NewsOrbit
రాజ‌కీయాలు

వైసిపి గూటికి మాజీ మంత్రి ‘ఆది’ సోదరులు!?  

అమరావతి: కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ సోదరులు వైసిపిలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు అయిందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిమాణాలతో జమ్మలమడుగు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. జమ్మలమడుగులో ఆది కుటుంబం తొలి నుండి వైఎస్ కుటుంబానికి విధేయతగానే ఉంటూ వచ్చింది. 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి 2014 ఎన్నికల్లో వైసిపి నుండి గెలిచి హాట్రిక్ సాధించారు. అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదినారాయణరెడ్డిని టిడిపిలో చేర్చుకొని మంత్రివర్గంలో స్థానం కల్పించారు. టిడిపిలో మంత్రిగా ఉన్నంత కాలం ఆదినారాయణరెడ్డి నాటి ప్రతిపక్ష నేత,నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి ఘోర పరాజయం పాలవ్వడంతో ఆదినారాయణరెడ్డి కొంత కాలం టిడిపికి దూరంగా ఉండి ఇటీవలే బిజెపిలో చేరారు.

అయితే ఆయన సోదరులు ఎమ్మెల్సీ శివనాధరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలు వారి వర్గీయులతో తిరిగి జగన్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కడప స్టీల్ ప్లాంట్ మంజూరుతో పాటు పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం రిజర్వేషన్ కల్పించాలని జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాలను ఆది సోదరులు ప్రశంసించారు. ఈ నెల 23న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు విచ్చేస్తున్న సిఎం జగన్ సమక్షంలో వీరు వైసిపిలో చేరేందుకు మూహూర్తం ఫిక్స్ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో వారి చిరకాల ప్రత్యర్థి, టిడిపి నేత రామసుబ్బారెడ్డి సైతం వైసిపితో సంబంధాలు పెట్టుకుంటున్నారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో వీరు ముందడుగు వేసినట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది.

Related posts

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

Leave a Comment