NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

పోటీ లేదు.. బొక్కాలేదు.. పార్లమెంట్ ఎన్నికలను లైట్ తీసుకోనున్న కేసీఆర్..!

ఎంత విచిత్రం.. ప్రత్యేక తెలంగాణ తెచ్చిన పార్టీ రెండుసార్లు వరుసగా సాధారణ ఎన్నికలలో అప్రతిహత విజయం సాధించి తిరుగులేకుండా దూసుకుపోయింది. ప్రత్యేక తెలంగాణ తెచ్చిన పార్టీగా పేరున్న పార్టీ అధినేత.. పదేళ్లపాటు ఇష్టం వచ్చినట్టుగా ఒక మహారాజుగా రాష్ట్రాన్ని ఏలేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న ఆయన ఆశలను రాష్ట్ర ప్రజలు అడియాసలు చేశారు. అయితే మూడు నెలలలోనే అధికారం పోవడంతో.. ఆయన పూర్తి బలహీనుడిగా మారిపోయారు. ఇదంతా ఎవరి గురించో కాదు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి అన్న విషయం అందరికీ తెలిసిందే.

తెలంగాణలో గత డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికలలో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
మరో 45 రోజులలో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి పద్దేళ్ళ‌పాటు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ.. అందులోను గత అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 40 సీట్లు గెలుచుకున్న పార్టీ ఎంతో గట్టిగా పోరాటం చేయాలి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఆ పరిస్థితిలో కనపడటం లేదు. ముందే కేసీఆర్ చేతులు ఎత్తేశారు. లోక్‌శ‌భ ఎన్నికల సన్నాహాలను కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టేసారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది.

ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా వచ్చి పడుతున్న సమస్యలతో పాటు తన ముద్దుల కుమార్తె కవితను ఈడీ అరెస్టు చేయటం కేసీఆర్ ను మరింతగా ఇబ్బంది పెడుతోంది. వరుసగా లీడర్లు కూడా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. కేటీఆర్ ఢిల్లీలో ఉంటున్నారు. దీంతో ఎన్నికలను ఎవరు సీరియస్‌గా తీసుకుంటున్న వాతావరణం కనిపించడం లేదు.
ఇప్పటికే ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారిపోయారు. పలువురు ముఖ్య నేతలు కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్న కూడా.. ఆయన వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదట.

ప్రస్తుతం కెసిఆర్‌కు మేడిగడ్డ కుంగుబాటు అంశంలో విచారణ సవాల్గా మారనుంది. ఈ విషయంలో ఆయన ఎట్టి పరిస్థితిలోనూ చట్టం ముందు దోషుగా నిలబడతారని ఎక్కువమంది నమ్ముతున్నారు. దీనికి తోడు ఢిల్లీ లిక్కర్ స్కాం లో కేసీఆర్ కుమార్తె కవితను టార్గెట్‌ గా చేసుకుంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వివాదం కూడా ముందుకు వచ్చింది. వీటి నుంచి తప్పించుకోవాలంటే కెసిఆర్‌కు బీజేపీ నుంచి రక్షణ కోరటం త‌ప్ప మరో ఆప్షన్ లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు అయ్యేవరకు కేసీఆర్ బహిరంగంగా ఏ నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితి. అందుకే బిఆర్ఎస్ అభ్యర్థులు విషయంలో ఆయన పూర్తిగా బలహీనులను పోటీ చేయిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది.

ఇక బీఆర్ఎస్‌ తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఎక్కడా సీరియస్ గా ప్రచారం చేస్తున్న దృశ్యాలు కనిపించడం లేదు. అసలు ఎన్నికలను పూర్తి లైట్గా తీసుకోమని.. కేసీఆర్ యే పరోక్షంగా కేడర్‌కు, పార్టీ నాయకులకు సంకేతాలు పంపుతున్నారన్న అభిప్రాయానికి పార్టీ క్యాడర్ వచ్చేసింది. ఏది ఏమైనా మూడు నెలల కిందట వరకు తిరిగి లేని స్థాయిలో ఉన్న పార్టీకి ఒకే ఒక్క ఓట‌మితో ఈ పరిస్థితి రావటం జాతీయ రాజకీయ వర్గాల్లోనే సంచలనంగా మారింది.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju