My Dream Donga OTT Release: ప్రస్తుత కాలంలో థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో మంచి సక్సెస్ అవుతున్నాయి. కరోనా తర్వాత నుంచి ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లడమే మానేశారు. కరోనా టైం లో థియేటర్స్ మూతపడడంతో వారికి వినోదాన్ని ఇచ్చింది ఓటిటినే. అలా ఓటీటీలకి బాగా ఎడిట్ అయిపోయిన ప్రేక్షకులు ప్రస్తుతం థియేటర్ కి వెళ్లేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక ఇప్పుడిప్పుడే ఆథాట్ ను మర్చిపోయి సంవత్సరానికి నాలుగు ఐదు సినిమాలు కి వెళుతున్నారు. ఏదేమైనా ఓటీటీల అంతా హడావిడి అయితే థియేటర్ల వద్ద కనిపించడం లేదు.
నిత్యం ఏదో ఒక సినిమాని ఓటీటీ ప్రేక్షకులు తమ అభిమానులకి అందిస్తూ తమ ప్లాట్ఫారంను ముందు ఉంచుతున్నారు. ఇక తాజాగా మరో కామెడీ మూవీ ఓటిటీలోకి రాబోతుంది. అభినవ్ గోమట్టం, షాలిని, దివ్య శ్రీప్రద నటించిన మై డియర్ దొంగ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ను ఆహా ఓటిటి అనౌన్స్ చేసింది. బీఎస్ సర్వజ్ఞ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ను ఆహా, క్యామ్ ఎంటర్టైన్మెంట్ లు కలిపి నిర్మించాయి. ఈ సినిమాను ఏప్రియల్ 19 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తమ ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది ఆహా. ” ఎక్కడి దొంగలు అక్కడే ఉండండి.. ఎందుకంటే అసలైన దొంగ ఏప్రిల్ 19న వచ్చేస్తున్నాడు ” అనే కొటేషన్ తో ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు.
ఇక ఈ మూవీ స్క్రిప్ట్ ను షాలిని అందించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఒక దొంగ అమ్మాయి ఇంట్లోకి దొంగతనానికి వెళ్తాడు. అక్కడ అనుకొని పరిస్థితుల వల్ల అక్కడే ఉండిపోతారు. అమ్మాయి ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చిన యువకుడు అనుకోని పరిస్థితుల్లో అక్కడే బందీగా చేరిపోతే ఏం జరుగుతుంది? దొంగకు, యుతిక్ కి మధ్య ఏర్పడిన సంబంధం ఏంటి? అసలు ఆ దొంగ చివరికి బయటికి వచ్చాడా? అనే కథాంశం చుట్టూ ఈ మూవీ రూపొందింది. ఇక ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది.
2024లో సేవ్ ది టైగర్స్ 2, మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా, కిస్మత్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుస విజయాలను అందుకున్న అభినవ్ గోమట్టం మరోసారి ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సంవత్సరం ఎవరికీ కలసి వచ్చిందో తెలియదు కానీ అభినవ్ గోమటానికి మాత్రం విపరీతంగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సినిమా తర్వాత ఒక సినిమాతో భారీ హిట్లు కొడుతున్నాడు అభినవ్ గోమట్టం. మరి రానున్న రోజుల్లో ఈయన స్టార్ హీరో అయినా పెద్దగా ఆశ్చర్యపోవ అవసరం లేదు. మరి ఈ సినిమాతో తన మాస్ హవాని మరోసారి నిరూపించుకుంటాడో లేదో చూడాలి. ఇక ఈ సినిమా కూడా అభినవ్ కి భారీ పేరు ప్రతిష్టలు తెచ్చి పెడితే రానున్న రోజుల్లో ఈయన కెరీరే వేరే లెవెల్ లో ఉంటుంది. స్టార్ హీరో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.