NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Supreme Court: చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో మరో ట్విస్ట్ ..

Supreme Court: ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవేళ సుప్రీం కోర్టు విచారణ జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇవేళ విచారణే జరగలేదు.

ఇవేళ (బుధవారం) మధ్యాహ్నం 3 గంటలకు జస్టిస్ అనిరుద్దబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రావాల్సి ఉంది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టు హాల్ కు చేరుకున్నారు. అయితే ఈ రోజు తాము ధర్మాసనంలో కూర్చోవడం లేదని జస్టిస్ అనిరుద్ద బోస్ స్పష్టం  చేశారు.

తదుపరి విచారణ తేదీ ప్రకటించాలని చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా ఈ సందర్భంగా కోరారు. తదుపరి విచారణ తేదీని తర్వాత ప్రకటిస్తామని జస్టిస్ అనిరుద్ద బోస్ తెలిపారు. దీంతో సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసులో విచారణ జరగలేదు. అవినీతి నిరోధక చట్టం 17ఏ తో ముడిపడి ఉన్నందున ధర్మాసనం గతంలో ఈ కేసును వాయిదా వేస్తూ వచ్చింది. అప్పటి వరకూ చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

అయితే మంగళవారం సెక్షన్ 17 ఏ పై ధర్మాసనం బిన్న తీర్పులు వెలువరించిన నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పై ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈవేళ ధర్మాసనంలో జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది కూర్చోకపోవడంతో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ జరగలేదు.

YSRCP: నేడో రేపో వైసీపీ నాల్గవ జాబితా .. 25 నుండి సీఎం జగన్ క్యాడర్ తో సమావేశాలు

Related posts

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju