NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

Sri Ramadasu: తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. శ్రీ మహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముడు జన్మదినమే రామ నవమిగా జరుపుకుంటారు. నేడు శ్రీరామనవమి కావడంతో దేశవ్యాప్తంగా సీతారాముల కల్యాణాన్ని ఘ‌నంగా జరిపిస్తున్నారు. ప్ర‌జ‌లు భక్తిశ్రద్ధలతో రాముని పూజిస్తున్నారు. ఇకపోతే శ్రీరామనవమికి బుల్లితెరపై సందడి చేసే చిత్రాల్లో శ్రీరామదాసు ముందు వ‌రుస‌లో ఉంటుంది. 2006 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి ఏడాది రామనవమి నాడు ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఎన్ని సార్లు చూసినా మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించే భ‌క్తిర‌స మ‌హాకావ్యం శ్రీ‌రామ‌దాసు. అయితే రామ న‌వ‌మి సంద‌ర్భంగా శ్రీ‌రామ‌దాసు మూవీ గురించి కొన్ని టాప్ సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

సంగీత విద్వాంసుడు, శ్రీ‌రాముడి ప‌ర‌మ భ‌క్తుడు కంచర్ల గోపన్న జీవితం ఆధారంగా శ్రీ‌రామ‌దాసు చిత్రాన్ని తెర‌కెక్కించారు. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్రరావు రచన మరియు దర్శకత్వం వహించారు. కంచ‌ర్ల గోప‌న్నగా టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టిస్తే.. అత‌ని భార్య కమల పాత్ర‌ను స్నేహ పోషించింది. అలాగే అక్కినేని నాగేశ్వర రావు, నాజర్, సుమ‌న్‌, అర్చ‌న‌, శ్రీ‌కాంత్, సుజాత‌, నాగ‌బాబు, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, బ్ర‌హ్మానందం త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. ఇటీవ‌ల హ‌నుమాన్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిన తేజ స‌జ్జా శ్రీ‌రామదాసులో నాగార్జున కొడుకుగా అల‌రించాడు.

ఆదిత్య ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై పంతం నానాజీ, కొండా కృష్ణంరాజు క‌లిసి నిర్మించిన శ్రీ‌రామ‌దాసు సినిమాకు ఎమ్.ఎమ్.కీరవాణి స్వ‌రాలు అందించాడు. భారీ అంచ‌నాల న‌డుమ 2006 మార్చి 30 విడుద‌లైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. రామ‌దాసు పాత్ర‌లో నాగార్జున న‌ట‌న ఒక అద్భుతం. కీరవాణి అందించిన సంగీతం సినిమాకు మ‌రో హైలెట్ గా నిలిచింది. రామ‌దాసు క‌థ అందరికీ తెలిసిందే అయినా కూడా ద‌ర్శ‌కేంద్రుడు త‌న మాయాజాలంతో సినిమాను అంద‌రూ మెచ్చేలా తీయ‌డంతో సూప‌ర్ స‌క్సెస్ అయ్యారు.

శ్రీ‌రామ‌దాసు సాంగ్స్ కూడా ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌తి సాంగ్ కు ప్రేక్ష‌కుల నుంచి విశేష‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాలో రామదాసు కీర్తనలను కొన్ని వాడుకోగా.. కొన్ని పాటలు రాయించారు. అలాగే మూల కథలో కనబడిన గోపన్న ప్రేమ వ్యవహారాన్ని రాఘవేంద్రరావు శ్రీరామదాసులో చేర్చారు. ఆంధ్ర ప్రదేశ్‌లో 173, కర్ణాటకలో 18 , చెన్నైలో రెండు, ముంబయిలో ఒకటి , ఓవర్సీస్‌లో 25 సహా 229 స్క్రీన్‌లలో విడుదలైన శ్రీ‌రామ‌దాసు అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. 67 సెంటర్లలో 100 రోజుల ఆడి రికార్డు సెట్ అయింది.

ఫుల్ ర‌న్ లో ఈ సినిమా రూ. 30 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. 2006లో శ్రీ‌రామ‌దాసు విడుద‌లైన రోజే శ్రీ‌రామ‌న‌వ‌మి కావ‌డం మ‌రొక విశేషంగా చెప్పుకోవ‌చ్చు. అలాగే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. శ్రీ‌రామ‌దాసులో నాగార్జున భార్య క‌మ‌ల క్యారెక్ట‌ర్ కు ఫ‌స్ట్ ఛాయిస్ స్నేహ కాదు. రాఘవేంద్రరావు మొదట జ్యోతిక‌ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే స‌రిగ్గా షూటింగ్ స్టార్ట్ అయ్యే స‌మ‌యానికి జ్యోతిక, సూర్య‌ల వివాహం నిశ్చ‌య‌మైంది. పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల జ్యోతిక శ్రీ‌రామదాసు నుంచి త‌ప్పుకుంది. దాంతో జ్యోతిక స్నానంలో స్నేహ‌ను తీసుకున్నారు. ఇక బ్లాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న శ్రీ‌రామ‌దాసుకు నాలుగు నంది అవార్డులు వ‌రించారు. ఉత్త‌మ న‌టుడిగా నాగార్జున, ఉత్తమ హోమ్-వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్ గా కొండ కృష్ణం రాజు, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా రామచంద్రరావు మ‌రియు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా బాషా నంది అవార్డు అందుకున్నారు.

Related posts

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju