NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari February 1 2024 Episode 382: మధు అనుమానం నిజం చేసిన ముకుంద.. కృష్ణ కి ఝలక్ ఇచ్చిన భవాని..

Krishna Mukunda Murari Today Episode February 1 2024 Episode 382 Highlights

Krishna Mukunda Murari February 1 2024 Episode 382: మధు ఉదయాన్నే నిద్ర లేచి సీరియస్ గా స్టోరీ రాస్తూ ఉంటాడు అప్పుడు నందిని వచ్చి ఏంటి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు నేను తీయబోయే సినిమా కథ రాస్తున్నాను. ఈ కథను సినిమాలో తీసిన డైరెక్టర్ ఈ కథ సీరియస్ అనుకుంటావేమో.. కామెడీ తెలుసా అని మధు అంటాడు ఏంటి ఈ కథ తెలుసుకోవాలని చెప్పనా అని మధు అంటుండగా నందిని చెవులు మూసుకుంటుంది. ఏంటి నా కథ నీకు అస్సలు నేను చెప్పక ముందే చెవులు మూసుకున్నావు అని నందిని మధు అంటాడు. అప్పుడు కృష్ణ కిందికి దిగివస్తుంది .

Krishna Mukunda Murari Today Episode February 1 2024 Episode 382 Highlights
Krishna Mukunda Murari Today Episode February 1 2024 Episode 382 Highlights

కృష్ణ వాళ్ళని చూస్తూ మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. ఇంతకీ ఆదర్శ్ ముకుంద ఎక్కడ ఇంకా కిందకు రాలేదా ఆదర్శ్ ముకుందా ఇద్దరు కిందకు రండి. మీకు ఒక మంచి విషయం చెప్పాలి ఇంట్లో వాళ్ళందరూ కూడా రండి అని కృష్ణ హడావుడి చేస్తుంది. ఏంటి బ్రో కృష్ణ హడావిడి చేస్తుంది ఇంతకీ విషయం ఏంటి అని మురారిని మధు అడుగుతాడు. అప్పుడు మురారి నాకు కూడా అసలు విషయం ఏంటో తెలియదు అని అంటాడు. అవునా నీకు తెలియకుండా ఎలాగ అని మధు అంటాడు. ఇది సర్ప్రైజ్ అందుకే ఏసిపి సార్ కి కూడా అందరితోపాటు తెలుసుకోవాలని నేను అనుకున్నాను. అందుకే ప్రతి విషయాన్ని చెప్పే నేను ఈసారి ఈ విషయాన్ని మాత్రం అందరితో పాటే తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అప్పుడే కదా అది సర్ప్రైజ్ అవుతుంది అని కృష్ణ అంటుంది. ఇంతకి ఆ సర్ప్రైజ్ ఏంటి అని కృష్ణ ని మధు అడగగా.. అప్పుడు రింగ్ బాక్సులని చూపిస్తుంది. ఏంటి అవి రింగ్ బాక్సులే కదా అని మధు అంటాడు . ఇది రింగ్ బాక్సులు కానీ వీటిని తీసుకువచ్చిన సందర్భం మాత్రం ప్రత్యేకం అని కృష్ణ అంటుంది. అవునా ఈ రింగ్స్ ఎవరికోసం అని మధు అడుగుతాడు. అప్పుడు కృష్ణ ముకుంద ఆదర్శ్ కలిసిన ఆనంద సమయంలో వాళ్ళిద్దరి పెళ్లి సాక్షిగా మరోసారి వాళ్ళిద్దరికీ ఉంగరాలు మార్పించాలని అనుకుంటున్నాను అని కృష్ణ అంటుంది. ఇక అందరూ సంతోషిస్తారు. అప్పుడు మధు ముకుంద కి ఈ రింగులు మర్చిపోవడం ఇష్టం లేదనుకుంటా తన ముఖంలో కాస్త కూడా సంతోషంగా కనిపించడం లేదు అని మధు అంటాడు అప్పుడు ముకుందా కంగారుపడుతుంది. కృష్ణ ముకుంద వైపు చూసి తనది ఇష్టం లేకపోవడం కాదు సిగ్గుతో కూడిన బిడియం అని చెబుతుంది. అయినా ముకుంద ఫేస్ చూస్తే నాకెందుకు అలా అనిపించడం లేదు అని మధు అంటాడు.

Krishna Mukunda Murari Today Episode February 1 2024 Episode 382 Highlights
Krishna Mukunda Murari Today Episode February 1 2024 Episode 382 Highlights

ఆదర్శ్ ముకుందా మిరిదిద్దరు ఈ బాక్స్ తీసుకోండి అని వాళ్ళ చేతులకి చెరో ఒక రింగ్ బాక్సులు కృష్ణ ఇస్తుంది. ఆదర్శ్ ఆ రింగును ఓపెన్ చేసి అందరి ముందు ముకుంద చేతికి తొడగబోతాడు. అప్పుడు ముకుందా కావాలని తన చేతిని వెనక్కి లాక్కుంటుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నేను చెప్పానా ముందుగానే ముకుంద కి ఇష్టం లేదు అని మీరు ఎవరు నా మాట వినలేదు అని మధు అంటాడు . అప్పుడు కోపంగా ముకుందా ఇష్టం లేదని నువ్వు ఎలా చెప్తావు మధు. ఇంకా వేరే కారణం ఏదో ఉంటుంది అని అనుకోవచ్చు కదా అని ముకుందా అంటుంది. అయితే ఆ వేరే కారణం ఏంటో చెప్పమను అని ముకుందని చూస్తే భవాని అంటుంది. కృష్ణ ఇప్పటివరకు ఆదర్శ్ నేను సంతోషంగా ఉండాలని చూసింది కానీ, మా మీద తను చూపించిన ప్రేమ మేము కూడా కృష్ణ మురారి ల మీద చూపించాలి కదా.. ఇప్పుడు ఈ ఉంగరాలని మేము మార్చుకోవటం కన్నా వాళ్ళిద్దరూ మార్చుకోవడమే చాలా మంచిది. వాళ్ళు మా మీద చూపించే ప్రేమని ఈ విధంగా మేము కూడా వాళ్ళ మీద ప్రేమను చూపించాలి కదా అని ముకుందా అంటుంది.

Krishna Mukunda Murari Today Episode February 1 2024 Episode 382 Highlights
Krishna Mukunda Murari Today Episode February 1 2024 Episode 382 Highlights

అయితే ఇంకొక సెట్ ఉంగరాలని నేను తెప్పిస్తాను, ఈ ఉంగరాలు మీరు మార్చుకోండి అని మధు అంటాడు. ఉంగరాలు ఏముంది మధు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ఉంగరాలని కష్టా మురారి లు మార్చుకుంటేనే నాకు సంతోషం. నువ్వేమంటావ్ ఆదర్శ్ అని తన అభిప్రాయం తీసుకుంటుంది ముకుంద. తను కూడా ఒప్పుకుంటాడు. ఇక కృష్ణా మురారి ఇద్దరు సంతోషంగా ఆ ఉంగరాలు మార్చుకుంటారు. ప్రస్తుతానికి గండం కట్టేక్కాను అని ముకుందా అనుకుంటుంది. కానీ అందరి మనసులో మాత్రం ఒక అనుమానం సృష్టించాను అని తన మనసులో బాధపడుతుంది.

Krishna Mukunda Murari Today Episode February 1 2024 Episode 382 Highlights
Krishna Mukunda Murari Today Episode February 1 2024 Episode 382 Highlights

ఇక గదిలోకి వచ్చిన తర్వాత ముకుందా ఆదర్శ ను పిలిచి సారీ చెబుతుంది. మిమ్మల్ని బాధ పెట్టి ఉండవచ్చు కానీ, నేను కావాలని బాధ పెట్టలేదు. వాళ్ళు మన కోసం ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాము అని వాళ్లకు తెలియాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించండి ఆదర్శ్ అని ముకుందా అంటుంది. అప్పుడు లేదు ముకుందా నువ్వు చాలా మంచి దానివి. కొంతమంది ఇలాంటి సందర్భాలలో చాలా సెల్ఫిష్ గా ఆలోచిస్తారు కానీ, నువ్వు అలా ఆలోచించలేదు. నువ్వు భార్యగా దొరకడం నిజంగా నా అదృష్టం. కానీ నేనే నీ విషయంలో తప్పు చేశాను. నేను నిన్ను అర్థం చేసుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. అదే ఇక్కడే ఉండి ఉంటే నీ మనసు మారిపోయిన వెంటనే నీతోనే కలిసి ఉండేవాడిని అని ఆదర్శ్ అంటాడు.

Krishna Mukunda Murari Today Episode February 1 2024 Episode 382 Highlights
Krishna Mukunda Murari Today Episode February 1 2024 Episode 382 Highlights

రేపటి ఎపిసోడ్ లో రేవతి దగ్గరికి కృష్ణ వచ్చి కార్యం కోసం ముహూర్తం ఇప్పుడప్పుడే లేదు. ఒక పది రోజులు ఆగమంటే పంతులు గారిని అడిగి పెట్టుడి ముహూర్తాలు పెట్టమని చెప్పాము. కానీ పెద్ద అత్తయ్య ఆదర్శ ముకుంద లకు పెట్టుడి ముహూర్తం మాత్రం వద్దని చెప్పింది. మీరే ఒకసారి మాట్లాడండి అని కృష్ణ రేవతి తీసుకొని వెళుతుంది. కృష్ణ మీరు పెట్టుడు ముహూర్తం పెట్టుకోండి కానీ, ఆదర్శ ముకుందకి మాత్రం పెట్టుడు ముహూర్తం వద్దు. వాళ్ళు ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తారు పరవాలేదు అని భవాని అంటుంది.

Related posts

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

kavya N

Big flop Movie: బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన భారీ బడ్జెట్ మూవీ.. మొత్తం బాలీవుడ్ ని ముంచేసిన మూవీ ఇది..!

Saranya Koduri

Dhe Celebrities Special 2: ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 కి సరికొత్త హోస్ట్.. ఈసారి డబల్ కిక్..!

Saranya Koduri

Swathi Chinukulu: మళ్లీ వస్తున్న ” స్వాతి చినుకులు ” సీరియల్.. ఆనందంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Elections Results 2024: మూవీ థియేటర్స్ లో ఎన్నికల ఫలితాల లైవ్.. ఆ సిటీలో బుకింగ్స్ కూడా స్టార్ట్..!

Saranya Koduri

OTT: థియేటర్ రిలీజ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Big Boss 8: బిగ్ బాస్ 8 కి కంటెస్టెంట్లు సిద్ధం.. ఈసారి కొత్త రూల్స్ తో మరింత ఎంటర్టైన్మెంట్..!

Saranya Koduri

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Saranya Koduri