NewsOrbit
న్యూస్

500 < 380… ఆ నిబద్ధతపై లోకేశ్ కు ప్రశంసలు… ప్రశ్నల వర్షాలు!

అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడిని పరామర్శించడానికి.. అక్రమాల కేసులో అరెస్టయ్యి కడప జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ని పరామరించడానికి జైల్ అధికారులు ససేమిరా అన్నారు. కరోనా సమయంలో పరామర్శలు, మిలాఖత్ లు ఉండవని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో జేసీ ఫ్యామిలీని అయినా పరామర్శించాలని పట్టుబట్టిన లోకేష్… తాడిపత్రికి బయలుదేరారు!

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని దుయ్యబట్టారు. అన్నింటికీ వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరిచారు. ఆ వడ్డీ ఏమిటనేది ప్రస్తుతానికి అప్రస్తుతం! ఆ సంగతులు అలా ఉంటే…ఈ విషయంపై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి… హైదరాబాద్ నుంచి తాడిపత్రికి సుమారు 500 కి.మీ. దూరం వచ్చి తమకు మద్దతివ్వడం నాయకుల పట్ల లోకేశ్ నిబద్ధతకు నిదర్శనమన్నారు. సరిగ్గా అక్కడే లోకేష్ ను బుక్ చేసేశారు!

జేసీ దివాకర్ రెడ్డి అలా అన్నారో లేదో… ఆన్ లైన్ లో ప్రశ్నల వర్షాలు కురిసిపోయాయి. ఆ నిబద్ధత ప్రజలపట్ల ఎందుకు లేదని కౌంటర్లు మొదలైపోయాయి. గొప్ప గొప్ప నాయకుల పట్ల లోకేశ్ కి ఉన్న నిబద్ధత మంచిదే కానీ… అదే సమయంలో కాస్తో కూస్తో నిబద్ధత చిన్న చిన్న సామాన్య ప్రజానికంగా కూడా ఉండాలికదా అంటున్నారు ఏపీ వాసులు! కరోనా సమయంలో రాష్ట్ర ప్రజలను కన్నెత్తి కూడా చూడలేదు… విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులను కనీసం పలకరించలేదు. మరి ప్రజలపై ఆ నిబద్ధత ఏది?

హైదరాబాద్ నుంచి అక్రమాల కేసులో అరెస్టయిన జేసీ ఫ్యామిలీని పరామర్శించడానికి 500 కి.మీ. వెళ్లగలిగిన చినబాబు… మహానాడు మీటింగ్ కోసం హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి మహనాడు చేసుకున్న చినబాబు… విశాఖలో అంతమంది చనిపోతే… హైదరాబద్ నుంచి విశాఖకు సుమారుగా 620 కి.మీ…. అక్కడి నుంచి కూడా రాలేకపోయారు. పోనీ మహానాడు సమయంలో అమరావతి వరకూ వచ్చారు కదా… అమరావతి నుంచి విశాఖకు సుమారుగా 380 కి.మీ… రాలేకపోయారు!

ఇక్కడ సమస్య దూరానిది కాదు.. నిబద్ధతది! దీంతో… తమ పార్టీ నాయకులు, తమ పార్టీ కార్యకలాపాలపై ఉన్న నిబద్ధత ప్రజలపట్ల ఎందుకు లేదని విశాఖ వాసులు నిలదీస్తున్నారు! 2019 ఎన్నికల్లో అంత తీవ్రంగా వీచిన ఫ్యాన్ గాలిలో కూడా సైకిల్ పడిపోకుండా చూసిన విశాఖ వాసులపై బాబులకున్న నిబద్ధత, కృతజ్ఞత ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు.

దానికి సమాధానంగా కరోనా కదా అని టీడీపీ నాయకులు చెబుతున్నా… వీవీఐపీలకు.. మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి స్థాయి వ్యక్తులకు కరోనా సమయంలో ప్రయాణాలు చేయడం పెద్ద విషయం కాదు! ఆరోగ్యం విషయంలో అతి శ్రద్ధ ఉంటేనో, ప్రాణాల మీద అతి తీపి ఉంటేనో, ప్రజల పట్ల నిర్లక్ష్యం ఉంటేనో తప్ప… రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీల అనుమతితో తిరగొచ్చు… హైదారబాద్ నుంచి కమ్యునిస్టులు కూడా విశాఖకు వచ్చారు కదా! అని సమాధానం చెబుతున్నారట విశాఖ వాసులు!

ఏదీ ఏమైనా… తమ పార్టీ నాయకులపై లోకేశ్ కున్న నిబద్ధతపై మిగిలిన నాయకుల నుంచి ప్రశంసల జల్లులు.. ప్రజల నుంచి ప్రశ్నల వర్షాలు ఈ విధంగా కురుస్తున్నాయి!!

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju