Top OTT Korean Movies: ప్రస్తుత కాలంలో అమ్మాయిలు అందరూ కూడా కొరియన్ డ్రామాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా కొరియన్ హీరోలని మాత్రమే పెళ్లిళ్లు చేసుకుంటామంటూ మొండి పట్టు సైతం పడుతున్నారు. నిత్యం వారిపై ఏదో ఒక స్టేటస్ పెడుతూ సంతృప్తి చెందుతున్నారు. ఇక వారు రిలీజ్ చేసే ప్రతి సినిమాని వీక్షిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన తెలుగు పాన్ ఇండియా సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే కొరియన్ సినిమాలు మాత్రం మరొక ఎత్తు. ఇప్పటికే కొరియన్ నుంచి ఎన్నో కొత్త అద్భుతమైన సినిమాలు వచ్చాయి. వీటిలో ఆస్కార్ విన్నర్ పారాసైట్ తో పాటు పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. ఇక తాజాగా విడుదలైన కొరియన్ మూవీస్ ప్రస్తుతం ఓటీటిలో తమ హవాని చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలు ప్రైమ్ వీడియో మరియు నెట్ఫ్లిక్స్ వంటి ఓటిటి ఫ్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉన్నాయి. కొరియన్ మూవీస్ లో చాలా వరకు ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న సినిమాలు గత 20 ఏళ్లలోనే వచ్చాయి. మరి ఆ సినిమాలు ఏంటో వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పారా సైట్ (ప్రైమ్ వీడియో):
2018 లో వచ్చిన ఈ మూవీ ఒక రకంగా ప్రపంచానికి కొరియన్ సినిమాల సత్తా ఏంటో పరిచయం చేసింది. ముఖ్యంగా ఇండియన్ మూవీ లవర్స్ ఈ ఆస్కార్ విన్నింగ్ మూవీ తరువాతే కొరియన్ సినిమాలను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. సమాజంలో కొరియన్ మూవీస్ కి కూడా ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ధనవంతులు మరియు పెద్దల మధ్య ఉన్న గ్యాప్ ఎలాంటిదో ఈ మూవీతో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక ఒకానొక సమయంలో ఈ మూవీ పలు అవార్డులు అందుకుంది.
2. మెమొరీస్ ఆఫ్ మర్డర్ (నెట్ఫ్లిక్స్):
మెమొరీస్ ఆఫ్ మర్డర్ ఓ క్రైమ్ మూవీ. 1980లో కొరియన్ లోని ఓ చిన్న టౌన్ లో జరిగిన వరస హత్యలు, వాటి విచారణ జరిగే తీరుపై ఈ మూవీ రూపొందింది. మెమోరీస్ ఆఫ్ మర్డర్ మూవీ ని నెట్ఫ్లిక్స్ ఓటిటి అప్పట్లో రిలీజ్ చేసి భారీ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది.
3. సేవ్ ద గ్రీన్ ప్లానెట్ ( నెట్ఫ్లిక్స్):
మన భూమిపై ఆండ్రో మెడ నుంచి వచ్చి ఏలియన్స్ ఉన్నారని.. వాళ్లు మన భూమిని నాశనం చేయడానికి వచ్చారని నమ్మే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే కామెడీ మూవీ సేవ్ ద గ్రీన్ ప్లానెట్. ఇక ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది.
4. ది గ్యాంగ్ స్టర్, ది కప్, ది డెవిల్ (ప్రైమ్ వీడియో):
ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి ఓ గ్యాంగ్ స్టార్ తో కలిసి ఓ పోలీస్ ఆఫీసర్ చేసే పోరాటమే ఈ మూవీ. ఇక అప్పట్లో ఈ మూవీని ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది.
5. బోల్డ్ బాయ్ (నెట్ఫ్లిక్స్):
2003లో వచ్చిన ఈ బోల్డ్ బాయ్ మూవీ కొరియన్ సినిమా దశ ,దిశనే మార్చేసిందని చెప్పుకోవచ్చు. ఓ వ్యాపారవేత్తను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి 15 ఏళ్ల పాటు చిత్రహింసలు పెడతారు. అనంతరం వదిలేస్తారు. అయితే అసలు తనను ఎవరు బంధించారు తెలుసుకుని.. వాళ్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు ఆ వ్యక్తి. అలా ఈ మూవీ కథాంశం రూపొందింది. ఇక ఈ మూవీ అప్పట్లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయి మంచి టాక్ ను సంపాదించుకుంది.
అలా ఈ ఐదు సినిమాలే కాకుండా ప్రస్తుతం రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా మంచి టాక్ సంపాదించుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లోకి విపరీతంగా వెళ్తున్నాయి.