NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari February 26 2024 Episode 403: ముకుందంటే ఇష్టమని కృష్ణతో చెప్పిన మురారి.. ముకుంద సూపర్ ట్విస్ట్

Krishna Mukunda Murari Today Episode February 26 2024 Episode 403 Highlights

Krishna Mukunda Murari February 26 2024 Episode 403: కృష్ణ ముకుంద కి వాళ్ళు షాపింగ్ చేసిన బట్టలు ఇవ్వడానికి తన గదికి వెళ్తుం.ది అప్పుడే ముకుంద కి నా మొగుడు అని సేవ్ చేసుకున్న నంబర్ నుంచి కాల్ వస్తుంది. అప్పుడు కృష్ణ ఆదర్శ్ ఇక్కడే ఉన్నాడు కదా మళ్ళీ ఇంతలోనే ఎందుకు కాల్ చేస్తున్నాడు అని అనుమానం వస్తుంది. ముకుందా ఇప్పటికీ మురారిని మర్చిపోలేక పోతుందా ఏసీబీ సారు ముకుంద మర్చిపోవాలంటే నేను ఏం చేయాలి? అయినా ఆయన ఎందుకు ఫోన్ చేశారు అని కంగారుపడుతూ కృష్ణ వాళ్ల గదిలోకి వెళ్తుంది అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి.. అప్పుడు మురారి అవును నేనే ఫోన్ చేశాను ముకుంద కి అని మురారి కూడా అంటాడు. ఆ మాట విని కృష్ణ షాక్ అవుతుంది. నువ్వు కాఫీ తీసుకుని రమ్మని చెబుదామని కాల్ చేశా అని మురారి అంటాడు. అప్పుడు కృష్ణ కి ముకుంద పై ఉన్న అనుమానం ఇంకా బలపడుతుంది. అప్పుడు కృష్ణ మురారిని స్నానానికి వెళ్ళమని చెప్పి.. మురారి ఫోను కృష్ణ తీసుకుంటుంది. కృష్ణ మురారి ఫోను తీసుకొని ముకుంద గదిలోకి వెళ్తుంది . మురారి నెంబర్ ని ముకుందా నా మొగుడు అనే సేవ్ చేసుకుందా అనే అనుమానాన్ని క్లారిఫై చేసుకోవడం కోసం తన గదిలోకి వెళ్తుంది.

Krishna Mukunda Murari Today Episode February 26 2024 Episode 403 Highlights
Krishna Mukunda Murari Today Episode February 26 2024 Episode 403 Highlights

ముకుందా ఇంకా చూస్తావ్ ఏంటి నేను తీసుకువచ్చిన వైట్ సారీ ని కట్టుకొని చూడు. రేపు రాత్రి కట్టుకోవాలంటే నీకు ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి వైట్ శారీని ముకుందకు తీసి ఇచ్చి అర్జెంటుగా నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చి ఈ సారిని కట్టుకో నాకు చూపించు అని చెప్పి కృష్ణ ముకుందని హడావుడి చేస్తుంది. కృష్ణ కి నా మీద ఏదో అనుమానం వచ్చినట్టుంది ఏదైతే అది అయింది ఇంకా ఈ చీరను కట్టుకోక తప్పదు అని ముకుందా స్నానానికి వెళ్తుంది. అప్పుడు ముకుంద ఫోన్ తీసుకొని మురారి ఫోన్లో నుంచి ముకుంద కి ఫోన్ చేస్తుంది కృష్ణ తన అనుమానం నిజం కాకూడదు అని కృష్ణ ముకుంద నెంబర్ కి మురారి ఫోన్లో నుంచి డయల్ చేస్తుంది. అప్పుడు ముకుంద ఫోన్లో మురారి అని కనిపిస్తుంది. హమ్మయ్య నా అనుమానం నిజం కాలేదు అయితే ముకుందా నిజంగానే ఆదర్శ్ తో మాట్లాడుతుంది అని కృష్ణ అనుకుంటుంది. ఇక ముకుంద గదిలో నుంచి వెళ్ళిపోతుంది. ముకుంద బయటికి వచ్చాక కృష్ణ కి అనుమానం వచ్చింది, అందుకే నా మొగుడు అనే పేరును మురారి అని సేవ్ చేసుకున్నాను అని ముకుందా మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode February 26 2024 Episode 403 Highlights
Krishna Mukunda Murari Today Episode February 26 2024 Episode 403 Highlights

కృష్ణ మురారి దగ్గరకు వెళ్లి మీరు నేను కనిపించకపోతే నా ఫోన్ కి ఫోన్ చేయాలి కానీ మీరు ఎందుకు ముకుంద ఫోన్ కి ఫోన్ చేశారు అని మురారిని కృష్ణ నిలదీసి అడుగుతుంది. అప్పుడు మురారి నీకు నిజం తెలిసిపోయింది కాబట్టి నేను ఇంక నీ దగ్గర ఈ విషయాన్ని దాయలేను. నీకు నిజం చెప్పేస్తాను అని.. మురారి కృష్ణతో ముకుందా అంటే నాకు ఇష్టం. నేను ఇప్పటికీ తనని పెళ్లి చేసుకోలేకపోయాను అని బాధపడుతున్నాను తనంటే నాకు చాలా ఇష్టం కానీ నిన్ను నా జీవితంలోకి రాణించిన తర్వాత తనని మిస్ అయ్యాను అనే ఆలోచనను మాత్రం మర్చిపోలేక పోతున్నాను అని మురారి కృష్ణతో అంటాడు.

Krishna Mukunda Murari Today Episode February 26 2024 Episode 403 Highlights
Krishna Mukunda Murari Today Episode February 26 2024 Episode 403 Highlights

కృష్ణ ఆ మాటలు విని ఏడుస్తుంది. అప్పుడు మురారి హే పిచ్చిదానా.. నువ్వు నీ ఫోన్ ఎక్కడ మర్చిపోయావు, ఇక్కడే కదా ముందు నేను నీ ఫోన్ కి ఫోన్ చేశాను. కావాలంటే చూసుకో అని చెప్పి మురారి కృష్ణ ఫోన్ ని తీసుకొని ఇచ్చి కాల్ లిస్ట్ చెక్ చేయమని చెప్తాడు. చూడు కృష్ణ నా మనసులో ఎప్పటికీ నీకేస్తాను నువ్వంటే నాకు చాలా ఇష్టం అని మురారి కృష్ణ ని దగ్గరకు తీసుకుని హత్తుకుంటాడు. నువ్వు ఏమంటావో అని ప్రాంక్ చేశాను . అంతేకానీ నువ్వే నా భార్యవి నీకు తప్ప నా హృదయంలో మరి ఇంకెవ్వరికీ స్థానం లేదు అని మురారి కృష్ణతో అంటాడు సారీ ఏసీబీ సార్ అని చెబుతోంది.

Krishna Mukunda Murari Today Episode February 26 2024 Episode 403 Highlights
Krishna Mukunda Murari Today Episode February 26 2024 Episode 403 Highlights

జాగింగ్ కి వెళ్లిన మురారి దగ్గరికి ముకుంద వెళుతుంది ఏంటి ముకుందా ఎలా వచ్చావు ఎక్కడ అని మురారి అడుగుతాడు ఆదర్శ రాకుండా నువ్వు ఒక్కడివే వచ్చావా అని ముకుందా నువ్వు మురారి అడగగా.. ఆపుతావా ఇంకా ఆదర్శ గొడవ. నాకు ఆదర్శ అంటే ఇష్టం లేదు. నువ్వంటేనే ఇష్టం అని ముకుందా అంటుంది. అదేంటి అని మురారి కంగారు పడొద్దు అడుగుతాడు. అవును నువ్వంటే నాకు ఇష్టం. ఈ విషయం ఇంట్లో వాళ్లకి తెలిస్తే నన్ను ఇంట్లో ఉండనివ్వరని ఎన్నాళ్లు నా మనసుకి నచ్చ చెప్పుకుంటూ వచ్చాను . కానీ ఇంతలో మీరు ఆదర్శ్ ని తీసుకువచ్చారు. తనతో ప్రేమతో ఉండలేను. తనకి ప్రేమని పంచ లేక నీపై ప్రేమను చంపుకోలేక ఎన్ని రోజులు నుంచి నాలో నేనే నా ఎరకాన్ని అనుభవించాను. ఇంకా నేను ఆ నరకాన్ని అనుభవించలేను. అందుకే నీకు ఈ విషయాన్ని చెబుతున్నాను కానీ , నీకు చెప్పకూడదని అనుకున్నాను అయితే నా వల్ల కావడం లేదు అందుకే చెబుతున్నాను . నువ్వంటే నాకు ఇష్టం మురారి నిన్ను తప్ప నా మనసులోకి ఇంకెవరిని ఊహించుకోలేను ఆదర్శం నేను కలిసి ఉండలేను.

Krishna Mukunda Murari Today Episode February 26 2024 Episode 403 Highlights
Krishna Mukunda Murari Today Episode February 26 2024 Episode 403 Highlights

ఆదర్శ్ తో నాకు శోభనం ఇష్టం లేదు. నేను కనుక ఆ గదిలోకి పాల గ్లాస్ తో వెళ్తే ఇంకా బయటికి నా శవం వస్తుంది నిజంగా నీ మీద ఒట్టేసిచెబుతున్నాను. మురారి నేను గనక పాల గ్లాస్ తో ఆ గేదెలోకి వెళ్తే ఇక నువ్వు నా శవాన్ని చూస్తావు అని మురారిని ముకుందా బెదిరిస్తుంది. ఇక నువ్వు ఎలా చేస్తావో నాకు తెలీదు ఆదర్శ్ ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి నాతో శోభనం జరగకూడదు అని ముకుందా మురారి ని బెదిరిస్తుంది. చెప్పాల్సినవన్నీ చెప్పేసి ముకుందా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మురారి ఆ విషయాన్ని ఏం చేయాలని పదేపదే ఆలోచిస్తూ ఉండిపోతాడు.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella