Unstoppable Season 4: నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆతరం ప్రేక్షకులనే కాకుండా ఈతారం ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంటూ ప్రస్తుతం స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు బాలయ్య. ఇటీవలే భగవంత్ కేసరి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య భారీ విజయాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో సక్సెస్ లను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఎలక్షన్స్ హడావిడిలో పడ్డాడు బాలయ్య. ఇక బాలయ్య ఇప్పటికే ఒక రాజకీయాల్లో మరోపక్క సినిమాల్లో కనిపిస్తూ తన సత్తా చాటుతున్నాడు.
ఇక బాలయ్య లో ఉన్న మరో టాలెంట్ ని కూడా బయటకు తీసింది. అదే యాంకరింగ్. అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి బాలయ్య హోస్ట్ అనగానే .. వీడేం యాంకరింగ్ చేస్తాడు. అసలు వీడికి యాంకరింగ్ వచ్చా.. అనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఎప్పుడైతే వన్స్ ఈ మూవీ యొక్క ఫస్ట్ ఎపిసోడ్ లాస్ట్ అయిందో అప్పటినుంచి వారందరూ నోటిపై వేలు వేసుకున్నారు. తన యాంకరింగ్ ని కించపరిచిన వారికి తన యాంకరింగ్ తోనే సమాధానమిచ్చాడు బాలయ్య. ప్రస్తుతం బాలయ్య అనుష్టాపబుల్ మూడు సీజన్లోకి యాంకర్ గా వ్యవహరించి తన సత్తా చాటుకున్నాడు.
ఇటీవలే దాదాపు మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ టాక్ షో కి సంబంధించిన మరో సీజన్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఆహా. ” ఇండియా కి సంబంధించిన బిగ్గెస్ట్ టాక్ షో మళ్లీ వస్తుంది. అయితే ఈసారి ఒకటి ట్విస్ట్ తో మీ ముందుకు వస్తుంది ” అంటూ ఈ టాక్ షో స్ట్రీమింగ్ చేసిన ఆహా సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే అట్విస్ట్ ఏంటి? ఎప్పటినుంచి ఈ షో స్ట్రీమింగ్ అవ్వబోతుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతానికి నందమూరి బాలయ్య బాబి దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి వీరమాస్ అనే టైటిల్ పెట్టినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ని.. బాబి ఒక అవుట్ అండ్ డౌట్ మాస్ లుక్ లో చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతున్న బాలయ్య ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 4 తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడని తెలిసి తన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న అనగా ఉగాది సందర్భంగా వరస పెట్టి తమ ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ అవబోయే ప్రతి సినిమా మరియు వెబ్ సిరీస్ ని ప్రకటించింది ఆహా.