NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వంగ‌వీటి రాధా గెలుపు ఖాయ‌మేనా… స‌ర్వేలో ఏం తేలింది..!

చాలా ఏళ్ల త‌ర్వాత‌.. వంగ‌వీటి రాధాకు టికెట్ దక్కే అవ‌కాశం క‌నిపిస్తోంది. కాపులు అత్య‌ధికంగా ఉన్న అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ ర్గంలో ఆయ‌న‌ను బ‌రిలో నిల‌ప‌డం దాదాపు ఖాయ‌మైంది. ఈ సీటును టీడీపీ అనేక కోణాల్లో ప‌రిశీలించిన త‌ర్వాత‌.. మ‌ధ్యే మార్గంగా జ‌న‌సేన‌కు ఇచ్చేసింది. టీడీపీ నుంచి ఎవ‌రు బ‌రిలో దిగినా.. సొంత నేత‌ల నుంచే వ్య‌తిరేక‌త వ‌స్తున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు చాలా ప‌క్కాగా లెక్క‌లు వేసుకుని.. గెలిచే స్థానాన్ని పోగొట్టుకోవ‌డం ఇష్టం లేక‌.. జ‌న‌సేన‌కు ఇచ్చేశార‌ని అంటున్నా రు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు జ‌న‌సేన ఖాతాలో ప‌డింది.

ఇక‌, జ‌న‌సేన త‌ర‌ఫున ఇక్క‌డ పోటీకి ఇద్దరు అభ్య‌ర్థులు ఇప్ప‌టికే ఉన్నారు. వీరిలో విక్కుర్తి వెంక‌ట శ్రీనివాస్‌, మ‌రొక‌రు మ‌దివాడ వెంక‌ట కృష్ణ‌. వీరిద్ద‌రూ జ‌న‌సేన‌లో బాగానే ప‌నిచేస్తున్నారు. అధినేత ప‌ట్ల ఆప్యాయ‌త కూడా కురిపిస్తున్నారు. దీంతో వీరిలో ఒక‌రికి ఇవ్వాల‌ని ముందు అనుకున్నారు. ఇందులోనూ విక్కుర్తి వైపు ప‌వ‌న్ మొగ్గు చూపించారు. అయితే.. ఇంత‌లోనే మ‌చిలీప‌ట్నం ఎంపీ అభ్య‌ర్థి వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి మెరుపులాంటిఆలోచ‌న చేశారు. అవ‌నిగ‌డ్డ‌ను వైసీపీ కీల‌కంగా తీసుకున్న నేప‌థ్యంలో.. త‌న పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న ఈ సీటును వైసీపీకి ద‌క్క‌కుండా చేసే వ్యూహం వేశారు.

దీనిలో భాగంగానే.. వంగ‌వీటి రాధాను ఇక్క‌డ నుంచి రంగంలోకి దింపాల‌ని ఆయ‌నే స్వ‌యంగా ప‌వ‌న్‌కు ప్ర‌తిపాదించారు. మొద‌ట్లో దీనిపై ప‌వ‌న్ కొంత త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డినా.. త‌ర్వాత మాత్రం రాధావైపు మొగ్గు చూపారు. ఈ క్ర‌మంలో పార్టీ నాయ‌కుల‌తో క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న చేయించారు. ఈ ప‌రిశీల‌న‌లో రాధాకు మంచి మార్కులు ప‌డిన‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే రెండు ర‌కాలుగా నివేదిక‌లు జ‌న‌సేన‌కు చేరాయ‌ని అంటున్నారు. ఒక‌టి జ‌నంలో రాధా అభిమానులు ఎంత మంది ఉన్నారు? జ‌న‌సేన‌కు ఇక్క‌డ ఉన్న పాజిటివిటీ ఏంట‌నే విష‌యాల‌పై స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేయించారు.

ఈ క్ర‌మంలో వంగ‌వీటి అనుచ‌రులు.. పాత‌కాపులు ఇక్క‌డ రాధావైపు మొగ్గు చూపుతున్న‌ట్టు స‌మాచారం. అదేవిధంగా మెగా అభిమానులు.. బాల‌శౌరి పాజిటివిటీ వంటివి కూడా నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్క‌వుట్ అవుతున్నాయ‌ని లెక్క‌లు వేసుకున్నారు. అయితే.. విక్కుర్తికి టికెట్ ఇస్తాన‌ని గ‌తంలో ప‌వ‌న్ హామీ ఇచ్చిన నేప‌థ్యంలో ఆయ‌న విష‌యాన్ని కూడా ఈ స‌ర్వేల్లోనే తేల్చారు. అయితే.. విక్కుర్తి కంటే కూడా.. రాధా అయితే.. బ‌ల‌మైన నాయ‌కుడు అవుతార‌ని లెక్క‌లు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. దీంతో తాజాగా రాధాకు సీటును క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు అన‌ధికారికంగా చెబుతున్నాయి. దీనిపై ఒక‌టి రెండు రోజుల్లోనే క్లారిటీ రానుంద‌ని.. త‌ర్వాత‌.. రాధా పార్టీలోకి చేర‌డం టికెట్ తీసుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!