NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో బీజేపీ ఒక్క సీటూ గెల‌వ‌దంటూ పందాలు…!

ఆంధ్రప్రదేశ్లో బిజెపితో పొత్తు తెలుగుదేశం – జనసేన కొంప కొల్లేరు చేస్తుందా ? అంటే తాజా రాజకీయ సమీకరణలు అవుననే చెబుతున్నాయి. బిజెపితో పొత్తు కుదరటానికి ముందు జనసేన – టిడిపి ఏకంగా 120 సీట్లతో అధికారంలోకి వస్తాయి అని చెప్పిన సర్వేలు కూడా ఇప్పుడు టైట్ అయిపోయింది అని చెబుతున్నాయి అంటే బిజెపి పొత్తులో కి ఎంటర్ అయ్యాక టిడిపి – జనసేన పార్టీలకు ఎంత మైనస్ అయిందో క్లియర్ గా కనబడుతోంది. వాస్తవానికి బిజెపికి ఏపీలో ఒక శాతం ఓటింగ్ కూడా లేదు. అయినా చంద్రబాబు కేంద్రంలో ఎన్డీయేతో స్నేహం లేకపోతే ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచినా రాష్ట్రంలో ఏమీ చేయలేమన్న నిర్ణయానికి వచ్చి చాలా రాజీ పడ్డారు.

బిజెపికి ఏకంగా ఐదు పార్లమెంటు ఆరు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అవి కూడా తమకు సరిపోవని బిజెపి కండిషన్ పెట్టడంతో చివరకు జనసేన తాను తీసుకున్న అనకాపల్లి పార్ల‌మెంటు సీటుతో పాటు మరో మూడు అసెంబ్లీ స్థానాలు సైతం త్యాగం చేసి బిజెపికి ఇచ్చింది. ఓవరాల్ గా బిజెపికి ఆరు పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాలు ఇస్తున్నారు. అయినా కూడా కేంద్రంలో బిజెపి నాయకత్వం టిడిపికి మనస్ఫూర్తిగా సహకరిస్తున్న వాతావరణం అయితే లేదు. చిలకలూరిపేటలో మోడీ ప్రసంగం కూడా జగన్ ప్రభుత్వం పై అంత ఘాటుగా లేదు.

పార్లమెంటు స్థానాలలో అరకు, రాజంపేట, తిరుపతి సీట్లలో బిజెపి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక బిజెపి పోటీచేసే పది అసెంబ్లీ స్థానాలలో ఒక్క సీటులో అయినా గెలుస్తుందా ? అంటే సందేహంగానే కనిపిస్తోంది. గతంలో విశాఖ నార్త్‌లో గెలిచిన విష్ణుకుమార్ రాజు ఈసారి అక్కడ గలిచే పరిస్థితి లేదు. ఎచ్చెర్ల – పాడేరు – ధర్మవరం – బద్వేలు – జమ్మలమడుగు – విజయవాడ వెస్ట్ లాంటి సీట్లు బిజెపి తీసుకున్న అస్సలు గెలిచే ఛాన్సులు లేవు. కైకలూరులో కామినేని శ్రీనివాస్ కు కాస్త సానుకూలత ఉన్న ఇప్పుడు కామినేనిని కాదని సోమ వీర్రాజు పోటీ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే ఈ సీటు కూడా కష్టంగా కనిపిస్తోంది.

ఏపీలో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పార్ల‌మెంటు సీట్ల సంగ‌తేమె గాని అసెంబ్లీ సీట్ల‌లో క‌మ‌లం సింబ‌ల్ ఉండి, అటు టీడీపీ , జ‌న‌సేన సింబ‌ల్స్ లేకపోతే ఫ్యాన్ సింబ‌ల్‌కు అయినా ఓట్లేసేందుకు జ‌నాలు సిద్ధంగా ఉన్నారే కాని క‌మ‌లం పువ్వుకు ఓటేసేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు. అందుకే ఇప్పుడు ఈ ఈక్వేష‌న్లు చూస్తే ఏపీలో బీజేపీ ఒక్క అసెంబ్లీ సీటు లో అయినా గెల‌వ‌ద‌నే బెట్టింగులు కూడా మొద‌ల‌య్యాయంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.

Related posts

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N