Gannavaram: వాతావరణం అనుకూలించకపోవడంతో కృష్ణాజిల్లా గన్నవరం వద్ద గాలిలోనే విమానాలు చక్కర్లు కొట్టాయి. సోమవారం ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండటంతో విమానాలు ల్యాండింగ్ కు ఇబ్బందికరంగా మారింది. చెన్నై, బెంగుళూరు ఇండిగో విమానాలు దాదాపు గంటకు పైగా గాలిలో చక్కర్ల కొట్టాయి.
ల్యాండింగ్ సమస్యతో ఎయిర్ పోర్టు చుట్టూ బెంగళూరు విమానం చక్కెర్లు కొట్టింది. గుడివాడ, ముదినేపల్లి ప్రాంతాల్లో చెన్నై విమానం చక్కెర్లు కొట్టింది. దాదాపు గంట సేపు గాలిలోనే చక్కర్లు కొట్టిన చెన్నై, బెంగళూరు విమానాలు చివరకు గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాయి.
గంట పాటు గాలిలోనే విమానాలు చక్కర్లు కొట్టడంతో విమానంలో ఉన్న ప్రయాణీకులు ఆందోళనకు గురి అయ్యారు. ప్రతి రోజూ పొగ మంచు ఎక్కువగా ఉండటంతో విమానాలు రన్ వే పై దిగడం ఇబ్బందికరంగా మారిందని అధికారులు చెబుతున్నారు. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయంగా మారింది.
Bandi Sanjay: బండి సార్ భలే సెలవిచ్చారు