NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. 1991లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వమిత్ర సినిమా ద్వారా తొలిసారి వెండితెరపై మెరిశాడు. 2001 లో వచ్చిన నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారాడు. ఫ్యామిలీ నుంచి సరైన సపోర్ట్ లేకపోయినా తన ప్రతిభను నమ్ముకున్నాడు. గొప్ప నటుడిగా, అద్భుతమైన డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. 20 ఏళ్లకే భారీ స్టార్డమ్ ను సంపాదించుకున్నాడు. తాతకు తగ్గ మనవడినని నిరూపించుకున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా సత్తా చాటడమే కాకుండా.. దేశ విదేశాల్లో సైతం ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు.

అటువంటి ఎన్టీఆర్ కు పాతికేళ్లుగా ఒక కల మాత్రం కలగానే మిగిలిపోయింది. హీరోగా కెరీర్ ప్రారంభమై ఇన్నేళ్లు అవుతున్నా ఎన్టీఆర్ ఇప్పటివరకు ఒక్క ఇండస్ట్రీ హిట్టు కూడా కొట్టలేకపోయాడు. ఎన్టీఆర్ తర్వాత వచ్చిన రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలు ఇప్పటికే ఇండస్ట్రీ హిట్స్ త‌మ ఖాతాలో వేసుకున్నారు. కానీ ఎన్టీఆర్ కు మాత్రం అటువంటి ఛాన్స్ రాలేదు. స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి, రాఖి, యమదొంగ, అదుర్స్, బృందావనం, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత వీర రాఘవ ఈ సినిమాలన్నీ ఎన్టీఆర్ కెరీర్ లో భారీ విజయాన్ని అందుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు తిరగ‌రాశాయి. కానీ ఇండస్ట్రీ హిట్ మాత్రం అవ్వ‌లేదు.

2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కానీ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటించాడు. ఈ సినిమా విజయంలో ఎన్టీఆర్ పాత్ర ఎంత ఉందో రామ్ చరణ్ పాత్ర కూడా అంతే ఉంది. అందువ‌ల్ల ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ అయినా కూడా ఎన్టీఆర్ లెక్కలోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే సోలోగా ఇండస్ట్రీ హిట్ కొట్టాలని ఎన్టీఆర్ ఎప్పటి నుంచి క‌ల కంటున్నాడు. ఆ కల‌ తన రాబోయే చిత్రం దేవరతో తీరుతుందని ఆశ‌ప‌డుతున్నాడు.

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ డ్రామానే దేవ‌ర‌. ఇందులో ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ జంట‌గా న‌టిస్తున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంతో ప్ర‌తినాయ‌కుడిగా చేస్తున్నాడు. రమ్యకృష్ణ, చైత్ర రాయ్, షైన్ టామ్ చాకో, శృతి మరాఠే, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ త‌దిత‌రులు ఈ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తుండ‌గా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవ‌ర సినిమా రెండు భాగాలుగా రాబోతోంది.

దేవ‌ర ఫ‌స్ట్ పార్ట్ 2024 ఆక్టోబ‌ర్ 10న తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. దేవ‌రతో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టాలంటే ఎన్టీఆర్ బాక్సాఫీస్ టార్గెట్ దాదాపుగా రూ. 2 వేల కోట్లు. ఈ టార్గెట్ ను అందుకుని ఎన్టీఆర్ త‌న క‌ల‌ను నెర‌వేర్చుకుంటాడా.. లేదా.. అన్న‌ది చూడాల్సి ఉంది.

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu