NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Kalyani Priyadarshan: కళ్యాణి ప్రియదర్శన్ నిజంగానే ఆ స్టార్ హీరో కొడుకుతో ప్రేమ‌లో ఉందా..?

Kalyani Priyadarshan: కళ్యాణి ప్రియదర్శన్.. ఈ అందాల సోయగాన్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ దిగ్గజ దర్శకనిర్మాత ప్రియదర్శన్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ లిస్సీ దంపతులకు జన్మించిన కళ్యాణి ప్రియదర్శన్.. 2017లో హలో మూవీ ద్వారా హీరోయిన్ గా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది. అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విషయం సాధించకపోయినా.. కళ్యాణి ప్రియదర్శన్ అందం, అభినయానికి మంచి మార్కులు పట్టాయి.

ఆ తర్వాత చిత్రలహరి మూవీతో తొలి హిట్ అందుకున్న కళ్యాణి.. హీరో మూవీ ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. వారనే అవశ్యముండ్ అనే చిత్రంతో మలయాళ ప్రేక్షకులను పలకరించింది. సొంత గ‌డ్డ అయిన మ‌ల‌యాళంలో హృదయం, బ్రో డాడి వంటి చిత్రాలు ఆమెకు స్టార్ ఇమేజ్ ను తెచ్చి పెట్టాయి. అలాగే తమిళంలో మానడు మూవీ ఆమెకు భారీ క్రేజ్ ఏర్పడేలా చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మలయాళ, తమిళ భాషల్లో వ‌రుస‌గా చిత్రాలు చేస్తూ కెరీర్ ను పరుగులు పెట్టిస్తోంది.

సినిమాల గురించి పక్కన పెడితే.. చాలా కాలం నుంచి కళ్యాణి ప్రియదర్శన్ కు సంబంధించి ఓ న్యూస్ మాలీవుడ్‌ బాగా వైర‌ల్ అవుతోంది. హీరో ప్రణవ్ తో క‌ళ్యాణ్ ప్రేమ‌లో ఉంద‌ని మాలీవుడ్ మీడియా ఎప్ప‌టి నుంచో కోడై కూస్తోంది. ప్ర‌ణ‌వ్ మ‌రెవ‌రో కాదు మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ త‌న‌యుడు. మోహ‌న్ లాల్ మ‌రియు క‌ళ్యాణి తండ్రి ప్రియ‌ద‌ర్శ‌న్ ఇద్ద‌రూ ఆప్త మిత్రులు. వీరిద్ద‌రి కాంబోలో ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు వచ్చాయి. ఇద్ద‌రు కుటుంబాల మ‌ధ్య‌ కొన్నేళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయి.

దాంతో ప్ర‌ణ‌వ్‌, క‌ళ్యాణి చిన్న‌త‌నం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా మెలుగుతున్నారు. హృద‌యం చిత్రంలో జంట‌గా కూడా న‌టించారు. అయితే వీరి క్లోజ్‌నెస్ చూసి ప్రణవ్, కళ్యాణి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందనే టాక్ మొదలైంది. చిన్ననాటి స్నేహితులైన కల్యాణి, ప్రణవ్.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కాలనుకుంటున్నార‌ని ఎప్ప‌టినుంచి మాలీవుడ్ లో వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో మోహ‌న్ లాల్ స్వ‌యంగా ఈ వార్త‌ల‌ను ఖండించారు. అయిన‌ప్ప‌టికీ పుకార్లు మాత్రం ఆగ‌లేదు.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N