Aha OTT New Web Series: ప్రస్తుత కాలంలో ఆహా ఓటిటి అనేక కొత్త కొత్త సిరీస్ ను ప్రేక్షకులకు అందిస్తుంది. ఈ తరుణంలోనే గతంలో ఓసారి ఆహాలో ప్రసారమయ్యే మంచి ప్రేక్షక ఆదరణ దక్కించుకున్న ” అర్థమైందా అరుణ్ కుమార్ ” రెండవ సీజన్ తీసుకురానుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆహా ఓటీటీ నే వెల్లడించింది. త్వరలోనే ఈ సిరీస్ రాబోతుందని సదరు ఓటిటి తెలిపింది. తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో కొత్త సీజన్ ను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఓ కార్బోరేట్ ఉద్యోగి కష్టాల చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ నే ఈ సిరీస్. అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 అనౌన్స్మెంట్ ను ఆహా ఓటిటి మంగళవారం అనగా ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది సందర్భంగా వెల్లడించింది.
” ఆఫీస్ కు వెళ్లే ప్రతి ఒక్కరు ఈ సిరీస్ ఇష్టపడతారు. సీజన్ 2 లోడింగ్ ” అనే క్యాప్షన్ తో ఆహా ఈ మూవీ యొక్క రెండవ సీజన్ ను అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ ను మోస్ట్ లౌడ్ ఆఫీస్ డ్రామాగా ఈ ఓటిటి అభివర్ణించింది. ఎట్లిచ్చినం అనే హ్యాస్ టాగ్ తో ఆహా తమ కొత్త సినిమాలు మరియు సిరీస్ లను అనౌన్స్ చేస్తుంది. గత ఏడాది జూన్ 30న అర్థమైందా అరుణ్ కుమార్ తొలి సీజన్ ఆహా లోకి వచ్చింది. ఈ సిరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. ఓ చిన్న టౌన్ కుర్రాడు పెద్ద కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేయాలని కలలు కానీ.. దాని ద్వారానే ఇబ్బంది పడటం తొలి సీజన్లో చూడొచ్చు.
హిందీలో ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్న అఫీషియల్ చౌక్యాగిరి అనే వెబ్ సిరీస్ ఆధారంగా అర్థమైందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ ను రూపొందించారు దర్శకుడు జోనాథన్ ఎడ్వర్డ్స్. కార్పొరేట్ వరల్డ్ లో ఓ సామాన్య యువకుడికి ఎదురైనా సమస్యలు, వ్యక్తి నిర్వహణలో అతడు ఎదుర్కొన్న ఘటనలను ఎంటర్టైనర్గా ఈ సిరీస్ లో చూపించారు. ఈ సింపుల్ పాయింట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో చిన్న సందేశాన్ని జోడించి సీజన్ వన్ ను ఎండ్ చేశారు. అర్థమైందా అరుణ్ కుమార్ గా హర్షిత్ రెడ్డి తన డైలాగ్ డెలివరీ మరియు బాడీ లాంగ్వేజ్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు.
ఇక పల్లవి పాతడో అనన్య శర్మ సింపుల్ క్యారెక్టర్ లో ఒదిగిపోయింది. ఇక ఇంకాస్త ఎమోషనల్ గా ఈమె క్యారెక్టర్ ను రాసి ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరూ భావించారు. శాలిని డామినేషన్ మరియు స్వార్థం కలబోసిన పాత్రలో తేజస్వి మదివాడ కనిపించింది. మిగిలిన వారిలో వాసు ఎక్కువగా హైలెట్ అయ్యాడు. హిందీ, తెలుగు మిక్స్ చేస్తూ చెప్పే అతడి డైలాగ్స్ కొన్ని చోట్ల నవ్విస్తాయి. ఉగాది రోజు ఆహా ఓటిటి తమ ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్న కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను అనౌన్స్ చేసింది. వాటిలో భాగంగానే ఈ వెబ్ సిరీస్ ని కూడా అనౌన్స్ చేసింది ఆహా.