Kalki2898AD Pushpa 2: ప్రపంచవ్యాప్తంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ కీర్తి ప్రతిష్టలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఒకప్పుడు హిందీ సినిమాలకు ప్రపంచ సినిమా రంగంలో మంచి డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలకు భారీ మార్కెట్ క్రియేట్ అయింది. హిందీ సినిమాల కంటే తెలుగు సినిమాలకు ప్రపంచ సినిమా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. బాహుబలి 2, RRR, పుష్ప సినిమాలు టాలీవుడ్ స్థాయిని పెంచేసాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ సినిమాలకి పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయింది. దీంతో తెలుగులో చాలావరకు సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు చేస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మార్కెట్ లు.. భారీగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో ఇప్పుడు వీరిద్దరూ చేస్తున్న సినిమాలు భారీ ధరలు పలుకుతున్నాయి. విషయంలోకి వెళ్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘కల్కి’, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడిందని సినీ వర్గాలు తెలిపాయి. ఒక్కో సినిమాకు నిర్మాతలు రూ. 100 కోట్లు కోట్ చేసినట్లు చెబుతున్నాయి. రిలీజ్ కి టైమ్ ఉండటంతో ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదట.
ఈ సినిమాలకు ప్రారంభంలోనే రేటు ఈ రకంగా ఉండటంతో నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారట. ప్రభాస్ “కల్కి 2898 AD” మే 9వ తారీకు సినిమా రిలీజ్ కాబోతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో దాదాపు 500 కోట్ల రూపాయలతో నిర్మితమవుతుంది. పాన్ వరల్డ్ తరహాలో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే “పుష్ప” సెకండ్ పార్ట్ కూడా మొదటి భాగం కంటే రెండింతలు బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15వ తారీకు “పుష్ప” రెండో భాగం రిలీజ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ మరియు ప్రభాస్ ఈ కొత్త సినిమాలకు.. ధీయాట్రికల్ రైట్స్… స్టార్టింగ్ లోనే కోట్ల రూపాయలు పలకటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.