NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యే సీటు పీకేసి మ‌ల్లాది విష్ణుకు కొత్త పోస్టు… అయినా జ‌గ‌న్‌కు బైబై..!

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు.. వైసీపీ కొత్త ప‌దవిని అప్ప‌గించిన విష యం తెలిసిందే. వాస్త‌వానికి ఆయ‌న సిట్టింగ్ ఎమ్మెల్యే కావ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇదే సీటును ఆశిం చారు. కానీ, వైసీపీ టికెట్‌ను పొరుగు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేకు అప్ప‌గించింది. ప్ర‌స్తుతం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావుకు సెంట్ర‌ల్ స‌మ‌న్వ‌య‌క‌ర్త ప‌గ్గాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు మ‌ల్లాది ని పార్టీ ఎటువైపు క‌ద‌ల‌కుండా చేసింద‌నే వాద‌న వినిపిస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేసి తీరుతా న‌ని మ‌ల్లాది అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే మ‌ల్లాదిని ఎటూ క‌ద‌ల‌కుండా.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ద‌వితో ఇరికించార‌ని అంటున్నా రు. విజ‌య‌వాడ వైసీపీ అధ్య‌క్షుడిగా తాజాగా ఆయ‌న‌కు వైసీపీ అధినేత అవ‌కాశం ఇచ్చారు. దీంతో ఇక‌, పూర్తిగా టికెట్ ఆశ‌లు స‌న్న‌గిల్లిన‌ట్టేనని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే మ‌ల్లాది త‌న దారి తాను చూసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. వ‌చ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున అయినా.. ఆయ‌న పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

మ‌ల్లాదికి టికెట్ లేద‌ని తెలిసిన త‌ర్వాత‌.. సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు.. పెద్ద ఎత్తున ఆయ‌న‌ను సంప్ర దిస్తున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం.. అలెర్ట‌యింద‌ని అంటున్నారు. అయితే, మ‌ల్లాది మ‌నిషిగా వైసీపీలో ఉన్న‌ప్ప‌టికీ.. మ‌న‌సు మాత్రం ఎమ్మెల్యే టికెట్‌పైనే ఉంది. దీంతో ఆయ‌న త‌న ప్ర‌య‌త్నాలు తాను చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ టికెట్ లేకుండా చేయ‌డం.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కులు ఎద్దేవా చేయ‌డం వంటి కార‌ణాల‌తో మ‌ల్లాది ఒంట‌రిపోరుకైనా సిద్ధ ప‌డుతున్నార‌ని అంటున్నారు.

కానీ, ఆర్థికంగా ప్ర‌స్తుతం ఉన్న ఇబ్బందుల నేప‌థ్యంలో ఆయ‌న ఇంత సాహ‌సం చేస్తారా? అనేది ప్ర‌శ్న‌గా మారింది. అంతేకాదు.. త‌న‌పై ఉన్న వ్యతిరేక‌త‌ను కూడా మ‌ల్లాది అంచ‌నా వేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో కొంత త‌గ్గుతున్న‌ట్టు అనిపించినా.. మ‌రోవైపు.. మ‌న‌సు మాత్రం లాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ క‌నుక ఖ‌ర్చుకు ముందుకు వ‌స్తే.. త‌న పోటీ ఖాయ‌మ‌నే వాద‌న‌నే ఆయ‌న త‌న అనుచ‌రుల‌కు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

ప్ర‌కాశం వైసీపీ లీడ‌ర్‌ యూట‌ర్న్‌.. సొంత కొంప‌కు సెగ పెట్టే ప‌ని చేశారే…!

నీతులు చెప్పి గోతిలో ప‌డ్డ చంద్ర‌బాబు…!

ష‌ర్మిల అతి, ఓవ‌ర్ యాక్ష‌న్ చూశారా… !

వైసీపీకి ట‌చ్‌లోకి కీల‌క నేత‌.. బెజ‌వాడ‌లో అర్థ‌రాత్రి హైడ్రామా…!

విశాఖ‌లో టాప్ సీట్లు లేపేసిన జ‌న‌సేన‌… పక్కా గెలిచే సీట్ల‌న్నీ ప‌ట్టేసిన ప‌వ‌న్‌…!

ష‌ర్మిల Vs ఆళ్ల మ‌ధ్య ఏం జ‌రిగింది… ఎందుకు బ‌య‌ట‌కొచ్చేశారు…!

2 సీట్ల‌లో లోకేష్ పోటీ… మంగ‌ళ‌గిరితో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గం కూడా…!

వేమిరెడ్డితో టీడీపీకి లాభం కాదు న‌ష్ట‌మేనా…!

టీడీపీలోకి మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్… మీడియేట‌ర్ ఎవ‌రంటే…!

BSV Newsorbit Politics Desk

CM YS Jagan: విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ పూజలు

sharma somaraju

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Kurnool: జంట హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు .. ఇద్దరికి ఉరి శిక్ష

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీకి, పదవికి ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

sharma somaraju

PM Modi: మేడారం జాతర .. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

sharma somaraju

చింత‌ల‌పూడి టీడీపీ క్యాండెట్ ఫిక్స్‌… ‘ సొంగా రోష‌న్‌ ‘ కు టిక్కెట్ వెన‌క ఇంత గేమ్ న‌డిచిందా..!