ్వు కానీ కేదార్ని మాత్రం ఈ కుటుంబానికి దూరం చేయకు అని ధాత్రి మనసులో అనుకుంటుంది. కేదార్ ఏంటి ఆలోచిస్తున్నావ్ బొట్టు పెట్టు అని కౌశిక  అంటుంది. తప్పించుకోలేని పరిస్థితిలో కేదార్ ధాత్రికి బొట్టు పెడతాడు. ఇలాగే కలకాలం నిండు నూరేళ్లు  వర్ధిల్లండి అని వాళ్ళ బామ్మ దీవిస్తుంది. బామ్మ ఇందాక నువ్వు అన్నట్టు పెళ్లి కాని వాళ్ళు బొట్టు పెడితే ప్రమాదం వస్తుందా అని కౌశికి అడుగుతుంది. పెద్ద ప్రమాదం వస్తుంది త్వరలోనే పెళ్లి జరుగుతుంది అని సుభద్ర అంటుంది. ఆ మాట వినగానే కేదార్ ముఖం సంతోషంతో నిండిపోతుంది. కౌశికి చిరునవ్వుతో ఇంట్లోకి వెళుతుంది. ఏంటి ధాత్రి పద వెళ్దాం అని కేదార్ అంటాడు. బామ్మ ఏం చెప్పింది నాకు అర్థం కాలేదు అని ధాత్రి అంటుంది. చెప్పింది కదా త్వరలోనే పెళ్లి అవుతుందని కేదార్ అంటాడు. ఏంటి అని ధాత్రి కంగారు పడుతూ ఉంటుంది. అబ్బాయి ఏమి లేదురా దాత్రి అంటూ కేదారి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 23 2023 Episode 108 Highlights
Jagadhatri Today Episode December 23 2023 Episode 108 Highlights

అమ్మ కౌశికి రేపు 50 కోట్ల కాంట్రాక్టర్ మాట్లాడ్డానికి పొద్దున్నే అపార్ట్మెంట్ ఉంది త్వరగా లేచి వెళ్దాం అమ్మ అని వాళ్ళ బాబాయ్ చెప్తాడు. అలాగే బాబాయ్ అని కౌశికి అలారం పెట్టుకుని పడుకుంటుంది. వదిన ఇదే మంచి సమయం అందరి ముందు న్నాను అవమానిస్తావా పొద్దున నువ్వు ఇచ్చిన గిఫ్ట్ కి ఇప్పుడు నేను ఇవ్వబోయే గిఫ్ట్ చాలా బాగుంటుంది లేటుగా లేసి రేపు 50 కోట్ల కాంట్రాక్టర్ పోగొట్టుకొని ఏడుస్తూ కూర్చుంటావు అప్పుడు నా పగ చల్లారుతుంది అని నిషిక అనుకుంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 23 2023 Episode 108 Highlights
Jagadhatri Today Episode December 23 2023 Episode 108 Highlights

నిషిక వాళ్ళ ఆయన నిద్రపోతారు. యువరాజు నిద్రపోయింది చూసి మెల్లగా లేసి నిషిక  కౌశికి గదిలోకి వచ్చి అలారం మార్చి బాయ్ వదిన పొద్దున కాంట్రాక్టర్ మిస్ అయితావు అంటూ వెళ్తుంది. కౌశికి డోరు నిషిక వేయడం చూస్తుంది ధాత్రి అమ్మో ఇదేంటి ఇప్పుడు నన్ను చూసింది అందరికీ చెప్పేస్తుందని టెన్షన్ పడుతుంది నిషిక. ఈ టైంలో ఏం చేస్తున్నావ్ నిషిక ఇక్కడ అని ధాత్రి అడుగుతుంది. నాకు నిద్ర పట్టక వాకింగ్ చేస్తున్నాను అయినా ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే అని నిషిక అంటుంది. దాహం వేసింది మంచినీళ్ల కోసం వచ్చాను అని ధాత్రి అంటుంది. సర్లే నేను ఇక్కడ వాకింగ్ చేస్తున్నట్టు ఎవరికి చెప్పకు దాన్ని అలుసుగా తీసుకొని పెద్ద గొడవ చేస్తారు అందరూ అంటూ నిషిక వెళ్ళిపోతుంది. నిషిక ఏం చెప్పిందో ధాత్రి కి అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది..

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella