NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana Budget: రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ..కేటాయింపులు ఇలా..

Telangana Budget: తెలంగాణలో 2024 – 35 ఆర్ధిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో డీప్యూటి సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.

రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వ తొలి పద్దును ప్రతిపాదించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుతూ స్వేచ్చను సాధించుకున్నారని.. వారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి భట్టి పేర్కొన్నారు.

సామాజిక, ఆర్ధిక రాజకీయ న్యాయాన్ని అందించే స్పూర్తితో బడ్జెట్ ను ప్రతిపాదించినట్లు వివరించారు. గత ప్రభుత్వ పథకాలు గొప్పు.. అమలుకు దిబ్బ అన్నట్లుగా ఉండేవన్నారు. గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రం ఆర్ధిక కష్టాల పాలైందని చెప్పారు. గత ప్రభుత్వ అప్పులను అధిగమించి అభివృద్ధిలో సంతులిత వృద్ధి లక్ష్యంగా ముందుకు వెళతామని అన్నారు. తమది ప్రజల ప్రభుత్వమని మంత్రి విక్రమార్క అన్నారు.

ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా తాము ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చామని తెలిపారు. ఆరు గ్యారెంటీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. మొత్తం బడ్జెట్ లో శాఖల వారీగా నిధుల కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.

కేటాయింపులు ఇలా..

  • ఆరు గ్యారెంటీ పథకాల అమలు కసం రూ.53,196 కోట్లు
  • పరిశ్రమల శాఖకు రూ.2543 కోట్లు
  • ఐటీ శాఖకు రూ.774 కోట్లు
  • పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు
  • పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
  • మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు
  • వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు
  • ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1,250 కోట్లు
  • ఎస్సీ సంక్షేమానికి రూ.21874 కోట్లు
  • ఎస్టీ సంక్షేమానికి రూ.13013 కోట్లు
  • మైనార్టీ సంక్షేమానికి రూ.2262 కోట్లు
  • బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు
  • బిసీ సంక్షేమానికి రూ.8వేల కోట్లు
  • విద్యా రంగానికి రూ.21,389 కోట్లు
  • తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటునకు రూ.500 కోట్లు
  • యూనివర్శిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు
  • వైద్య రంగానికి రూ.11,500 కోట్లు
  • విద్యుత్ – గృహ జ్యోతికి రూ.2418 కోట్లు
  • విద్యుత్ సంస్థకు రూ.16825 కోట్లు
  • గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు
  • నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు

Nara Lokesh: రేపటి నుండి లోకేష్ శంఖారావం యాత్ర

Related posts

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju