NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Allu Arjun: ట్విట్టర్ లో బన్నీకి స్పెషల్ విషెస్ తెలియజేసిన తారక్.. పార్టీ లేదా పుష్ప అంటూ కామెంట్స్..!

Allu Arjun: అల్లు అర్జున్ ఈ పేరు వింటే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టైలిష్ స్టార్ గుర్తుకొస్తాడు. మల్లు అర్జున్.. ఈ పేరు వింటే కేరళలో అభిమానులు ఊగిపోతారు. అల్లు అర్జున్ అని పిలిచిన బన్నీ అని పిలిచిన పలికేది ఒక్కడే అతనే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వీడు హీరో ఏంట్రా.. అనే స్థాయి నుంచి అభిమానుల చేత వీడురా హీరో అంటే అనే స్థాయికి ఎదిగి నమ్ముకోవాల్సింది రెడీమేడ్ గా ఉన్న అభిమానులని కాదు కష్టపడి సంపాదించిన అభిమానాన్ని అని తెలుసుకుని స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. తనకంటూ ఒక స్టైల్ ని ఏర్పరచుకుని వరస విజయాలతో ఇండస్ట్రీలని షేక్ చేస్తున్నాడు. 1983 ఏప్రియల్ 8న అల్లు అరవింద్, నిర్మల దంపతులకు చెన్నైలో జన్మించాడు బన్నీ. బన్నీ పుట్టిన మూడు సంవత్సరాల వరకు పేరు పెట్టలేదు. దాంతో ఈయనని అందరూ బన్నీ అని పిలిచేవారు. అయితే నాల్గవ సంవత్సరం పద్మ శేషాద్రి స్కూల్ కి తీసుకెళ్లినప్పుడు అరవింద్ గారిని మీ అబ్బాయి పేరు ఏంటి? అని అడిగాడట అక్కడ టీచర్.

Tarak conveyed special wishes to Allu Arjun
Tarak conveyed special wishes to Allu Arjun

ఇక అప్పుడు ఇంకా పేరు పెట్టలేదని చెప్పాడంట అరవింద్. దీంతో ఆశ్చర్యపోయిన టీచర్.. అప్పటికప్పుడు బియ్యం తెప్పించి.. ఆ తో మొదలయ్యే పేరుని సెలెక్ట్ చేయడం వల్ల ఈయనకి కలిసొస్తుందని అప్పటికప్పుడే అర్జున్ అని నామకరణం చేశారు. ఆ విధంగా పుట్టిన మూడు సంవత్సరాల వరకు పేరు లేని వ్యక్తి మన బన్నీ. ఇక బన్నీకి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు మావయ్య ఆయన చిరంజీవి హీరోగా 1985లో నటించిన విజేత సినిమా షూటింగ్ కి తీసుకెళ్లాడు. ఇక ముద్దుగా.. బొద్దుగా ఉన్న అర్జున్ ని డైరెక్టర్ కోదండ రామారెడ్డి చూసి మంజులు గారి కొడుకుగా నటింప చేశారు. అనంతరం 1956 లో వచ్చిన స్వాతిముత్యం మూవీలో కూడా నటించాడు బన్నీ.

Tarak conveyed special wishes to Allu Arjun
Tarak conveyed special wishes to Allu Arjun

ఇక ఈ రెండు సినిమాల్లో కూడా బన్నీ అనుకుని నటించలేదు. అలా జరిగిపోయింది అంతే. ఒకవేళ నటించిన ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ అవుతాడని ఎవరు ఊహించలేదు. ఇక అలా పెద్దయిన అనంతరం గంగోత్రి మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం అయ్యి తన నటనతో ప్రతి ఒక్కరిని మెప్పించాడు బన్నీ. ఈ సినిమాలో లేడీ గెటప్ కూడా ధరించాడు. ఇక అనంతరం విడుదలైన అన్ని సినిమాలు కూడా ఈయనకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. ఇక బన్నీ ని పాన్ ఇండియా హీరో చేసిన సినిమా మాత్రం పుష్పనే. ప్రస్తుతం పుష్ప మూవీకి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు బన్నీ. ఇక ఇదిలా ఉంటే నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు.

Tarak conveyed special wishes to Allu Arjun
Tarak conveyed special wishes to Allu Arjun

ఈ సందర్భంగా పలువురు స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు అల్లు అర్జున్ కు స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు. ఇక అందరూ ఒకలాగా విషెస్ తెలియజేస్తుంటే తారక్ మాత్రం మరొక విధంగా విషెస్ తెలియజేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ” Wishing you a Happy Birthday Bava ” అని ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియజేసిన తారక్ కి బన్నీ రిప్లై ఇస్తూ..” thank you for your lovely wishes Bava..warm hugs ” అన్నాడు. ఇక దీనికి తారక్ మరోసారి స్పందిస్తూ..” only hugs? Party ledha Pushpa? ” అంటూ రాసుకు వచ్చాడు. ఇక దీనికి అల్లు అర్జున్ సమాధానం ఇస్తూ..” vastunna ” అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి చాట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella