NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam February 10 2024 Episode 156: భాగమతి అవార్డు ఫంక్షన్ కి రాకూడదని కిడ్నాప్ చేయించిన మనోహరి..

Nindu Noorella Saavasam Today Episode February 10 2024 Episode 156  Highlights

Nindu Noorella Saavasam February 10 2024 Episode 156:  అంతా మర్చిపోయారు అనుకునే సమయానికి ఈ రాథోడ్ మళ్ళీ గుర్తు చేయాలా అని మనోహరి అనుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ రాథోడ్ ఇప్పుడు అమర్ ఈ పరిస్థితిలో అక్కడికి వెళ్లి ఆ అమ్మాయితో ఎలా మాట్లాడగలడు అని మనోహరి అంటుంది. ఎవడో ఏదో వాగాడని బాగిని కలవకుండా ఎలా ఉంటాం రా వెళ్లి తనను కలిసి మన ఇంటికి ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి రా అని శివరామ్ అంటాడు. అలాగే నాన్న రాథోడ్ బండి తీయి వెళ్దాం అని అమరేంద్ర అంటాడు. ఇప్పుడు అమర్ అక్కడికి వెళ్తే భాగమతిని కలుస్తాడు కల్వకూడదు ఎలా అని టెన్షన్ పడుతూ నేను కూడా వస్తాను అమర్ అని మనోహరి అంటుంది. సరే రా వెళ్దాం అని అమరేంద్ర అంటాడు. ఫోన్ తీసుకొని వస్తాను అని మనోహరి లోపలికి వెళ్తుంది. రాథోడ్ అమరేంద్ర కారులో కూర్చుంటారు. రాథోడ్ ఇంకా రావట్లేదు వెళ్లి పిలుచుకు రా అని అంటూ ఉండగా మనోహరి వస్తుంది. వాళ్లు కార్లు అవార్డు ఫంక్షన్ కి బయలుదేరుతారు.

Nindu Noorella Saavasam Today Episode February 10 2024 Episode 156  Highlights
Nindu Noorella Saavasam Today Episode February 10 2024 Episode 156  Highlights

బాగిని చూడడానికి అరుంధతి కూడా వస్తుంది అని తన పక్కనే ఉన్న సీటు వంక చూస్తుంది మనోహరి. ఏంటి మను ఇటు చూస్తున్న ఎవరున్నారు అని అరుంధతి అంటుంది. ఈరోజు భాగమతిని చూద్దామని నువ్వు వస్తున్నావ్ అరుంధతి కానీ నా ప్లాన్ నాకు ఉన్నాయి ఆ మ0గళ నాకు ఫోన్ చేసి వాళ్ల నాన్న మాట్లాడుతున్నాడని చెప్పింది. అలా జరగకూడదని అవార్డు ఫంక్షన్ కి పంపించానమ్మ అని నాకు ఫోన్ చేసి చెప్పింది. అందుకే నేను రౌడీ కి మళ్ళీ ఫోన్ చేసి బాగిని కిడ్నాప్ చేయమని చెప్పాను భాగి అవార్డు ఫంక్షన్ కి రాదు రౌడీ కిడ్నాప్ చేస్తాడు అని మనోహరి అనుకుంటుంది. కట్ చేస్తే, బండి ఆగిపోయింది అన్న సాకుతో ఖాళీ రోడ్డు మీద బండి ఆపి వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తాడు. మిస్డ్ కాల్ ఇస్తే అక్క ఫోన్ చేస్తానన్నది కానీ ఇంకా చేయట్లేదు ఏంటి అని ఖాళీ ఎదురుచూస్తూ ఉంటాడు.మావయ్య బండి రెడీ అయ్యేలా లేదు నేను ఆటోలో వెళ్తాను అని భాగమతి అంటుంది. వద్దు బాగి రెండు నిమిషాలు ఆగు రెడీ అవుతుంది అని వాళ్ళ మామయ్య అంటాడు. ఇంతలో మంగళ ఫోన్ చేస్తుంది. ఇదిగో బాగి అక్క ఫోన్ చేస్తుంది చెప్పక్క బావ ఎలా ఉన్నాడు

Nindu Noorella Saavasam Today Episode February 10 2024 Episode 156  Highlights
Nindu Noorella Saavasam Today Episode February 10 2024 Episode 156  Highlights

ఇంటికి రావాల అని కాళీ అంటాడు. వద్దురా అవార్డు ఫంక్షన్ కి వెళ్ళండి అని మంగళ అంటుంది. పిన్ని నాన్న ఎలా ఉన్నాడు ఇందాక పెళ్లి అన్నాడు ఏమైనా చెప్పాడా అని భాగమతి అంటుంది. స్పృహలోకి వచ్చాడమ్మా మాట్లాడాడు నీ పెళ్లి లోపు లేవ లేకపోతే నువ్వే కాళ్లు కడిగి కన్యాదానం చేయమని చెప్పాడు డాక్టర్ గారు మీ నాన్నకు ఆనందం కలిగించే పనులు చేయమన్నాడు భాగీ నువ్వు వెళ్లి అవార్డు తీసుకుంటే మీ నాన్న సంతోషిచి త్వరగా కోలుకుంటాడు నువ్వు హాస్పిటల్ కి రావద్దు బాగి అవార్డు తీసుకుని రా అని మంగళ అంటుంది. అలాగే పిన్ని నాన్న జాగ్రత్త అని భాగి చెబుతుంది. కట్ చేస్తే, రేయ్ మనోహరి మేడమ్ చూపించిన వీళ్ళిద్దరూ ఇటు నుంచే వస్తారు వాళ్ళు రాగానే కిడ్నాప్ చేయాలి అని రౌడి అంటాడు. ఇంతలో బండి తోలుకుంటూ కాళీ అదే దారి గుండా వస్తాడు. బండి ఆపరా అని ఖాళి ని అంటాడు అతను. నా బండి నా ఇష్టం నేనెందుకు ఆపాలి అని ఖాళీ అంటాడు. రేయ్ అమ్మాయిని వదిలిపెట్టి పారిపో లేదంటే ప్రాణాలు పోతాయి అని రౌడి అంటాడు. నాకు కాబోయే భార్య బాగి తనను వదిలిపెట్టను అని ఖాళీ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode February 10 2024 Episode 156  Highlights
Nindu Noorella Saavasam Today Episode February 10 2024 Episode 156  Highlights

అయితే ఇప్పుడు కూడా వదిలిపెట్టవా అని అతను కత్తి చూపెడతాడు ఖాళికి వెంటనే ఖాళీ పారిపోతాడు. మామయ్య అలా పరిగెడతావ్ ఏంటి అని టెన్షన్ పడుతూ అంటుంది భాగమతి. పొరి నువ్వు అరవకుండా సైలెంట్ గా ఉండు అని రౌడీలు బాగమతి చుట్టుముడతారు. ఎవరు మీరు అంతా మర్యాదగా నన్ను వెళ్ళనివ్వండి అని భాగమతి అంటుంది. రేయ్ మనల్ని బెదిరిస్తుంది రా అని రౌడీ తన చేయి పట్టుకుంటాడు. భాగమతి అతని కింద నిట్టేసి పారిపోతుంది. రేయ్ దాన్ని పట్టుకొని రా అని అంటాడు ఆ రౌడీ. పక్కన ఉన్న నలుగురు రౌడీలు పరిగెత్తికెళ్ళి భాగమతిని పట్టుకుంటారు. కట్ చేస్తే, ఆరు నా పక్కనే ఉంది వాడి ఇంకా ఫోన్ చేయట్లేదు భాగి నీ కిడ్నాప్ చేశాడో లేదో అని మనోహరి టెన్షన్ పడుతుంది. రాథోడ్ బండపు అని అమరేంద్ర అంటాడు.ఏమైంది సార్ అని రాథోడ్ బండి ఆపుతాడు. అమరేంద్ర బండి దిగి చుట్టూ చూస్తాడు. ఏమైంది అమర్ ఎందుకు ఇక్కడ బండి ఆపాడు అని మనోహరి చూసేసరికి రౌడీ బాగమతిని కిడ్నాప్ చేసి కనపడతాడు.  వీడుక్కడున్నాడా ఇప్పుడు అమర్ చూస్తే భాగమతి కిడ్నాప్ అయిందని తెలిసిపోతుంది ఇప్పుడేలా అని మనోహరి టెన్షన్ పడుతుంది.

Nindu Noorella Saavasam Today Episode February 10 2024 Episode 156  Highlights
Nindu Noorella Saavasam Today Episode February 10 2024 Episode 156  Highlights

ఏమైంది సార్ ఇక్కడ ఎందుకు బండపమన్నారు అని రాథోడ్ అంటాడు. ఇక్కడ బైకు పడిపోయింది గాజులు పగిలిపోయిన మనుషులు ఎవరు కనపడట్లేదు కానీ రాథోడ్ ఇక్కడ ఏదో జరిగింది వెళ్లి చూసి రా అని అమరేంద్ర అంటాడు. రాథోడ్ లోపలికి వెళ్లి అంతా చూసి ఇక్కడ ఎవరూ లేరు సార్ అని అంటాడు. లేదు రాథోడ్ ఇక్కడ ఎవరో ఉన్నారు అని అమరేంద్ర ముందుకు వెళ్లి చూస్తాడు. నలుగురు రౌడీలు గోడ చాటుకు దాక్కు ఉంటారు ఇంకొక రౌడీ బాగమతి మూతికి కర్చీఫ్ అడ్డం పెట్టి గట్టిగా పట్టుకుంటాడు.తను ఎంత గింజుకున్నా అమరేంద్ర కి తన అరుపు వినపడదు. రేయ్ అతను లోపలికి వస్తున్నాడు నువ్వు వెళ్ళరా అని భాగమతిని పట్టుకున్న రౌడీ అంటాడు. ఒక రౌడీ బయటికి వచ్చి అయ్యయ్యో నా బండి ఇక్కడ పడిపోయింది అని ఏడుస్తాడు. ఈ బండి మీద ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode February 10 2024 Episode 156  Highlights
Nindu Noorella Saavasam Today Episode February 10 2024 Episode 156  Highlights

ఈ బండి నాదే సార్ ఇక్కడ పడిపోయింది అని అతను అంటాడు. బండి నీదైతే మరి ఇక్కడ పలికిన గాజులు ఏంటి అని అమరేంద్ర అడుగుతాడు.అది నా భార్య కోసం కొన్న గాజులు సార్ అన్ని పగిలిపోయాయి అని నెత్తి నోరు మూసుకుంటూ బండిని లేపుతాడు. బండి లేవకపోవడంతో సార్ హెల్ప్ చేయరా అని రాథోడ్ని అడుగుతాడు. రాథోడ్ వెళ్లి బండిని లేపి అతని పంపిస్తాడు. చుట్టూ చూసి అమరేంద్ర ఎవరు లేరని వెళ్లి కారులో కూర్చుంటాడు.భాగమతి కిటికీలోనుంచి చెయ్యి బయటికి పెట్టి ఊపుతుంది.రాథోడ్ కారు ముందుకు తీసుకు వెళ్తాడు. కారులో కూర్చున్న అరుంధతి భాగమతిని చూసి అయ్యో మిస్సమ్మ అని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N