NewsOrbit
Telugu TV Serials న్యూస్

Chinna Kodalu Serial: చిన్న కోడ‌లు సీరియ‌ల్ న‌టి రూప శ్రవ‌ణ్ ఫ్యామిలీ రియ‌ల్ లైఫ్ ఫ్యాక్ట్స్‌.. బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. ఆమె ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చిందో తెలుసా?

Chinna Kodalu Serial: తెలుగు టీవీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన సీరియల్స్ లో చిన్న కోడలు ముందు వరుసలో ఉంటుంది. ఒకప్పుడు ఈ సీరియల్ జీ తెలుగులో సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యేది. ప్రసిద్ధ హిందీ సీరియల్ చోటి బహుకు చిన్న కోడలు రీమేక్. ఈ సీరియల్ లో రవి కిరణ్, రూప శ్రవణ్ ప్రధాన పాత్రలు పోషించారు. బుల్లితెరపై ఈ సీరియల్ కొన్ని వందల ఎపిసోడ్ లను పూర్తి చేసుకుని మెగా హిట్ గా నిలిచింది. అలాగే ఈ సీరియల్ లో ఫిమేల్ లీడ్ రోల్ లో రూప శ్రవణ్ నటించింది. రాధిక పాత్రలో రూప తన అందం, అభినయంతో తెలుగువారి హృదయాలను గెలుచుకుంది.

చిన్న కోడలు సీరియల్ వచ్చి పదేళ్లు దాటిపోయిన రూపను ఇప్పటికీ రాధిక గానే గుర్తుపడతారు. అంతలా ఆమెకు ఈ సీరియల్ గుర్తింపును తెచ్చింది. అయితే రూప న‌టిగా ముఖ‌ పరిచయమే తప్ప ఆమె రియల్ లైఫ్ గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలోనే రూప గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బెంగ‌ళూరులోని ఓ మరాఠీ కుటుంబంలో రూప జ‌న్మించింది. ఆమె తండ్రి వ్యాపార‌వేత్త కాగా.. తల్లి గృహిణి.

ఇండ‌స్ట్రీలోకి వెళ్లాల‌ని.. న‌టి కావాల‌ని రూప ఎప్పుడూ కోరుకోలేదు. న‌ట‌న‌లో ఎలాంటి శిక్ష‌ణ తీసుకోలేదు. క‌నీసం ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నించి కూడా లేదు. అదృష్టం కొద్ది అవ‌కాశాలే రూప‌ను వెత్తుకుంటూ వ‌చ్చాయి. పీయూసీ అనంత‌రం డిగ్రీలో చేరదామనుకుంటున్న స‌మ‌యంలో రూప ఇండ‌స్ట్రీకి చెందిన ఓ వ్య‌క్తి కంట్లో ప‌డింది. ఆయన రూప ఇంటి ప‌క్క‌నే ఉండేవారు. అమ్మాయి ల‌క్ష‌ణంగా ఉండ‌టంతో స‌ద‌రు వ్య‌క్తి సీరియ‌ల్స్ లో న‌టిస్తావా అంటూ రూప‌ను సంప్ర‌దించారు.

ఇంట్లో వారు కూడా ప్రోత్సాహించ‌డంతో అనుకోకుండా రూప నటిగా తొలి అడుగు పడింది. దూరదర్శన్‌లో ఓ కన్నడ సీరియల్ తో కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత సినిమా ఛాన్సులు వ‌చ్చాయి. హీరోయిన్ గా కూడా చేయ‌మ‌ని కొంద‌రు అడిగారు. కానీ రూప అందుకు మొగ్గు చూప‌లేదు. కొన్ని క‌న్న‌డ చిత్రాల్లో స‌హాయ‌క న‌టిగా మాత్ర‌మే రూప న‌టించింది. అలాగే క‌న్న‌డ‌లో తొమ్మిది సీరియ‌ల్స్ చేసింది. లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది.

ఇక కన్నడలో కుల గౌరవ సీరియల్ చేస్తున్న టైమ్ లో జీ తెలుగు వాళ్లు చిన్న కోడలు ఆడిషన్స్‌కు ర‌మ్మ‌ని పిలిచారు. కానీ ఆ టైమ్ లో క‌న్న‌డ సీరియ‌ల్స్ తో రూప ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. ఆడిష‌న్ ఇచ్చేంత స‌మయం ఆమెకు లేదు. దాంతో చిన్న కోడలు మేక‌ర్స్ స్వ‌యంగా వెళ్లి రూపను ఆడిష‌న్ చేశారు. అన్ని కుద‌ర‌డంతో ఆమెను రాధిక పాత్ర‌కు ఎంపిక చేశారు. 2009లో చిన్న కోడ‌లు ప్రారంభం అయింది.

ఈ సీరియ‌ల్ రూప‌కు తెలుగునాట భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆమె పోషించిన రాధిక పాత్ర ఓ రేంజ్ లో జ‌న్నాల్లోకి వెళ్లింది. ఆ క్యారెక్ట‌ర్ కు గానూ రూప‌ ప‌లువురు సినీ తార‌ల నుంచి కూడా అభినంద‌న‌లు అందుకుంది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల రూప చిన్న కోడ‌లు సీరియ‌ల్ మ‌ధ్య‌లోనే త‌ప్పుకుంది. ఆ త‌ర్వాత గీతాంజలి అనే సీరియ‌ల్ లో న‌టించింది. 2016లో రూప‌కు శ్రవణ్‌ సుధాకర్‌రెడ్డితో వివాహం జ‌రిగింది.

పెళ్లి త‌ర్వాత రూప చెన్నైలో సెటిల్ అయింది. ఆమె భ‌ర్త శ్రవణ్ వ్యాపార‌రంగంలో స‌త్తా చాటుతున్నాడు. ఈ దంప‌తుల‌కు ఒక పాప జ‌న్మించింది. కూతురు పుట్టిక ఆమె ఆల‌నా పాల‌నా చూసుకునేందుకు రూప ఇండ‌స్ట్రీ నుంచి ఐదేళ్లు గ్యాప్ తీసుకుంది. ఒక పాప కాస్త పెద్ద‌ది కావ‌డంతో రూప మ‌ళ్లీ బుల్లితెర‌పై రీఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఆమె జీ-తెలుగులో ప్రసారమవుతున్న ఊహలు గుసగుసలాడే సీరియల్‌లో నటిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది.

Related posts

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju