NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ మ‌డ‌మ తిప్పేసిన హామీలు ఇవే… ఆన్స‌ర్లు ఏం చెపుతాడో…!

రాజ‌కీయం రాజ‌కీయ‌మే. ఈ విష‌యంలో తేడా లేదు. సీఎం జ‌గ‌న్‌.. చంద్రబాబు త‌న 2014 మేనిఫెస్టోను ఎవ‌రికీ క‌నిపించ‌కుండా మాయ చేశాడ‌ని ఒక‌వైపు ఆరోపిస్తున్నారు. దీనినే ప్ర‌జ‌ల్లోకి కూడా తీసుకువెళ్తు న్నారు. త‌మ మేనిఫెస్టో అంటే.. భ‌గ‌వ‌ద్గీత, బైబిల్ అని కూడా చెబుతున్నారు. కానీ, చంద్ర‌బాబు 600 హామీలు ఇచ్చి ఒక్క దానిని కూడా నెర‌వేర్చ‌లేద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. దీనికి కౌంట‌ర్‌గా చంద్ర‌బాబు వైసీపీపై ఎదురు దాడి చేస్తున్నారు. తాజాగా సోష‌ల్ మీడియాలో వైసీపీ అధినేత ఇచ్చిన హీమీల్లో అమ‌లు చేయ‌ని వాటిని వైర‌ల్ చేస్తున్నారు.

వీటిని ప‌రిశీలిస్తే.. వైసీపీకి భారీ దెబ్బ ప‌డ‌డం ఖాయమ‌నే వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే.. వైసీపీ అధినేత 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన ఈ హామీలు ఒక్క‌రికి మాత్ర‌మే సంబంధించినవి కావు.. వేలాది మంది ల‌క్ష‌లాదికి సంబంధించిన‌వి. దీంతో వైసీపీ పై తీవ్ర వ్య‌తిరేక‌త‌ను క్ష‌ణాల్లో ఇవి పెంచేస్తున్నాయి. ఇంత బ‌ల‌మైన హామీలు ఇచ్చి కూడా జ‌గ‌న్ త‌న హామీల‌ను నెర‌వేర్చ‌లేద‌న్న‌ది టీడీపీ ప్ర‌ధాన వాద‌న‌. వీటిని ముందు పెట్టి.. ప్ర‌జ‌లు తేల్చుకోవాల‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు.

ఇవీ.. జ‌గ‌న్ మ‌డ‌మ తిప్పేసిన హామీలు..
1) సీపీఎస్ ర‌ద్దు: తాము అధికారంలోకి వ‌చ్చిన వారంలోనే సీపీఎస్‌ను ర‌ద్దు చేస్తామ‌ని జ‌గన్ చెప్పారు. అంతేకాదు.. ఇది అస‌లు విష‌య‌మే కాద‌ని.. త‌మ చేతుల్లో చిటికెలో అమ‌ల‌వుతుంద‌న్నారు. అయితే.. ఇప్ప‌టికీ అమ‌లు చేయ‌లేదు.

2) సంపూర్ణ మ‌ద్య నిషేధం: తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. విడ‌త‌ల వారీగా మ‌ద్యాన్ని నిషేధిస్తా మ‌ని.. 2024 ఎన్నిక‌ల స‌మ‌యానికి అస‌లు రాష్ట్రంలో మ‌ద్యం అన్న‌ది దొర‌కకుండా చేసిన త‌ర్వాతే ఓట్లు అడుగుతాన‌ని 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ చెప్పారు. కానీ, ఇదీ నెర‌వేర‌లేదు.

3) 45 ఏళ్ల‌కే పింఛ‌ను: బీసీల్లోని క‌ల్లుగీత‌, మ‌త్స్యాకార, చేనేత కార్మికుల‌కు 45 ఏళ్లు నిండితే చాలు కుటుంబంలో ఎంత మంది ఉన్నా.. పింఛ‌న్లు ఇస్తామ‌ని 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ చెప్పారు. కానీ, ఇది ఒట్టిమాట‌గానే మిగిలిపోయింది.

4) మెగా డీఎస్సీ: రాష్ట్రంలో తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే మెగా డీఎస్సీ వేసి.. ఉద్యోగాలను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. ఇదీ నెర‌వేర‌లేదు. ఎన్నిక‌లకు కేవ‌లం 6150 పోస్టుల‌తో డీఎస్సీ వేశారు.

5) ఉద్యోగాల భ‌ర్తీ: తాము అధికారంలోకి రాగానే.. 2ల‌క్ష‌ల 30 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని జ‌గ‌న్ చెప్పారు. కానీ, ఇప్ప‌టికి కేవ‌లం 6 వేల ఉద్యోగాలు మాత్ర‌మే భ‌ర్తీ చేశారు.

6) ప్ర‌త్యేక హోదా: 25కి 25 ఎంపీ స్థానాలు ఇస్తే.. ప్ర‌త్యేక హోదా సాధించి రాష్ట్రానికి మేలు చేస్తామ‌న్నారు. కానీ, 22 మంది ఎంపీల‌ను ఇచ్చినా ఆయ‌న సాధించ‌లేక పోయారు.

7) జాబ్ క్యాలెండ‌ర్‌: అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌తి జ‌న‌వ‌రి 1నే జాబ్ క్యాలెండ‌ర్ ఇచ్చి ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌న్నారు. కానీ, అలా కూడా చేయ‌లేదు.

Related posts

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju