NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ చెంత‌కే రాని ఆ నేత‌లు… సీన్ అర్థ‌మైపోయిందా…!

టీడీపీ-జ‌న‌సేన టికెట్ల పంపిణీ త‌ర్వాత ఆయా పార్టీల్లో అసంతృప్తులు పెల్లుబికాయి. ఇది స‌హ‌జం అంద‌రూ ఊహించిందే. అయి తే.. ఆ వెంట‌నే నాయ‌కులు.. జంపింగులు చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. ఇది కూడా స‌హ‌జ‌మే. వైసీపీలో టికెట్లు ద‌క్క‌వ‌ని భావించిన నాయ‌కులు కొంద‌రు టీడీపీలోకి వ‌చ్చారు. వీరిలో దాడి వీరభ‌ద్ర‌రావు కుటుంబం స‌హాప‌లువురు నాయ‌కులు ఉన్నా రు. అయితే.. వీరికి టికెట్లు ఇచ్చారా ? ఇవ్వ‌లేదా ? అనే విష‌యం ప‌క్క‌న పెడితే..
అస‌లు పార్టీ అయితే మారిపోయారు. మ‌రి ఇలానే టీడీపీ నుంచి కానీ, జ‌న‌సేన నుంచి కానీ.. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా వైసీపీవైపు చూడలేదు.

అసంతృప్తులు మాత్రం పెల్లుబికాయి. ఇరు పార్టీల నాయ‌కులు కూడా తీవ్ర‌స్థాయిలో ర‌గులుతున్నారు. అయితే.. వారి చూపు మాత్రం వైసీపీపై ప‌డ‌డం లేదు. ఒక్క విజ‌య‌వాడ ఎంపీ, తిరువూరు మాజీ ఎమ్మెల్యేలు మిన‌హా వైసీపీలోకి వ‌చ్చిన టీడీపీ నాయ‌కులు లేకుండా పోయారు. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనే విష‌యాలు ఆస‌క్తిగా ఉన్నాయి. వైసీపీ కంటే టీడీపీనే బెట‌ర్ అని త‌మ్ముళ్లు భావిస్తున్న‌ట్టు ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వైసీపీలోకి వ‌చ్చినా.. టికెట్లు ద‌క్కే ప‌రిస్థితి లేదు. పైగా..కేడ‌ర్‌లోనూ త‌మ బ‌లం పూర్తి గా పోతుంది. రేపు వారు కూడా వ్య‌తిరేకించే ప‌రిస్థితి ఉండే అవ‌కాశం ఉంది. దీంతో టీడీపీ నుంచి ఎవ‌రూ తాజాగా వైసీపీవైపు చూడ‌డం లేదు.

మ‌రోవైపు.. జాబితా ప్ర‌క‌టించిన వెంట‌నే చంద్ర‌బాబు యాక్ష‌న్ మొద‌లు పెట్టేశారు. టికెట్లు రాని సీనియ‌ర్ల‌ను త‌న‌చెంత‌కు పిలుచుకుని చ‌ర్చిస్తున్నారు. అదేస‌మ‌యంలో వారికి హామీలు కూడా గుప్పిస్తున్నారు. చంద్ర‌బాబుపై ఉన్న న‌మ్మ‌కంతోనే వారు పార్టీలోనే ఉండిపోవాల‌ని దాదాపు నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. పైగా కొన్ని ద‌శాబ్దాలుగా పార్టీలోనే ఉన్న‌వారు కావ‌డంతో (ఉదాహ‌ర ణ‌కు.. ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ వంటి వారు) వారు పార్టీలో టికెట్ వ‌చ్చినా రాకున్నా కూడా.. అక్క‌డే ఉండిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో వైసీపీ వైపు వ‌స్తార‌ని ఆ పార్టీ ఎదురు చూసినా.. ద్వారాలు తెరిచే ఉన్నాయ‌ని.. వైసీపీ నేత‌లు సంకేతాలు పంపించినా.. పెద్ద‌గా రియాక్ష‌న్ క‌నిపించ‌లేదు.

ఇక‌, జ‌న‌సేన‌కు 24 స్థానాలు ఇవ్వ‌డం ప‌ట్ల ఆ పార్టీలోనూ తీవ్ర అసంతృప్తి నెల‌కొంది. సూర్చ‌చంద్ర వంటి నాయ‌కులు రోడ్డెక్కి, కొంత యాగీ చేసినా.. వెంట‌నే స‌ర్దుకున్నారు. దీంతో ఇక్క‌డ కూడా వైసీపీకి నిరుత్సాహ‌మే ఎదురైంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై పార్టీ నాయ‌కుల‌కు ఉన్న అభిమానం. పార్టీని బ‌లంగా గెలిపించుకోవాల‌న్న ప‌ట్టుద‌ల వంటివి స్ప‌స్టంగా క‌నిపించాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. దీంతో అసంతృప్తులు ఉన్న మాట నిజ‌మే అయినా.. నాయ‌కులు లోలోన ర‌గిలిపోతున్నా తాడేప‌ల్లి వైపు మాత్రం ఎవ‌రూ చూడ‌లేదు. దీంతో వైసీపీ నాయ‌కులు పెట్టుకున్న ఆశ‌లు నిరాశ‌గానే మిగిలిపోయాన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju