NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టార్గెట్ నాని-వంశీ… చంద్ర‌బాబు కొత్త వ్యూహం ఇదే…!

టీడీపీకి బ‌ద్ధ శ‌త్రువులు ఎవ‌రు? అంటే ఠ‌క్కున వ‌చ్చే స‌మాధానం సీఎం జ‌గ‌న్ అనే! కానీ, చంద్ర‌బాబు కు ఈయ‌నను మించిన శ‌త్రువులు ఇద్ద‌రు ఉన్నారు. వారే.. గుడివాడ ఎమ్మెల్యే కొడ‌లి నాని, గ‌న్న‌వ‌రం ఎమ్మె ల్యే వ‌ల్ల‌బ‌నేని వంశీ. ఈ ఇద్ద‌రినీ ఓడించాల‌నేది చంద్ర‌బాబు ల‌క్ష్యం. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించ‌డం తోపాటు.. కుటుంబాన్ని సైతం రోడ్డున ప‌డేశారన్న ఆవేద‌న ఈయ‌న‌లో ఉంది. దీంతో వీరిని అడ్డుకోవ‌డం లో తొలి ప్రాధాన్య వీరిద్ద‌రినీ ఓడించ‌డ‌మే.

ఈ క్ర‌మంలో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ చంద్ర‌బాబు ఆచి తూచి అడుగులు వేశారు. గ‌న్న‌వ‌రంలో వైసీపీ నాయ‌కుడు, ప్ర‌స్తుత టీడీపీ అభ్య‌ర్థి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావును పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చారు. ఇక్క‌డితో చంద్ర‌బాబు ప‌ని అయిపోలేదు. ఇక్క‌డే అస‌లు స్టోరీ ఆయ‌న ప్రారంభించారు. టీడీపీలో ఉన్న అంద‌రినీ స‌మ‌న్వ‌యం చేస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ క‌ద‌లి వెళ్లి యార్ల‌గ‌డ్డ‌కు మ‌ద్ద‌తు ప‌లికేలా.. నిరంత‌రం వారికి ఫోన్లు చేస్తున్నారు.

ప్ర‌తి రోజూ చంద్ర‌బాబు గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కుల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. యార్ల‌గ‌డ్డ‌కు దిశా నిర్దేశం చేస్తూనే నేత‌ల‌ను ముందుండి న‌డిపిస్తున్నారు. ఇక‌, నారా భువ‌నేశ్వ‌రి.. శుక్ర‌వారం నుంచి నాలుగు రోజుల పాటు గ‌న్న‌వ‌రంలో ప‌ర్య‌టించి ప్ర‌చారం చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. దీనికి త‌గిన ప్ర‌ణాళిక‌ల‌ను కూడా పార్టీ సిద్ధం చేసింది. దీంతో గ‌న్న‌వ‌రంలో టీడీపీ సానుభూతి ప‌రులు మొత్తం ఏకం అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక్క‌డ యార్ల‌గ‌డ్డ గెలుపు కంటే.. వంశీ ఓట‌మికే చంద్ర‌బాబు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తున్నారు.

మ‌రోవైపు గుడివాడ‌లో మ‌రింత ఊపు తెస్తున్నారు. టికెట్ ను ఎన్నారై నాయ‌కుడు వెనిగండ్ల‌ రాముకు ఇచ్చారు. దీంతో అసంతృప్తికి గురైన రావి వెంక‌టేశ్వ‌ర‌రావును చంద్ర‌బాబు స్వ‌యంగా బుజ్జ‌గించారు. ఎమ్మెల్సీ ఇస్తామ‌ని చెప్పారు. అంతేకాదు.. ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను కూడా తానే ప‌రిష్క‌రిస్తాన‌న్నారు. ఇక‌, అక్క‌డితోనూ చంద్రబాబు వ‌దిలేయ‌లేదు. పార్టీ ప‌గ్గాలు దాదాపు రావికే అప్ప‌గించారు. నిరంతరం ఆయ‌న‌కు ట‌చ్‌లో ఉన్నారు. త‌న‌తోపాటు భువ‌నేశ్వ‌రి కూడా.. ఇక్క‌డ ప్ర‌చారం చేసేందుకు ఉమ్మ‌డి ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారు. దీంతో రెండు `జీ`ల‌పై చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Related posts

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N