NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: వాళ్ల గేమ్ చెడగొడుతున్నాడు అంటూ శివాజీ పై మండిపడ్డ మానస్..!!

Share

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా రసవతారంగా సాగుతోంది. తొమ్మిదో వారం చివరికి వచ్చేయడం జరిగింది. దీంతో సగం కంటే ఎక్కువ గేమ్ కంప్లీట్ కావడంతో హౌస్ లో పోటీ వాతావరణం ఉన్నకొద్ది పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో చోటుచేసుకుంటున్న సంఘటనలపై.. సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ మానస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కంటెస్టెంట్ శివాజీ ఆడుతున్న ఆట తీరుపై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రతి సీజన్ లో శివాజీ లాంటి విలన్ లు ఉంటారని అన్నారు. కానీ హీరో ఎవరనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారని మానస్ చెప్పకోచ్చారు.

Maanas got angry on bigg boss contestant Shivaji saying that he is spoiling others game

శివాజీ కేవలం ఇద్దరి పట్ల మాత్రమే వ్యక్తిగత ఇష్టం చూపిస్తున్నాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో మిగతా వాళ్ళ ఆట తీరు చెడగొడుతున్నారని.. మానస్ విమర్శించాడు. తాను ఇప్పటివరకు రకరకాల మైండ్ సెట్ ఉన్నవాళ్లను చూడటం జరిగిందని.. శివాజీ లాంటి కంటెస్టెంట్ ను ఇప్పటివరకు చూడలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో మానస్ వ్యాఖ్యలపై.. సోషల్ మీడియాలో నేటిజెన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మానస్ హౌస్ లో సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ ఇచ్చే విధంగా మాట్లాడుతున్నారని కొందరంటున్నారు. ఎందుకంటే మానస్ కూడా సీరియల్ లో.. నటిస్తున్న వ్యక్తి కాబట్టే అని చెప్పుకొచ్చారు.

Maanas got angry on bigg boss contestant Shivaji saying that he is spoiling others game

మరి కొంతమంది మానస్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. మరి కొంతమంది శివాజీ హౌస్ లో లేకపోతే ఈపాటికి.. సెలబ్రిటీల హవా నడిచేది. శివాజీ తన అద్భుతమైన గేమ్ ప్లానింగ్ తో ఒకపక్క కామన్ కంటెస్టెంట్లను కాపాడుతూ మరోపక్క తన గేమ్ ఆడుకుంటున్నాడు. ఈసారి సీజన్ లో బిగ్ బాస్ షోకి ఎక్కువ రేటింగ్స్ రావడానికి కారణం శివాజీ అంటూ రియాక్ట్ అవుతున్నారు. స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు జరిగిన ఆట తీరుబట్టి చూస్తే టాప్ ఫైవ్ లో మాత్రం కచ్చితంగా శివాజీ ఉంటారని అంటున్నారు. అంతేకాదు టైటిల్ ట్రోఫీలో కూడా ఎక్కువగా శివాజీ పేరే వినపడుతూ ఉంది.


Share

Related posts

Rashi Khanna: అలాంటి వాళ్ల‌కు నేను ఎప్పుడూ దూర‌మే అంటున్న రాశి ఖ‌న్నా!

kavya N

Krishnamma Kalipindhi iddarini: సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా చేస్తున్న హీరో ఈశ్వర్

bharani jella

ర‌ష్మికలో టెన్ష‌న్ టెన్ష‌న్‌.. అక్క‌డ పాప‌ ఎంట్రీ ఎలా ఉండ‌బోతోందో..?

kavya N