NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Congress: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి

Congress: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ అభిమానులతో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళపల్లిలో ఇవేళ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ .. త్వరలో వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే తనకెంతో గౌరవమని అన్నారు. తన భావజాలానికి టీడీపీతో కలిసి ప్రయాణించలేకపోయానని అన్నారు.

వైసీపీ అధిష్టానంపైనా ఎటువంటి విమర్శలు చేయలేదు. వైసీపీ హైకమాండ్ తనకు సముచిత స్థానం ఇచ్చి పర్చూరు నుండి పోటీ చేయమని చెప్పిందన్నారు. అయితే కొద్ది రోజులు చీరాలలో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించగా, కాంగ్రెస్ పార్టీలో చేరాలని అభిమానులు సూచించారన్నారు. ఆటో గుర్తుతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలని తాను అనుకున్నాననీ, అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆటో గుర్తును రద్దు చేసిందని చెప్పారు. అందు వల్ల తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పేర్కొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన తనయుడు వెంకటేష్ వైసీపీలో చేరాక చీరాలలో విధ్వంసం సృషించారని అన్నారు. కరణం కుటుంబీకులను చీరాల నుండి ఎప్పుడు పంపాలా అని నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఊరుకో ఏజెంట్ ను నియమించుకుని ఇసుక, రేషన్ దోపిడీ చేశారని ఆరోపించారు. తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. అలానే క్యాడర్ కు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చీరాల ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తానన్న దీమాను ఆమంచి వ్యక్తం చేశారు.

BCYP: బీసీ యువజన పార్టీ ఫస్ట్ లిస్ట్ విడుదల ..పవన్ పై పిఠాపురంలో అభ్యర్ధిగా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహద్రి

 

Related posts

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju