NewsOrbit
జాతీయం న్యూస్

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

Ayodhya: అయోధ్య లోని రామమందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బుధవారం తొలి శ్రీరామ నవమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అందరి దృష్టి శ్రీరాముడి నుదిటిపై పడే సూర్యుడి కిరణాలపై ఉంది. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. గుడి మూడవ అంతస్తు నుండి గర్భగుడిలోని సూర్య తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు.

ప్రతి ఏడాది శ్రీరామ నవమి రోజున బలరాముడి విగ్రహం నుదుట కిరణాలతో తిలకం ఏర్పాటు చేయడమే సూర్య తిలక్ ముఖ్య ఉద్దేశం. చైత్రమాసంలో సాక్షాత్కరించే ఈ అద్భుత దృశ్యాన్ని మధ్యాహ్నం 12.15 నిమిషాలకు భక్తులు వీక్షించారు. మూడున్నర నిమిషాల పాటు ఈ సూర్య కిరణాల తిలకాన్ని భక్తులు వీక్షించి తరించారు. రెండు నిమిషాల పాటు పూర్తి స్థాయిలో తిలకంగా కనిపించి. బలరాముడి నుదుటిని సూర్యుడు ముద్దాడాడు అని పేర్కొంటున్నారు. సూర్య అభిషేకం, సూర్య తిలకంగా పిలుస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు వీక్షించారు.

ఈ ఏడాది జనవరి 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. మంగళవారమే సూర్య కిరణాల ప్రసరణ ప్రక్రియను శాస్త్రవేత్తలు పరిశీలించారు. సూర్య తిలకం కోసం మూడో అంతస్తులో విదేశాల నుండి తెప్పించిన అద్దాలను అమర్చారు. సూర్య కిరణాలు అందులో పడి రెండో అంతస్తులోకి, ఆపై గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నగర్భగుడి లోని బాలక్ రామ్ విగ్రహం నుదుటిపై పడతాయి. సూర్యుడి డైరెక్షన్, కిరణాలు ప్రసరించే కోణాన్ని లెక్కగట్టి ఈ అద్దాలను అమర్చారు. ఏడా రామ నవమి రోజు మాత్రమే ఈ అద్భుతం సాక్షత్కరించేలా డిజైన్ చేశారు. రాముడి నుదిటిపై సూర్యకిరణాలు పడిన మరుక్షణం భక్తులు తన్మయత్వం చెందారు.

మందిర నిర్మాణం తర్వాత తొలి శ్రీరామ నవమి కావడంతో మందిర పరిసరాలను అందంగా అలంకరించారు. అశేషంగా తరలివచ్చిన భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి దృష్ట్యా ఆలయంలో భక్తులకు చలువ పందిళ్లు వేశారు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju