NewsOrbit
5th ఎస్టేట్ న్యూస్ బిగ్ స్టోరీ

జగన్ పనితీరు : సర్వేలో ఏం తేలిందంటే …!

151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన జగన్ పని తీరు ఎలా ఉంది…? ముప్పయ్యేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానన్న జగన్ పాలనలో తొలిఏడాది పనితీరుపై రాష్ట్ర ప్రజల స్పందన ఎలా ఉంది…? అటు కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ పనితీరు దేశంలో ఎలా ఉంది..? మోడీకి ఎన్ని మార్కులు పడ్డాయి? జగన్ కి ఎన్ని మార్కులు పడ్డాయి…??? అటువంటి ప్రశ్నలన్నిటికీ నివృత్తి చేసేందుకు “సి ఓటర్” సంస్థ ఓ సర్వే చేసింది. జగన్, మోడీ పనితీరు ఎలా ఉందొ వివరంగా చూడాల్సిందే.

జగన్ కి నాలుగో స్థానం

దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరులో మన సీఎం జగన్ కి నాలుగో స్థానం దక్కింది. 82 . 96 రేటింగ్ తో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో నిలవగా.., 81 శాతం ఓటింగ్ తో ఛత్తీస్ ఘర్ సీఎం భూపేష్ భాగేల్ రెండో స్థానంలో నిలిచారు. కేరళ ముఖ్యమంత్రి    పినరయి విజయన్ 3 వ స్థానంలో… ఏపీ సీఎం జగన్ 78 శాతం రేటింగ్ తో నాలుగో స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ల ముఖ్యమంత్రులు నిలిచారు. హర్యానా సీఎం దేశంలో అత్యంత చెత్త పాలనా రికార్డుని సొంతం చేసుకున్నారు. ఆయనకు కేవలం 4 శాతం రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. ఇక పక్కనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎనిమిదో స్థానం దక్కింది. ఆయన పనితీరుపై 54 . 22 శాతం రేటింగ్స్ మాత్రమే వచ్చాయి.

మోడీకి మంచి మార్కులే…!

ఇక దేశం మొత్తం మీద ప్రధాని మోడీ పనితీరుని చూసుకుంటే… 58 . 36 శాతం ఆయనకు మద్దతు పలికారు. 16 . 71 శాతం మంది మోడీ పాల ఏమాత్రం బాలేదన్నారు. మిగిలిన వారు పర్లేదు అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రాల వారీగా మోడీ పాలనపై వచ్చిన స్పందన చూసుకుంటే ఒడిశాలో 95 శాతం మంది, హిమాచల్ ప్రదేశ్ లో 94 శాతం మంది, ఛత్తీస్ ఘర్ లో 92 . 73 శాతం, ఏపీలో 83 శాతం … తెలంగాణాలో 71 శాతం బాగుందని కితాబిచ్చారు. తమిళ్ నాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రం మోడీ పనితీరుపై అత్యధికంగా అసంతృప్తి వ్యక్తమయింది. మోడీ, రాహుల్ గాంధీ లో ఎవరు ఉత్తమం అని అడిగిన ప్రశ్నకూ మోడీకి 66 శాతం మార్కులు పడ్డాయి.

సర్వే జరిగింది ఇలా…!

సి ఓటర్ సర్వే అనేది దేశవ్యాప్తంగా ఓటర్ల నాడిని పెట్టె ఉత్తమ సంస్థల్లో ఒకటి. రాష్ట్రంలో 3 వేల మంది నమూనాలు తీసుకుని సర్వే నిర్వహించారు. ఏపీలోని 25 నియోజకవర్గాల్లోని మూడు వేల మందితో మాట్లాడి ఈ సర్వే చేసారు. దేశం మొత్తం మీద లక్ష మందితో మాట్లాడి మోడీ పనితీరుపై నివేదిక రూపొందించారు. ఈ సర్వే ఫలితాలను నిన్న విడుదల చేయగా జాతీయ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju