NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అదే జ‌రిగితే 41 ఏళ్ల టీడీపీ చ‌రిత్ర‌లో బ్యాడ్ రికార్డు.. !

టీడీపీలో అలా జ‌రిగితే.. స‌రికొత్త రికార్డే అవుతుంద‌ని అంటున్నారు పార్టీ నాయ‌కులు. విష‌యం ఏంటం టే.. ఇప్ప‌టికే షెడ్యూల్ విడుద‌ల చేసిన రాజ్య‌స‌భ స‌భ ఎన్నికలు. రాష్ట్రంలో మొత్తం మూడు రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. అది కూడా ఈ నెల 27నే జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ వైసీపీ దీనికి సంబంధించి స‌మాయ‌త్తం అయిపోయింది. ముగ్గురు నేత‌ల‌ను కూడా ఎంపిక చేసేసిం ది. వీరిలో ఇద్ద‌రు రెడ్లు, మ‌రొక‌రు ఎస్సీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు.

ఇక‌, ఇప్పుడు తేలాల్సింది.. టీడీపీ వ్య‌వ‌హారం. వ‌చ్చే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని.. ఒక్క‌స్థానాన్న‌యినా నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుందని నిన్న మొన్న‌టి వ‌ర‌కు వినిపించిన టాక్‌. ఎందుకంటే. వైసీపీలో ఉన్న నేత‌ల అసంతృప్తి త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని భావించింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌లు.. ఎమ్మెల్యే ఓటు ఆధారంగానే జ‌రుగుతున్నాయి.

కాబ‌ట్టి.. త‌మ‌కు ఎలానూ 23 మంది ఉన్నార‌ని టీడీపీ భావిస్తోంది. ఇందులో న‌లుగురు ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే పార్టీకి దూర‌మ‌య్యారు. అయితే.. మ‌రికొంద‌రు క్రాస్ ఓటింగ్ చేసే అవ‌కాశం ఉంద‌ని.. వైసీపీలో టికెట్లు రాని వారంతా.. త‌మ‌కు అనుకూలంగా మార‌తార‌ని, అక్క‌డ అసంతృప్తితో ర‌గులుతున్నాయ‌ని ఆది నుంచి లెక్క‌లు వేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఇదే జ‌రిగిం ద‌న్న విష‌యాన్ని కూడా.. నాయ‌కులు గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున ఒక్క ఎమ్మెల్సీ అయినా గెలిచే బ‌లం టీడీపీకి లేదు.

అయితే వ్యూహాత్మ‌కంగా టీడీపీ అభ్య‌ర్థిగా పంచుమ‌ర్తి అనూరాధ‌ను నిల‌బెట్టింది. వైసీపీ నుంచి ఏకంగా నాలుగు ఓట్లు క్రాస్ అయ్యాయి. ఇక ఇప్పుడు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ త‌మ పార్టీ త‌ర‌పున క్యాండెట్‌ను నిల‌బ‌డెతోంద‌న్న ప్ర‌చారం అయితే గ‌ట్టిగా న‌డుస్తోంది. తీరా చూస్తే.. నామినేష‌న్ల‌కు గ‌డువు స‌మీపిస్తు న్న నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ స్పందించ‌లేదు.

మ‌రి.. రాజ్య‌స‌భ‌లో పోటీ ఉంటుందా? లేదా? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం టీడీపీ త‌ర‌ఫున టెక్నిక‌ల్ గా క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ మాత్ర‌మే రాజ్య‌స‌భ‌లో ఉన్నారు. ఈయ‌న ప‌ద‌వీ కాలం ఏప్రిల్‌తో ముగియ నుంది. ఈ నేప‌థ్యంలో ఎవ‌రినైనా రాజ్య‌స‌భ‌కు పంపించ‌క‌పోతే.. ఇక‌, టీడీపీ త‌ర‌ఫున ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌లో గ‌ళం వినిపించే నాయ‌కులు ఎవ‌రూ ఉండ‌రు. మ‌ళ్లీ 2026, జూన్ వ‌ర‌కు రాజ్య‌స‌భ‌కు అవ‌కాశం ద‌క్క‌దు. సో.. ఇదే జ‌రిగితే.. 41 ఏళ్ల టీడీపీ చ‌రిత్ర‌లో ఇది ఒక బ్యాడ్‌ రికార్డుగా మార‌నుంది.

Related posts

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?